మంచు వర్షంలో విహరిస్తూ గంతులేస్తున్న బాలయ్య భామ.. బెస్ట్ బర్త్ డే అంటూ రచ్చ.. ఫోటోలు వైరల్
`అఖండ` బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె నాన్ స్టాప్‌గా ఎంజాయ్ చేస్తుంది. వెకేషన్‌లో రచ్చ రచ్చ చేస్తుంది.
హాట్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్(Pragya Jaiswal) రెండు రోజుల శుక్రవారం బర్త్ డే చేసుకుంది. ఫ్రెండ్స్ తో కలిసి ఆమె బర్త్ డే కేక్ కట్ చేసి తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. దానికి కంటిన్యూటీగా మరో పిక్స్ ని తాజాగా షేర్ చేసింది ప్రగ్యా జైశ్వాల్.
వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తుంది ప్రగ్యా. ఓ వైపు మంచు కురుస్తుండగా దాన్ని అందులో ఎంజాయ్ చేసింది. మంచులో గంతులేస్తూ, వెకేషన్‌లో విహరిస్తూ ఈ బర్త్ డేని చాలా ప్రత్యేకంగా మార్చుకుంది ప్రగ్యా జైశ్వాల్. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇందులో తన బర్త్ డే గురించి రాసుకొస్తూ, ` నేను నా పుట్టిన రోజు వారాంతంలో ఎలా గడపాలనుకుంటున్నాను. మంచుతో. ఈ సీజన్‌లోని మాయా హిమపాతంలో మేల్కొన్నాను. నేఉన ఇంకా ఎక్కువ అడగలేను` అని పోస్ట్ పెట్టింది ప్రగ్యా జైశ్వాల్.
ఈ బర్త్ డేని ఆమె హిమాలయాలకు నెలవైన కాశ్మీర్‌లో సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. లొకేషన్ చూస్తుంటే అని అనిపిస్తుంది. మొత్తంగా ఈ పుట్టిన రోజుని చాలా స్పెషల్‌గా చేసుకుంది ప్రగ్యా. ఎప్పటికీ గుర్తుండేలా సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. వణికే చలి ఓ వైపు, మంచు వర్షం మరోవైపు ఆ రెండింటిని ఎంజాయ్ చేస్తూ ఆ ఫీలింగ్‌ని అనుభవిస్తూ ఎంజాయ్ చేసింది ప్రగ్యా జైశ్వాల్. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
వరుస పరాజయాల్లో ఉన్న ప్రగ్యాకి బాలయ్య పెద్ద హిట్ ఇచ్చాడు. ఆయన హీరోగా నటించిన `అఖండ` చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 2021 డిసెంబర్‌లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో బాలయ్యకి జోడీగా చేసి మెప్పించింది. డిగ్నిటీతో కూడిన పాత్రలో వాహ్ అనిపించింది.
ఈ సినిమా విజయంతో ప్రగ్యా మళ్లీ పుంజుకుంటుందని, పూర్వ వైభవం వస్తుందని అంతా భావించారు. ఆమె కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అనుకున్నట్టుగా జరగడం లేదు. ఆమెకి కొత్తగా ఇప్పటి వరకు మరే ఆఫర్ రాకపోవడం గమనార్హం. దీంతో అప్పట్నుంచి ఇలా విహారయాత్రల్లోనే మునిగితేలుతుంది ప్రగ్యా. అదే సమయంలో నిత్యం గ్లామర్ ట్రీట్ ఇస్తూ మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. మరి ఇకపైనైనా ఈ బ్యూటీకి ఛాన్స్ లు వస్తాయేమో చూడాలి.