- Home
- Entertainment
- బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి షాకింగ్ కౌంటర్.. శృతి మించితే యాక్షన్ తప్పదంటూ హెచ్చరిక..
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి షాకింగ్ కౌంటర్.. శృతి మించితే యాక్షన్ తప్పదంటూ హెచ్చరిక..
`ఢీ` భామ ప్రియమణి తనపై వచ్చే ట్రోల్స్, బాడీ షేమింగ్ కామెంట్లపై స్పందించింది. ఊహించిన సమాధానం చెప్పింది. శృతి మించితే చర్యలు తప్పదంటూ హెచ్చరికలు జారీ చేసింది.

ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని అందుకున్న ప్రియమణి(Priyamani) నటిగా తానేంటో ఇప్పటికే నిరూపించుకుంది. గ్లామర్ పరంగానూ కూడా ఆమె హద్దులు చెరిపేసింది. కానీ ఇప్పుడు కాస్త పద్దతిగానే కనిపిస్తుంది. మల్టీపుల్ మాధ్యమాల్లో నటిగా తానేంటో నిరూపించుకుంటుంది. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది.
ప్రస్తుతం ప్రియమణి `ఢీ` డాన్స్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. మరోవైపు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో సినిమాలు చేస్తుంది. దీంతోపాటు వెబ్ సిరీస్‌లు, ఓటీటీ ఫిల్మ్ లు, టీవీ షోస్ లు చేస్తూ నిత్యం బిజీగా ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ రెట్టింపు అవకాశాలతో దూసుకుపోతుంది.
తాజాగా ఆమె ట్రోల్స్ పై, బాడీషేమింగ్స్ కామెంట్లపై స్పందించింది. జనరల్‌గా హీరోయిన్ల బాడీపై, వారు చేసే కామెంట్లపై ట్రోల్స్ వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రియమణి స్పందిస్తూ మీమ్స్ ని తాను ఎంజాయ్ చేస్తానని చెప్పింది. వాటిని చూసుకుని నవ్వుకుంటానని, కొన్నింటిని షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తానని పేర్కొంది ప్రియమణి.
సోషల్ మీడియా అనేది మన జీవితం కాదని, నేను అభిమానులకు ఏం చెప్పాలనుకున్నది మాత్రమే చెబుతానని, వాటిని స్వేకరిస్తే పర్వాలేదని, కానీ కొందరు ట్రోల్స్ చేస్తుంటారు. వారికి స్పందించే అధికారం ఉంది. కానీ అది శృతి మించితే మాత్రం ఊరుకోనని చెప్పేసింది. అలాంటి శృతి మించిన కామెంట్ల కళ్లేం వేస్తానని తెలిపింది.
శృతిమించిన కామెంట్లని తాను జీర్ణించుకోలేనని పేర్కొంది ప్రియమణి. అలాంటి వాటికి వెంటనే గట్టి సమాధానం ఇస్తానని, లేదంటే వారిని బ్లాక్ చేస్తానని పేర్కొంది. మరోవైపు బాడీ షేమింగ్‌పై వచ్చే ట్రోల్స్ పై రియాక్ట్ అవుతూ, శరీరాకృతిని మార్చుకోవడానికి వ్యాయామాలు చేయనని తాను చెప్పనని, మీ పట్ల మీరు సంతోషంగా ఉంటే చాలని, ఎవరి కామెంట్లని పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
జీరో ప్లస్ బాడీ ఉంటే, వాటిని పట్టించుకోవడం కంటే మీకు అవసరమైన వాటిపై దృష్టి పెట్టాలని పేర్కొంది. మీకు ఇష్టమైన పని చేయడానికి, మీరు ఆరోగ్యంగా ఉండేందుకు కొంత సమయం కేటాయించాలని పేర్కొంది. తేలికపాటి వ్యాయామాలు చేయండని తెలిపింది. సొంత పనులు చేసుకోవడం ద్వారా బాడీకి శ్రమ కలుగుతుందని తెలిపింది ప్రియమణి.
ప్రస్తుతం ఆమె `విరాటపర్వం` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు హిందీలో `మైదాన్`, అట్లీ-షారూఖ్ చిత్రంలో, తమిళంలో `క్వొటేషన్ గ్యాంగ్`, `కన్నడలో `సైనాయిడ్`, `డాక్టర్ 56`, `ఖైమారా` చిత్రాలు చేస్తుంది ప్రియమణి.