- Home
- Entertainment
- Pragya Jaiswal : చీర మాత్రమే కాదు మేని ఛాయ కూడా బంగారమే.. గోల్డ్ శారీలో మెరిపిస్తున్న ప్రగ్యా జైశ్వాల్
Pragya Jaiswal : చీర మాత్రమే కాదు మేని ఛాయ కూడా బంగారమే.. గోల్డ్ శారీలో మెరిపిస్తున్న ప్రగ్యా జైశ్వాల్
ప్రగ్యా జైశ్వాల్ బంగారు చీరలో మెరుపులు మెరిపిస్తుంది. రీసెంట్ గా బాలయ్య సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ప్రగ్యా ... ఇప్పటికైనా కలిసి వస్తుందని ఆశతో ఉంది. అవకాశాలు వస్తున్నా.. సక్సెస్ వస్తుందో లేదో.. అని భయపడుతుంది.

టాలీవుడ్ కు పరిచయం అక్కర్లేని పేరు ప్రగ్యా జైశ్వాల్. రీసెంట్ గా బాలయ్య అఖండతో సూపర్ సక్సెస్ సాధించింది ప్రగ్యా. చాలా కాలంగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న హీరోయిన్ కు అఖండా ఊరటనిచ్చింది. ఇకనైనా మంచి సినిమాలు పడతాయేమో అన్న ఆశతో ఉంది ప్రగ్యా జైశ్వాల్. అందుకే సోషల్ మీడియాలో నెటిజన్లకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ... అవసరమైనప్పుడు అందాల విందు చేస్తుంది.
తన అంద చందాలతో కుర్ర కారును మత్తెక్కిస్తోంది ప్రగ్యా జైశ్వాల్ చీరకట్టుతో చక్కగా తయారయ్యింది. బంగారు మేని వర్ణం కలిగిన ప్రగ్యా జైశ్వాల్.. బంగారు రంగు చీరలో మెరిసిపోతోంది. అయితే ఈ చీర కూడా 4 క్యారెట్ల బంగారంతో చేసినదే అంటోంది. చీరలో బుట్టబొమ్మలా ఉన్న ప్రగ్యా జైశ్వాల్ ఇన్ స్టాలో అందుకు సంబంధించిన పిక్స్ ను శేర్ చేసింది. సోషల్ మీడియాలో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. నిజంగా బంగారు బొమ్మలా ఉంది అంటున్నారు.
డేగ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పుణే భామ తక్కువ టైమ్ లోనే హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రగ్యా జైశ్వాల్.. యాక్ట్రెస్‌గా కంటీన్యూ అవుతున్న సక్సెస్ ఫుల్ కెరీర్ లేక ఇబ్బంది పడుతుంది. తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నా.. సక్కెస్ రేట్ లేదు ప్రగ్యా కు. అందుకే మంచి సినిమా పడకపోతుందా అనుకుంటుంది. అఖండతో ఆ ముచ్చట కూడా తీరింది. ఇక మంచి అవకాశలు పడటమే తరువాయి. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
ఇన్ స్టా గ్రామ్ లో ఎప్పటికప్పుడు ప్రగ్యా జైశ్వాల్ తన స్టన్నింగ్ ఫొటోస్ తో నెట్టింట అగ్గి రాజేస్తూనే ఉంటుంది. ఇప్పుడ కూడా స్లీవక లేస్ జాకెట్ తో పాలమీగడ సొగసులతో సందడి చేస్తుంది. బంగారు చీర.. చీరకు తగ్గ జువ్వెల్లరీతో దేవతలా ఉంది ప్రగ్యా. ఈ కాస్ట్యూమ్స్ కు తోడు తాను సిగ్గుపడుతూ ఫోటోలకు ఫోజిలిచ్చింది. ఈ ఫోటోస్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇప్పుడు ఇంత ట్రెడిషినల్ గా ఫోటోస్ పెట్టిన ప్రగ్యా గతంలో హాట్ హాట్ స్పైసీ ఫోటోస్ తో సందడి చేసింది. అవి చూసిన నెటిజన్లు హాట్, గార్జియస్ స్టన్నింగ్ ఏంజెల్ లుకింగ్, సో హాట్, సో బ్యూటిఫుల్, అంటూ తెగ కామెంట్లు చేశారు. తెలుగుతో పాటు ప్రజెంట్ ప్రగ్యా జైశ్వాల్ బాలీవుడ్ లో అంతిమ్.. ద ఫైనల్ ట్రూత్ లాంటి సినిమాలు కూడా చేస్తోంది.