ప్రియాంక చోప్రా వందల కోట్ల విలువ చేసే అత్యంత లగ్జరీ ఇళ్లు ఎలా ఉందో చూశారా? జస్ట్ ఇది శాంపుల్ మాత్రమే..!
ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్ స్టార్. హాలీవుడ్ సినిమాలతో, అంతర్జాతీయ పాప్ సింగర్‌ని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. మరి అక్కడ ఆమె వందల కోట్లు విలువ చేసే ఇంటిని చూశారా? చూస్తే గూస్‌బమ్స్ రావడం ఖాయం. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే!
ప్రియాంక చోప్రా మూడేళ్ల వరకు బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది. తన అందచందాలతో, నటనతో కట్టిపడేసింది. దాదాపు అందరు సూపర్ స్టార్లతో నటించి మెస్మరైజ్ చేసింది.
ఇప్పుడు హాలీవుడ్ సినిమాలతో దూసుకుపోతుంది. ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు మూడేళ్ల క్రితం సింగర్ నిక్ జోనాస్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. సెటిల్ అంటూ అది మామూలు సెటిల్ కాదు, అత్యంత విలువైన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసి సెటిల్ అయ్యింది.
పెళ్లైన కొన్ని రోజులకే ప్రియాంక-నిక్ వందల కోట్ల విలువైన ఇంటిని లాస్ ఏంజెల్స్ లో కొనుగోలు చేశారు. దీని విలువ 20 మిలియన్స్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు 150కోట్లు(144) ఉంటుంది. చూడ్డానికి ఇది రాజభవనంని తలపిస్తుందని ఇంగ్లీష్ మీడియా వర్ణిస్తుంది.
యితే తన ఇంటికి సంబంధించిన ఫోటోలను ఎప్పుడూ పంచుకోలేదు ప్రియాంక. అడపాదడపా కిచెన్, హాల్‌లో సరదా టైమ్ పిక్స్ ని పంచుకుంది. కానీ తాజాగా ఇంటి ఫ్రంట్ సైడ్ పిక్‌ని పంచుకుంది ప్రియాంక.
ఇందులో స్విమ్మింగ్ ఫూల్ వైపు నుంచి ఇంటిని ఫోటో షేర్ చేసింది. ఇందులో స్విమ్మింగ్‌పూల్ దగ్గర బెడ్ ఉండగా, ఆ బెడ్‌పై సూర్యరశ్మీని పొందుతుంది ప్రియాంక.
ఈ ఇంట్లో ఏడు బెడ్ రూమ్స్ ఉన్నాయి. 11 బాత్‌రూమ్‌లున్నాయట. ఫ్రెండ్స్, బంధువులతో గడిపేందుకు సెపరేట్‌గా ఓ పెద్ద హాల్, కిచెన్, కిచెన్ పక్కన పెద్ద డైనింగ్ హాల్ ఉన్నాయి.
హుడ్‌తో కూడిన ఫర్నీచర్ ని డిజైన్ చేయించారు. ఫ్లోర్, ఇంటీరియర్ డిజైన్స్ అన్నీ చూడ్డానికి రాజభవనాన్ని తలపిస్తున్నాయి.
ఇదే కాదు ప్రియాంకకి ముంబయిలో జుహులో దాదాపు వంద కోట్ల విలువైన ఇళ్లు ఉందని సమాచారం.
ప్రియాంక సొంత ఆస్తులే 250కోట్లు ఉంటాయని తెలుస్తుంది. ఆమెకి రోల్స్ రాయ్స్ లగ్జరీ కార్ ఉంది. దీని విలువ 2.5కోట్ల విలువ ఉంటుంది.
అలాగే ఎస్ క్లాస్ మెర్సిడేజ్ బెంజ్ ఉంది. దీని విలువ 1.1కోట్లు ఉంటుందట. ఈ క్లాస్ బెంజ్, బిఎండబ్ల్యూ కారు, పోర్చ్స్ కార్ లున్నాయి. వీటి విలువ మొత్తం దాదాపు ఐదు కోట్లకుపైగానే ఉంటాయని టాక్.
ప్రస్తుతం ప్రియాంక ఒక్కో సినిమా 12-15కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటుంది. టెలివిజన్స్ కి రెండు కోట్లు తీసుకుంటుందట.ఈ లెక్కన ఈ అమ్మడు ఏడాది దాదాపు 18 నుంచి 20కోట్లు రెమ్యూనరేషన్‌గా పొందుతున్నట్టు సమాచారం.
ఇది కాకుండా ఇటీవల అమెరికాలో ఓ ఫుడ్ రెస్టారెంట్‌ని స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ప్రియాంక `సిటాడెల్`, `మ్యాట్రిక్స్ 4`, `టెక్ట్స్ ఫర్ యూ` వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.