- Home
- Entertainment
- Prabhas-Radhe Shyam: రాధే శ్యామ్ టీమ్ నుండి సడన్ సర్ప్రైజ్... వైరల్ గా వర్కింగ్ స్టిల్స్
Prabhas-Radhe Shyam: రాధే శ్యామ్ టీమ్ నుండి సడన్ సర్ప్రైజ్... వైరల్ గా వర్కింగ్ స్టిల్స్
ప్రభాస్ చివరి చిత్రం సాహో (Saaho)విడుదలై రెండున్నరేళ్ళు అవుతుంది. మిర్చి మూవీ తర్వాత ప్రభాస్ 9ఏళ్లలో చేసింది కేవలం మూడు సినిమాలు. మరి అభిమానుల ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడం కష్టమే. కనీసం రెండేళ్లకు ఒక సినిమా కూడా చేయడం లేదు ప్రభాస్.

బాహుబలి (Bahubali) సిరీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ కొల్లగొట్టిన ప్రభాస్.. సాహో మూవీతో ఒకింత నిరాశపరిచాడు. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రభాస్ ఫ్యాన్స్ లో కూడా ఓ వర్గానికి నచ్చలేదు. సినిమాలో విషయం ఉన్నా.. మన ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. నార్త్ ఇండియన్స్ మాత్రం సాహో చిత్రాన్ని ఎగబడి చూశారు.
కాబట్టి ప్రభాస్ నుండి ఫ్యాన్స్ పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా కోరుకుంటున్నారు. రాధే శ్యామ్ (Radhe Shyam) మూవీ వాళ్ళ దాహం ఖచ్చితంగా తీరుస్తుందనే నమ్మకంతో ఉన్నారు. రాధే శ్యామ్ సినిమా కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉండగా... విడుదల వాయిదా అంటూ పిడుగు లాంటి వార్త పైన పడింది.
దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా కరోనా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. దీంతో థియేటర్స్ మూసివేయడం, యాభై శాతం సీటింగ్ కెపాసిటీతో నడపడం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రాధే శ్యామ్ వసూళ్లపై ఈ పరిస్థితులు ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా రాధే శ్యామ్ టీమ్ విడుదల వాయిదా వేశారు.
సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన రాధే శ్యామ్ వాయిదా పడింది. కరోనా ప్రభావం తగ్గి, సాధారణ పరిస్థితులు ఏర్పడితే మినహా.. రాధే శ్యామ్ విడుదల చేసే ఆస్కారం లేదు.
రెండు వారాలుగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. కాబట్టి రాధే శ్యామ్ విడుదలకు కనీసం రెండు మూడు నెలల సమయం పట్టవచ్చు.
రాధే శ్యామ్ వాయిదా కారణంగా నిరాశలో ఉన్న ఫ్యాన్స్ ని కొంతలో కొంత ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ. ఆయన సోషల్ మీడియాలో రాధే శ్యామ్ వర్కింగ్స్ స్టిల్స్ కొన్ని విడుదల చేశారు. ఈ వర్కింగ్స్ స్టిల్స్ నందు ప్రభాస్ ఆదిత్య వర్మగా సూపర్ హ్యాండ్సమ్ గా ఉన్నారు .
ఇక సదరు వర్కింగ్స్ స్టిల్స్ లో ప్రభాస్ (Prabhas) కి దర్శకుడు రాధాకృష్ణ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రభాస్ తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే, నటుడు జయరామ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం రాధే శ్యామ్ వర్కింగ్ స్టిల్స్ వైరల్ గా మారాయి.