MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మరో కొరటాల శివ అయ్యే సత్తా ఉందా ? మహేష్ తో పాటు రామ్ పోతినేనికి కూడా పెద్ద పరీక్షే

మరో కొరటాల శివ అయ్యే సత్తా ఉందా ? మహేష్ తో పాటు రామ్ పోతినేనికి కూడా పెద్ద పరీక్షే

సందేశాత్మక చిత్రాలని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి అద్భుతంగా తెరకెక్కించడంలో కొరటాల శివకి మంచి పట్టు ఉంది. టాలీవుడ్ లో మరో కొరటాల శివ రాబోతున్నట్లు నిర్మాత రవిశంకర్ అన్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 23 2025, 08:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రామ్ పోతినేని 'ఆంధ్రా కింగ్ తాలూకా'
Image Credit : Asianet News

రామ్ పోతినేని 'ఆంధ్రా కింగ్ తాలూకా'

యంగ్ హీరో రామ్ పోతినేని ఇటీవల కాలంలో సరైన హిట్ లేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ పోతినేని నటించిన వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. ఇప్పుడు రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా అనే వైవిధ్యమైన చిత్రంతో వస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. సినీ హీరోలకు అభిమానులు వీరాభిమానులు ఉంటారు. హీరోలని ఆరాధ్య దైవంలా ఆరాధించే కల్చర్ టాలీవుడ్ లో కూడా ఉంది. 

25
మహేష్ బాబుపై కామెంట్స్ 
Image Credit : Ram Pothineni, Bhagyashree Borse

మహేష్ బాబుపై కామెంట్స్ 

 ఇలాంటి కథాంశంతోనే దర్శకుడు మహేష్ బాబు పి.. ఆంధ్రా కింగ్ తాలూకా అనే చిత్రం తెరకెక్కించారు. ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో నిర్వహించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాత రవిశంకర్ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ దర్శకుడు మహేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Related Articles

Related image1
బుల్లితెరపై నటించి వివాహం చేసుకున్న 8 జంటలు..బ్రేకప్ చేసుకుని మళ్ళీ కలిసి పెళ్లి చేసుకున్నది ఎవరో తెలుసా ?
Related image2
బోయపాటి 10 సినిమాలలో హిట్లు ఎన్ని, ఫ్లాపులు ఎన్ని ? బాలయ్యతో మాత్రమే ఎక్కువ బ్లాక్ బస్టర్లు ఎందుకో తెలుసా ?
35
కొరటాల తర్వాత ఇతడే
Image Credit : Asianet News

కొరటాల తర్వాత ఇతడే

ఇటీవల కాలంలో తాను చూసిన బెస్ట్ రైటర్ అండ్ డైరెక్టర్ మహేష్ బాబు అని రవిశంకర్ అన్నారు. ఒక సందేశాత్మక కథకి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి అద్భుతంగా సినిమా తీయడంలో కొరటాల శివ ది బెస్ట్ అని చెప్పొచ్చు. శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ లాంటి సందేశాత్మక కథలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి కొరటాల శివ మ్యాజిక్ చేశారు. అలాంటి లక్షణాలు ఉన్న దర్శకుడు మహేష్ బాబు. ఈ యువ దర్శకుడు మరో కొరటాల శివ కావడం గ్యారెంటీ అని రవిశంకర్ తెలిపారు. 

45
నవంబర్ 27న రిలీజ్
Image Credit : Asianet News

నవంబర్ 27న రిలీజ్

మహేష్ బాబుకి రవిశంకర్ ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. నవంబర్ 27 మహేష్ తో పాటు రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే లకు పెద్ద పరీక్షే అని చెప్పాలి. మహేష్ బాబు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో హిట్ కొట్టారు. ఇప్పుడు ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రంతో సెకండ్ ఫిలిం జింక్స్ ని అధికమించాలి. 

55
ముగ్గురికీ పెద్ద పరీక్ష
Image Credit : Asianet News

ముగ్గురికీ పెద్ద పరీక్ష

రామ్ పోతినేని తన వరుస పరాజయాలకు ఈ చిత్రంలో అడ్డుకట్ట వేయాలి. రామ్ పోతినేని నటుడిగా ఎప్పుడో గుర్తింపు పొందారు. కానీ సక్సెస్ మాత్రం ఇటీవల కాలంలో ఎక్కువగా దక్కడం లేదు. మరోవైపు భాగ్యశ్రీ బోర్సే యువతకు క్రష్ గా మారిపోయింది. ఆమె గ్లామర్ లుక్స్ కి యువత ఫిదా అవుతున్నప్పటికీ.. ఆమెకి సరైన సక్సెస్ మాత్రం పడడం లేదు. ఆమె నటించిన తొలి చిత్రం మిస్టర్ బచ్చన్ డిజాస్టర్.. ఆ తర్వాత వచ్చిన కింగ్డమ్ పర్వాలేదనిపించింది కానీ పూర్తి స్థాయిలో మెప్పించలేదు. ఇటీవల వచ్చిన కాంత కూడా ఆకట్టుకోలేకపోయింది. సో నవంబర్ 27న మహేష్ బాబు పి, రామ్ పోతినేని, భాగ్య శ్రీ ముగ్గురికీ పెద్ద పరీక్షే అని చెప్పొచ్చు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Hey Balwanth Collections: `హే బలవంత్‌` మూవీకి అదిరిపోయే వసూళ్లు.. సుహాస్‌ పంట పండినట్టే
Recommended image2
Priyanka Chopra : పెళ్లికి ముందు డేటింగ్ చేసిన హీరోల సీక్రెట్స్ వెల్లడించిన ప్రియాంక చోప్రా, ఏం చెప్పిందంటే?
Recommended image3
రామ్ చరణ్ కి టీనేజ్ లో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా? మెగా మదర్ సురేఖ వెల్లడించిన టాప్ సీక్రెట్ ..?
Related Stories
Recommended image1
బుల్లితెరపై నటించి వివాహం చేసుకున్న 8 జంటలు..బ్రేకప్ చేసుకుని మళ్ళీ కలిసి పెళ్లి చేసుకున్నది ఎవరో తెలుసా ?
Recommended image2
బోయపాటి 10 సినిమాలలో హిట్లు ఎన్ని, ఫ్లాపులు ఎన్ని ? బాలయ్యతో మాత్రమే ఎక్కువ బ్లాక్ బస్టర్లు ఎందుకో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved