MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • చిరంజీవి, అమితాబ్, రజనీ ఎవ్వర్నీ వదల్లేదు.. సౌందర్య చనిపోతుందని పదేళ్ల ముందే ఆయనకు ఎలా తెలుసు

చిరంజీవి, అమితాబ్, రజనీ ఎవ్వర్నీ వదల్లేదు.. సౌందర్య చనిపోతుందని పదేళ్ల ముందే ఆయనకు ఎలా తెలుసు

నటి సౌందర్య గురించి ఎంత చెప్పుకున్నా, ఏం మాట్లాడుకున్నా ఇంకా చాలా విషయాలు ఆమె జీవితంలో మిగిలే ఉంటాయి. ఆమె సినిమా రంగంలో కొనసాగింది కేవలం దశాబ్దం మాత్రమే. కానీ వందేళ్లు గుర్తుండిపోయేలా నటిగా సౌందర్య తన ప్రభావాన్ని చూపారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 27 2025, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Soundarya

Soundarya

నటి సౌందర్య గురించి ఎంత చెప్పుకున్నా, ఏం మాట్లాడుకున్నా ఇంకా చాలా విషయాలు ఆమె జీవితంలో మిగిలే ఉంటాయి. ఆమె సినిమా రంగంలో కొనసాగింది కేవలం దశాబ్దం మాత్రమే. కానీ వందేళ్లు గుర్తుండిపోయేలా నటిగా సౌందర్య తన ప్రభావాన్ని చూపారు. దురదృష్టవశాత్తూ సౌందర్య 2004లో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. 31 ఏళ్ళ చిన్న వయసులోనే సౌందర్య ప్రాణాలు వదిలారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Soundarya

Soundarya

సౌందర్య తండ్రి కేఎస్ సత్యనారాయణకి తన కుమార్తె అంటే ఎంతో ఇష్టం. సౌందర్య మరణం గురించి ఆమె తండ్రి సత్యనారాయణ ముందే తెలుసు అని ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు తెలిపారు. సౌందర్య ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఆమెతో, ఆమె తండ్రితో పరిచయం ఉంది. సౌందర్య తండ్రికి జ్యోతిష్యం పైన నమ్మకం ఎక్కువ. సౌందర్య ఇండస్ట్రీకి వచ్చే ముందే ఆమె జాతకాన్ని సత్యనారాయణ జ్యోతిష్యుల వద్ద చూపించారట. మీ కుమార్తె సినిమా రంగంలోకి వెళితే తిరుగులేని హీరోయిన్ అవుతుంది. జాతీయ స్థాయిలో ఆమెకి గుర్తింపు వస్తుంది.అయితే ఆమె ఇండస్ట్రీలో పదేళ్లు మాత్రమే కొనసాగుతుంది అని జ్యోతిష్యులు చెప్పారట. 

35

పదేళ్ల తర్వాత సౌందర్యకి పెద్ద గండం ఉన్నట్లు కూడా చెప్పారు. ఈ విషయాలని సత్యనారాయణ.. నిర్మాత చిట్టిబాబుతో షేర్ చేసుకున్నారట. కానీ ఆమెకి గండం ఉన్న విషయాన్ని మాత్రం పరోక్షంగా చెప్పారు. పదేళ్ల తర్వాత సౌందర్య ఇండస్ట్రీకి దూరం అయిపోతుంది అని అన్నారట. అప్పటికి సౌందర్యకి పెళ్లైపోయింది. కాబట్టి అలా చెప్పరేమో అని అనుకున్నా. కానీ ఆమె మరణించిన తర్వాతే ఆయన చెప్పిన మాటల్లో అర్థం తెలిసింది అని చిట్టిబాబు అన్నారు. 

45

సౌందర్య పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెని ఒకసారి కలిశా. అమ్మా మీ నాన్న చెప్పినవన్నీ నీ జీవితంలో జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది అని చెప్పారు. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్ ఇలా అన్ని భాషల్లో స్టార్ హీరోలందరితో నటించావు. ఇక మిగిలింది ఒక్కటే.. ఇండస్ట్రీ దూరంగా ఉంటూ నీ ఫ్యామిలీతో గడుపుతావు అని చెప్పారట. దీనికి సౌందర్య రియాక్ట్ అవుతూ అంత మాట మాట అన్నారేంటి సార్.. మా నాన్న చెప్పినవన్నీ జరిగాయి. ఇదొక్కటే తప్పు అని నిరూపిస్తా. మరణించే వరకు సినిమా రంగంలోనే కొనసాగుతా అని చెప్పింది. 

55

పైన తధాస్తు దేవతలు ఆశీర్వదించారో ఏమో నటిగా ఉన్నప్పుడే ఆమె మరణించింది అని చిట్టిబాబు తెలిపారు. 1993లో  సౌందర్య నటిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. దాదాపు 100 చిత్రాల్లో నటించింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
సౌందర్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image2
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image3
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved