బాలయ్యకు అవార్డు రాకుండా అడ్డుకున్నప్పుడు మీరేం చేశారు... జయసుధకు నిర్మాత కౌంటర్
సీనియర్ నటి జయసుధ కామెంట్స్ కి నిర్మాత ప్రసన్న కుమార్ కౌంటర్ ఇచ్చారు. బాలయ్యకు కావాలని అవార్డు రాకుండా చేసినప్పుడు ఏం చేశారు అంటూ దాడికి దిగారు.

Jayasudha Balakrishna
సహజనటి జయసుధ(Jayasudha) తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక ఆరోపణలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు, పద్మ అవార్డుల కమిటీని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. టాలీవుడ్ లో తెలుగు నటులకు సరైన మర్యాద ఉండదు. ముంబై హీరోయిన్ కి మాత్రం ఆమె పెంపుడు కుక్కకు కూడా సపరేట్ రూమ్ ఏర్పాటు చేస్తారని జయసుధ ఆక్రోశం వెళ్లగక్కారు.
హీరో సెట్స్ కి రావడనికి గంట ముందే క్యారెక్టర్ ఆర్టిస్స్, జూనియర్ ఆర్టిస్ట్స్ ని పిలుస్తారు. జూనియర్ ఆర్టిస్స్ కనీసం కూర్చోవడానికి కూడా ఉండదు. హీరో వచ్చే వరకు నిలబడి ఎదురుచూస్తారు. ఓసారి హీరో దగ్గరకెళ్ళి అడిగేశాను, గంట ముందే మమ్మల్ని పిలిచి ఎందుకు వెయిట్ చేయిస్తున్నారని నిలదీశాను. నాకు తెలియదు ఆంటీ అన్న ఆ హీరో అందరినీ మంచిగా ట్రీట్ చేయాలని నిర్మాతకు చెప్పాడని జయసుధ వెల్లడించారు.
ఇక పద్మ అవార్డుల విషయంలో కూడా తెలుగు వాళ్లకు అన్యాయం జరుగుతుందని జయసుధ మండిపడ్డారు. పద్మ అవార్డులు తెలుగు నటులు పనికిరారా? వాళ్లకు అర్హత లేదా అని ప్రశ్నించారు. జయసుధ ఆరోపణలు టాలీవుడ్ లో ప్రకంపనలు రేపాయి. దీనిపై ఓ చర్చ మొదలైంది.
Jayasudha Balakrishna
కాగా అవార్డుల విషయంలో జయసుధ కామెంట్స్ కి నిర్మాత ప్రసన్న కుమార్ కౌంటర్ ఇచ్చారు. గతంలో జరిగిన కొన్ని సంఘటలను ప్రస్తావిస్తూ అప్పుడు ఏమి చేశారంటూ నిలదీశారు. శ్రీరామరాజ్యం సినిమాకు గాను బాలకృష్ణ(Balakrishna)కు నంది అవార్డు రావాల్సి ఉండగా కాంగ్రెస్ గవర్నమెంట్ అడ్డుకుంది. రాముడు చిత్రం కాబట్టి ఇది బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ వాళ్లకు చెందిన చిత్రం అంటూ బాలకృష్ణకు రావాల్సిన నంది అవార్డు మరో హీరోకి కేటాయించారు.
Jayasudha Balakrishna
ఆ ఏడాది జాతీయ అవార్డ్స్ లో కూడా శ్రీరామరాజ్యం చిత్రానికి అన్యాయం జరిగింది. కేంద్ర గవర్నమెంట్ కూడా రాజకీయ కోణంలో బాలయ్య చిత్రానికి అవార్డులు రాకుండా చేశారు. శ్రీరామరాజ్యంతో పాటు రాముడు, కృష్ణుడు ఉన్న పౌరాణిక చిత్రాలకు అవార్డులు రాకుండా చేశారు. ఆర్ ఎస్ ఎస్, బీజేపీపై కోపంతో ఇలా చేయడం జరిగింది.
శ్రీరామరాజ్యం చిత్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు జయసుధ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కనీసం నంది అవార్డు విషయంలో బాలయ్యకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆమె ఎందుకు మాట్లాడలేదు. ఇప్పుడు ఆమెకు నొప్పి తగిలింది కాబట్టి విమర్శలు చేస్తుంది... అంటూ ప్రసన్న కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ప్రసన్న కుమార్ ఆరోపణ నేపథ్యంలో జయసుధ ఎలా స్పందిస్తారో చూడాలి .