- Home
- Entertainment
- పల్లవి ప్రశాంత్ తో నాకు మంచి బాండింగ్ ఉంది, వాడు నిజంగానే భూమి బిడ్డ..అల్లర్లపై ప్రియాంక కామెంట్స్
పల్లవి ప్రశాంత్ తో నాకు మంచి బాండింగ్ ఉంది, వాడు నిజంగానే భూమి బిడ్డ..అల్లర్లపై ప్రియాంక కామెంట్స్
ప్రియాంక మాట్లాడుతూ.. అభిమానం పేరుతో ఇలాంటి పిచ్చి పనులు చేయడం చాలా దారుణం. తాము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కార్లు కొంటాము. వాటిని ఇలా క్షణాల్లో నాశనం చేయడం కరెక్ట్ కాదు.

బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ గెలిచినప్పటికీ ఆ సంతోషం ఎక్కువ సేపు కొనసాగలేదు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన అల్లర్లలో పలు కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం అయ్యాయి. దీనితో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా అల్లర్లు ఆగలేదు. ఈ అల్లర్లని ఆపడంతో పోలీసులకు ప్రశాంత్ సహకరించలేదనే ఆరోపణ ఉంది.
bigg boss 7
పల్లవి ప్రశాంత్ తన అభిమానులని రెచ్చగొట్టే విధంగా వ్యహరించడంతో ఈ దాడులు జరిగాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కోర్టు పల్లవి ప్రశాంత్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. పోలిసుల తరుపున న్యాయవాదులు పల్లవి ప్రశాంత్ కి బెయిల్ ఇవ్వకూడదని వాదిస్తున్నారట.
ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ కి మద్దతుగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ చట్ట బద్దంగా త్వరలో బయటకి వస్తాడని శివాజీ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. శుభ శ్రీ, అశ్విని, సోహైల్ లాంటి వారంతా ప్రశాంత్ కి సపోర్ట్ గా కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ 7 ఫైనలిస్టులలో ఒకరైన ప్రియాంక జైన్ రీసెంట్ ఇంటర్వ్యూలో అభిమానులు వాహనాలపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించింది.
పల్లవి ప్రశాంత్ అభిమానుల పేరుతో కొందరు సృష్టించిన అల్లర్లలో బిగ్ బాస్ సెలబ్రిటీల వాహనాలు, బస్సులు ధ్వంసం అయ్యాయి. ప్రియాంక మాట్లాడుతూ.. అభిమానం పేరుతో ఇలాంటి పిచ్చి పనులు చేయడం చాలా దారుణం. తాము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కార్లు కొంటాము. వాటిని ఇలా క్షణాల్లో నాశనం చేయడం కరెక్ట్ కాదు. అభిమానం చూపించవచ్చు.. నచ్చని వారిని వ్యతిరేకించవచ్చు. కానీ ఇలా దాడులు చేయడం దుర్మార్గం.
అమర్ దీప్ కారుపై అటాక్ చేశారు. లోపల వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ ఉన్నారనే జ్ఞానం కూడా లేకుంటే ఎలా అంటూ ప్రియాంక ఫైర్ అయింది. హౌస్ లో మేము కేవలం టాస్కుల్లో మాత్రమే గొడవ పడతాం. మిగిలిన టైంలో చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అని ప్రియాంక తెలిపింది. నిజం చెప్పాలంటే చివరి నాలుగు వారాల్లో పల్లవి ప్రశాంత్ తో నాకు మంచి బాండింగ్ ఏర్పడింది.
Bigg Boss Telugu 7
శివాజీ, యావర్, అమర్, ప్రశాంత్, తనకి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ప్రియాంక పేర్కొంది. అందరం చాలా బాగా క్లోజ్ అయ్యాం. పల్లవి ప్రశాంత్ తో మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. వాడు నిజంగానే భూమి బిడ్డ అంటూ ప్రియాంక జైన్ కితాబిచ్చింది. ఈ ఇంటర్వ్యూ జరిగే సమయానికి ప్రశాంత్ అరెస్ట్ కాలేదు. దీనితో అరెస్ట్ గురించిన ప్రశ్నలు ఇంటర్వ్యూలో ఎదురుకాలేదు. బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్ ఎపిసోడ్ వరకు చేరుకున్న ఏకైక మహిళా కంటెస్టెంట్ ప్రియాంక.