- Home
- Entertainment
- JGM Movie Title Poster : పూరి, విజయ్ దేవరకొండ సెకండ్ పాన్ ఇండియా మూవీ షురూ.. టైటిల్ పోస్టర్ రిలీజ్..
JGM Movie Title Poster : పూరి, విజయ్ దేవరకొండ సెకండ్ పాన్ ఇండియా మూవీ షురూ.. టైటిల్ పోస్టర్ రిలీజ్..
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ క్రేజీ కాంబినేషన్ లో మరో పాన్ ఇండియన్ మూవీ షురూ అయ్యింది. తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.

పంచ్ డైలాగులు, పవర్ ఫుల్ సీన్లను చిత్రీకరించడంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) మేటీ. ఆయన టేకింగ్, వ్యూ పాయింట్ ఆడియెన్స్ కు తెగ నచ్చుతుంది. పూరి జగన్నాథ్ సినిమా షురూ అయిందంటే తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్ లో ఇప్పటికే పాన్ ఇండియన్ మూవీ ‘లైగర్’ Liger వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాన్నారు.
ఇదిలా ఉంటే... ఇప్పటికే లైగర్ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్న విజయ్ ఫ్యాన్స్, తెలుగు ఆడియెన్స్ కు పూరి జగన్నాథ్ మరో బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు. పూరి, విజయ్ కాంబినేషన్ లోనే మరో పాన్ ఇండియన్ మూవీ రాబోతున్నట్టు తెలిపారు.
ఈ మేరకు తాజాగా టైటిల్ పోస్టర్ ను ‘జేజీఎం’(JGM) పేరుతో రిలీజ్ చేశారు. పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. గగనతలంలో భారతీయ సైనికులు స్కై డైవ్ చేసినట్టు కనిపిస్తోంది. భారతదేశంలోని ఏదోక విపత్కర పరిస్థితిని అడ్డుకునే సైనికులు వార్ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తోంది.
మొత్తం విజయ్ దేవరకొండ ‘లైగర్’లో కిక్ బాక్సర్ గా.. జేజీఎం లో సోల్జర్ గా కనిపించనున్నాడు. అయితే విజయ్ ఈ మూవీ టైటిల్ టీజర్ కోసం హెలికాఫ్టర్ నుంచి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆర్మీ ఆఫీసర్ లుక్ లో మరికొంత మంది సోల్జర్స్ తో కలిసి ఆకట్టుకున్నాడు.
అయితే పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న ‘జేజీఎం’ (JGM) చిత్రమే ‘జన గన మన’ అయ్యి ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రెండో భారీ పాన్ ఇండియా మూవీని 2023 ఆగస్టు 23న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
JGM చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్, పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మాతలు వంశీ పైడిపల్లి, ఛార్మికౌర్ నిర్మిస్తున్నారు. లైగర్ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, యష్ జోహార్ నిర్మించగా.. ఈ ఏడాది ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.