- Home
- Entertainment
- నిండైన చీరలో మనసులు దోచేస్తున్న పూర్ణ అందాలు... తల్లయ్యాక మొదటిసారి అలా కనిపించిన ముద్దుగుమ్మ!
నిండైన చీరలో మనసులు దోచేస్తున్న పూర్ణ అందాలు... తల్లయ్యాక మొదటిసారి అలా కనిపించిన ముద్దుగుమ్మ!
ఫుల్ స్లీవ్ జాకెట్, డిజైనర్ శారీ ధరించి మెస్మరైజ్ చేశారు పూర్ణ. సాంప్రదాయ కట్టులో కూడా ఆమె గ్లామరస్ గా కనిపించారు. పూర్ణ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Purnaa
ఈ మధ్య పూర్ణ సడన్ షాక్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ నాకు పెళ్ళైపోయిందని చెప్పి మైండ్ బ్లాక్ చేసిన ఆమె తాజాగా తల్లిని అయ్యానంటూ మరోసారి దిమ్మతిరిగేలా చేశారు.
Purnaa
గర్భం దాల్చిన పూర్ణ తల్లి కాబోతున్న విషయం ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. పూర్ణ చెప్పిన శుభవార్త అభిమానుల్లో ఆనందం నింపింది. వారు ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేశారు.
Purnaa
లేటెస్ట్ ఫోటో షూట్ లో పూర్ణ తన బేబీ బంప్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఎర్లీ మంత్స్ కావడంతో పాటు ఆమె శారీ ధరించిన నేపథ్యంలో బేబీ బంప్ అంతగా ఫోకస్ కాలేదు. తల్లి అయిన ఆనందం పూర్ణలో స్పష్టంగా కనిపిస్తుంది.
Purnaa
గత ఏడాది పూర్ణ గోప్యంగా దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో పూర్ణకు వివాహం జరిగింది. నిశ్చితార్థం విషయం చెప్పి ఆమె వివాహం జరిగిన సంగతి దాచారు. అందరూ పెళ్లి ఎప్పుడని అడుగుతుంటే... ఆల్రెడీ జరిగిపోయిందని వెల్లడించారు.
Purnaa
మీడియాతో మాట్లాడుతూ పూర్ణ... 2022 మే 31న షానిద్ తో నాకు నిశ్చితార్థం జరిగింది. ఆ నెక్స్ట్ మంత్ జూన్ 12న దుబాయ్ లో వివాహం జరిగింది. కొన్ని కారణాల వలన అత్యంత సన్నిహితులు మాత్రమే మా వివాహానికి హాజరయ్యారని పూర్ణ వెల్లడించారు.ఇక ఇండియాలో ఉన్న బంధువులు, సన్నిహితులు, స్నేహితుల కోసం కేరళలో త్వరలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు పూర్ణ చెప్పుకొచ్చారు.
Purnaa
భర్త అనుమతితో వివాహం అనంతరం కూడా పూర్ణ కెరీర్ కొనసాగిస్తున్నారు. బుల్లితెరపై, సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేస్తున్నారు.. గత ఏడాది పూర్ణ నటించిన తీస్ మార్ ఖాన్ విడుదలైంది.
Purnaa
ఇక పూర్ణ కెరీర్ పరిశీలిస్తే ఆమెకు మంచి ఆరంభం లభించింది. పూర్ణ హీరోయిన్ గా నటించిన సీమటపాకాయ్, అవును లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. కొన్ని కారణాల వలన సినిమాలు వాడుకున్నాను, అది నా కెరీర్ కి మైనస్ అయ్యిందని పూర్ణ గతంలో వెల్లడించారు.
Purnaa
ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. హీరోయిన్ గా దాదాపు ఫేడ్ అవుటైన పూర్ణ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అఖండ, దృశ్యం 2 చిత్రాల్లో పూర్ణ ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కించుకున్నారు. అలాగే టెలివిజన్ షోస్ లో తన మార్కు ఎంటర్టైన్మెంట్ తో అలరిస్తున్నారు.
Purnaa
ఫుల్ స్లీవ్ జాకెట్, డిజైనర్ శారీ ధరించి మెస్మరైజ్ చేశారు పూర్ణ. సాంప్రదాయ కట్టులో కూడా ఆమె గ్లామరస్ గా కనిపించారు. పూర్ణ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.