- Home
- Entertainment
- Pooja Hegde:వణికిస్తున్న చలిలో సెగలు రేపుతున్న పూజా సొగసులు.. రెడ్ బాడీ కాన్ డ్రెస్ లో హొయలు పోతున్న అమ్మడు
Pooja Hegde:వణికిస్తున్న చలిలో సెగలు రేపుతున్న పూజా సొగసులు.. రెడ్ బాడీ కాన్ డ్రెస్ లో హొయలు పోతున్న అమ్మడు
వరుస హిట్స్ తో పాటు లక్కీ హీరోయిన్ అనే సెంటిమెంట్ కూడా తోడవడంతో పూజా హెగ్డే క్యారీ జెట్ వేగంతో దూసుకుపోతుంది. ఇటీవల పూజ హెగ్డే(Pooja hegde) నటించిన అన్ని చిత్రాలు విజయం సాధించాయి.

ఒక్క హిట్ అంటూ తపన పడిన అక్కినేని అఖిల్ దాహం కూడా పూజా తీర్చేసింది. పూజా తన సెంటిమెంట్ కొనసాగిస్తూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ రూపంలో మరో హిట్ కొట్టింది. ఈ సినిమా విజయం పూజా హెగ్డే పుణ్యమే అని పరిశ్రమ వర్గాలు చెప్పుకోవడం విశేషం.

చిరంజీవి- రామ్ చరణ్ (Ram charan) ల మల్టీ స్టారర్ ఆచార్య, ప్రభాస్ రాధే శ్యామ్ వంటి భారీ ప్రాజెక్ట్స్ పూజా హెగ్డే ఖాతాలో ఉన్నాయి. ఐతే సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన రాధే శ్యామ్ (Radhe shyam) వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దర్శకుడు రాధాకృష్ణ పీరియాడిక్ ఎమోషనల్ లవ్ డ్రామాగా రాధే శ్యామ్ తెరకెక్కించారు. ఇక రాధే శ్యామ్ ట్రైలర్ ఆకట్టుకుంది.
ఇక ఆచార్య 2022 ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఈ మూవీ సైతం వెనక్కి వెళ్ళే సూచనలు కలవు. ఆచార్య మేకర్స్ వాయిదా ఆలోచనల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మహేష్ తో దర్శకుడు త్రివిక్రమ్ మూవీ ప్రకటించగా... హీరోయిన్ గా పూజా పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో Mahesh, పూజ కాంబినేషన్ లో వచ్చిన మహర్షి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలాగే పవన్ తో హరీష్ శంకర్ చేస్తున్న భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో కూడా పూజా నటించే అవకాశం కలదు.
మొదట్లో పూజా నటనను చూసి పెదవి విరిచిన సినీ జనాలకు, మెల్లగా ఆమె అలవాటు అయ్యారు. ఆమెకు కూడా సినిమా సినిమాకు పరిపక్వత సాధిస్తూ, బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటున్నారు. ఈ మధ్య సొంతగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటుంది పూజా. అరవింద సమేత చిత్రానికి మొదటిసారి స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్న ఆమె, 2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో కూడా సొంత గొంతునే వాడుకున్నారు.
వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్న పూజా గ్లామర్ షో చేయడం ఆపడం లేదు. సోషల్ మీడియా వేదికగా ఆమె చేస్తున్న హాట్ ఫోటో షూట్స్ సంచలనం రేపుతున్నాయి. తాజాగా అమెజాన్ సంస్థ ఉత్పత్తుల ప్రచారం కోసం చాలా ట్రెండీగా సిద్దమైంది. పూజా లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.
లెక్కకు మించిన ఆఫర్స్ వస్తున్నా, అనుకోని వివాదాలు పూజాను చుట్టుముడుతున్నాయి. రాదే శ్యామ్ షూటింగ్ సెట్స్ లో పూజా ప్రవర్తనా తీరు ప్రభాస్ కి నచ్చలేదట. ఆమె టైం కి సెట్స్ రాకుండా డిలే చేయడంతో ప్రభాస్ అసహనం వ్యక్తం చేశారని కథనాలు వెలువడ్డాయి. అయితే అవన్నీ పుకార్లే అని చిత్ర యూనిట్, చెప్పుకొచ్చారు.
అలాగే ఒకప్పుడు ఇద్దరు స్టాఫ్ ని మైంటైన్ చేసిన ఆమె , ప్రస్తుతం ఏకంగా 12మంది స్టాఫ్ తో సెట్స్ కి వస్తున్నారట. వాళ్ళ ఖర్చులు అన్నీ నిర్మాతలే భరించాల్సి వస్తుందిట. రోజా భర్త దర్శకుడు ఆర్ కె సెల్వమణి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, పూజా హెగ్డే పై ఫైర్ అయ్యారు. అయితే వివాదాలకు దూరంగా ఉండే పూజా, ఈ కామెంట్స్ పై స్పందించకపోవడం విశేషం.