- Home
- Entertainment
- Priyanka Mohan Waiting: ఆశలన్నీ ఈటీపైనే పెట్టుకున్న బ్యూటీ... ఈసారి సెట్ అవుతుందా..?
Priyanka Mohan Waiting: ఆశలన్నీ ఈటీపైనే పెట్టుకున్న బ్యూటీ... ఈసారి సెట్ అవుతుందా..?
తెలుగు తెరపై మెరిసి.. తమిళంలో హిట్స్ సాధిస్తున్న కన్నడ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహాన్. ఒక హిట్టు.. ఒక ప్లాపు ఫేస్ చేసుకుంటూ వెళ్తున్న ఈ బ్యూటీ.. ఆశలన్నీ ఈటీ సినిమాపైనే పెట్టుకుంది.

తెలుగు తెరకి పరిచయమైన కన్నడ భామలో ప్రియాంక అరుళ్ మోహన్ ఒకరు. కన్నడ సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన ప్రియాంక తెలుగులో ఫస్ట్ సినిమానే నేచరల్ స్టార్ నానీతో చేసింది. నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తన బ్యూటీతో తెలుగు ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది ప్రియాంక అరుళ్ మోహన్. ఆమెను అచ్చమైన తెలుగు హీరోయిన్ అనుకున్నారంతా. దాంతో వెంటనే మరో సినిమా అవకాశం దక్కించుకుంది. శర్వానంద్ తో శ్రీకారం చేసే ఛాన్స్ వచ్చింది ప్రియాంకకు.
శర్వానంద్ జోడీగా శ్రీకారం సినిమాలోను నటించింది ప్రియాంక అరుళ్ మోహన్. కాకపోతే ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్లకు సంబంధించినవి కావడం.. ఈమూవీకి ఫస్ట్ నుంచీ నెగెటీవ్ టాక్ రావడంతో.. శ్రీకారం ఫెయిల్యూర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. .
అయితే శ్రీకారం సినిమాలో ప్రియాంక మోహన్ గ్లామర్ కి .. నటనకు మంచి మార్కులు పడ్డాయిగానీ..ఈఎలిమెంట్స్ శ్రీకారం సక్సెస్ అవ్వడానికి ఏమాత్రం ఉపయోగపడలేదు. నిజానికి గ్యాంగ్ లీడర్ కూడా భారీ హిట్ ఏమీ కాదు. కాని ప్రియాంక అరుళ్ మోహన్ కు టాలీవుడ్ లో మంచి ఓపెనింగ్ ఇచ్చింది మూవీ.
దాంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ప్రియాంక అరుళ్ మోహన్ కోలీవుడ్ వైపు వెళ్లింది. అక్కడ యంగ్ స్టార్ శివకార్తికేయన్ జోడీగా డాక్టర్ సినిమాలో లో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు చాలా తక్కువ టైమ్ లో 100 కోట్ల జాబితాలో చేరిపోయింది.దాంతో ప్రియాంక మోహన్ కెరీర్ స్పీడ్ అందుకుంది.
మూడో సినిమాతో హిట్ కొట్టిన ప్రియాంకకు వెంటనే సూర్య సరసన చేసే అవకాశం వచ్చింది. సూర్య సరసన ఈటి సినిమాలో నటించింది ప్రియాంక మోహన్. ఈసినిమా ఈ నెల 10వ తేదీన థియేటర్లకు రానుంది. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాపైనే ప్రియాంక ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే తెలుగుతో పాటు అన్ని బాషల్లో అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ఉంది. ఇటు టాలీవుడ్ లో కూడా మళ్లీ జెండా పాతొచ్చని చూస్తుంది. మరి ఈసారి కూడా ప్రియాంక సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.
వరుసగా ఒక సినిమా హిట్టు.. ఒక సినిమా ప్లాప్ చూసిన ప్రియాంక. డాక్టర్ సినిమాతో హిట్ కొట్టింది. ఇప్పుడు ఈటీ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అన్న టెన్షన్ లో ఉంది. ఈటీ హిట్ అయితే తన కెరీర్ పరుగులు పెడుతుందని భావిస్తుంది ప్రియాంక అరుళ్ మోహాన్. స్టార్ హీరోయిన్ గా మారాలనే లక్ష్యంతో దూసుకుపోతోంది బ్యూటీ.