- Home
- Entertainment
- Raashi Khanna: విరహ వేదనతో పిచ్చెక్కించే పోజులిచ్చిన అందాల రాశి.. ఘాటు తట్టుకోలేక కుర్రాళ్లు విలవిల
Raashi Khanna: విరహ వేదనతో పిచ్చెక్కించే పోజులిచ్చిన అందాల రాశి.. ఘాటు తట్టుకోలేక కుర్రాళ్లు విలవిల
భారీ అందాల సోయగం రాశీఖన్నా.. వరుస సినిమాలతో బిజీగా ఉంది. గ్యాప్ తర్వాత ఆమె థియేటర్లో అలరించేందుకు వస్తోంది. అందులో భాగంగా ఆమె ట్రెండీ వేర్స్ లో కనువిందు చేస్తుంది.

రాశీఖన్నా నయా ఫోటోలను పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ని షేర్ చేసింది. ఇందులో ఆమె వైట్ డ్రెస్ ధరించి హోయలు పోయింది. విరహాలు పోతూ నెటిజన్లకి కనువిందు చేస్తుంది. కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంది.
రాశీఖన్నా అందాల ఘాటు మామూలుగా ఉండదు. ఆమె అందాల విందు పిచ్చెక్కించేలా ఉంటుంది. ఒకప్పుడు కాస్త పొదుపుగా కనిపించిన ఈ భామ ఇప్పుడు ఆరబోతలో బార్డర్స్ ని బ్రేక్ చేస్తుంది. అందం ఇతరులు చూడ్డానికే అనేలా తయారవుతుంది. గ్యాప్ లేకుండా గ్లామర్ ఫోటో షూట్లలో హాట్ పోజులిస్తూ కనువిందు చేస్తుంది.
ప్రస్తుతం రాశీఖన్నా `పక్కా కమర్షియల్` చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం జులై 1న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉంది రాశీఖన్నా. ట్రెండీ వేర్ ధరించి కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో, హాట్ పోజులతో మెస్మరైజ్ చేస్తుంది.
గోపీచంద్‌తో కలిసి రాశీఖన్నా `పక్కా కమర్షియల్` చిత్రంలో నటించింది. `జిల్`, `ఆక్సిజన్` తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమిది. తొలి చిత్రం విజయం సాధించింది.రెండో చిత్రం మెప్పించలేకపోయింది. ఇప్పుడు `పక్కా కమర్షియల్`తో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. మారుతి కాంబినేషన్‌లోనూ రాశీఖన్నాకిది రెండో చిత్రం కావడం విశేషం.
మరోవైపు నాగచైతన్యతో కలిసి `థ్యాంక్యూ`చిత్రంలో నటించింది రాశీఖన్నా. ఇందులో ఆమె మెయిన్ హీరోయిన్‌గా కనిపించింది. ఈ సినిమా జులై 22న విడుదల కాబోతుంది. దీంతోపాటు హిందీలో `యోధ`లో, తమిళంలో మూడు సినిమాలు చేస్తూ బిజీగాఉంది.
రాశీఖన్నా ఇప్పటి వరకు యంగ్ స్టర్స్ అందరితోనూ నటించింది. టాప్ స్టార్లతో మెప్పించలేకపోయింది. కేవలం ఎన్టీఆర్‌తో `జై లవకుశ`లో మెరిసింది. కానీ నెక్ట్స్ లెవల్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్లలేదు. ఇంకా యంగ్‌స్టర్స్ తోనూ జోడీ కడుతుందీ భారీ అందాల భామ. కెరీర్ పరంగా ఆమెకి బిగ్ బ్రేక్ రావాల్సిన అవసరం ఉంది.