MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • నువ్వు హీరో మెటీరియల్‌ కాదు, నువ్వు ఉమనైజర్‌వా? ఈ కాంట్రవర్సీకి కారణం ఎవరో తెలుసా? ఆమె వివాదాలకు కేరాఫ్‌

నువ్వు హీరో మెటీరియల్‌ కాదు, నువ్వు ఉమనైజర్‌వా? ఈ కాంట్రవర్సీకి కారణం ఎవరో తెలుసా? ఆమె వివాదాలకు కేరాఫ్‌

తమిళ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ని పట్టుకుని `నువ్వు హీరో మెటీరియల్‌ కాదు` అని, హీరో సిద్ధు జొన్నలగడ్డని పట్టుకుని `నువ్వు ఉమనైజర్‌వా?` అని లేడీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలు పెద్ద వివాదంగా మారాయి. మరి ఇంతకి ఆమె ఎవరనేది తెలుసుకుంటే. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Oct 15 2025, 05:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 `నువ్వు హీరో మెటీరియల్‌ కాదు`తో వివాదం
Image Credit : Asianet News

`నువ్వు హీరో మెటీరియల్‌ కాదు`తో వివాదం

సినిమా ప్రెస్‌ మీట్లలో ఇటీవల సెలబ్రిటీలకు సంబంధించిన వివాదాలు బాగా హైలైట్‌ అవుతున్నాయి. ముఖ్యంగా మీడియాతో `క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్స్` అనేది తరచూ వివాదంగా మారుతుంది. కొందరు సినిమా టీమే కావాలని ఇలాంటివి ప్లాన్‌ చేస్తుండగా, మరికొన్ని అనుకోకుండా వివాదాలుగా మారుతున్నాయి. అయితే గతంలోనూ ఇలాంటివి అడపాదడపా ఉండేవి. కానీ ఇటీవలే  హైలైట్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియా బాగా విస్తరించడంతో ప్రతిదీ పోస్ట్ చేయడంతో ఇవి హైలైట్‌ అవుతున్నాయి. ట్రోల్స్ కి, మీమ్స్ కి కారణమవుతున్నాయి. ఈ క్రమంలో ఆ మధ్య `డ్యూడ్‌` ప్రెస్‌ మీట్‌లో తమిళ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ని ఒక మహిళా జర్నలిస్ట్ `మీరు చూడ్డానికి హీరో మెటీరియల్‌ అనేలా ఉండరు. కానీ రెండు సినిమాలకే ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ వచ్చింది. ఈ సక్సెస్‌కి కారణం హార్డ్ వర్కా? లక్కా? ` అని ప్రశ్నించింది. దీంతో అది పెద్ద వివాదంగా మారింది. ఆ సమయంలో పక్కనే ఉన్న నటుడు శరత్‌ కుమార్‌ మైక్‌ తీసుకుని ఆ జర్నలిస్ట్ కి కౌంటర్‌ ఇచ్చాడు. హీరో అనే దానికి అర్థం ఏంటి? అని ప్రశ్నిస్తూ, ఇలానే ఉండాలనేది రూల్‌ లేదని, ప్రతిభ ఇక్కడ ముఖ్యం అని, ఆడియెన్స్ ని ఎంతగా ఎంటర్‌టైన్‌ చేస్తున్నారనేది ఇంపార్టెంట్‌ అన్నారు. అలా, ఇలా ఉన్న వాళ్లు హీరో కాకూడదనే రూల్‌ లేదంటూ ఆయన గట్టిగా ఇచ్చాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తనని అవమానించడంపై ప్రదీప్‌ స్పందన ఇదే
Image Credit : Asianet News

తనని అవమానించడంపై ప్రదీప్‌ స్పందన ఇదే

అయితే ఆ తర్వాత మరో ఇంటర్వ్యూలో హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ రియాక్ట్ అవుతూ, దానికి పెద్దగా ఫీల్‌ కాలేదని, ఎందుకంటే తాను చిన్నప్పట్నుంచి ఇలాంటి అవమానాలు ఫేస్‌ చేస్తున్నట్టు తెలిపారు. అనేక అవమానాలను చూస్తూ పెరిగానని, కాబట్టి అవి తనకు కొత్త కాదని చెప్పాడు. ఆల్‌రెడీ  అలాంటివి ఫేస్‌ చేశాను కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు. ఈ విషయాలు చెప్పే సమయంలో ఆయన కళ్లల్లో మాత్రం ఆ పెయిన్‌ కనిపిస్తోంది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. మరి ఇంతకి ప్రదీప్‌ రంగనాథన్‌ని అంతగా అవమానించిన ఆ జర్నలిస్ట్ ఎవరనేది తెలుసుకుంటే, పేరు లక్ష్మి. ఆమె వీ6 న్యూస్‌ ఛానెల్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ రిపోర్టర్‌గా పనిచేస్తోంది. గతంలో న్యూస్‌, పొలిటికల్‌ విభాగంలో పనిచేసిన ఆమె ఇప్పుడు సినిమా విభాగంలో పనిచేస్తోంది. గత నాలుగైదేళ్లుగా ఈ విభాగంలో వర్క్ చేస్తోంది.

35
`నువ్వు ఉమనైజర్‌ వా?` సిద్ధు కి షాక్‌
Image Credit : Asianet News

`నువ్వు ఉమనైజర్‌ వా?` సిద్ధు కి షాక్‌

అయితే లక్ష్మి సృష్టించిన వివాదం ప్రదీప్‌ రంగనాథన్‌ని సంబంధించినదే కాదు, గతంలోనూ చాలా ఉన్నాయి. ఇటీవలే మరో వివాదం కూడా క్రియేట్‌ చేసింది. `తెలుసు కదా` ట్రైలర్‌ ఈవెంట్‌లోనూ హీరో సిద్ధు జొన్నలగడ్డని ఇలాంటి ప్రశ్ననే అడిగింది. సినిమా ట్రైలర్‌లో హీరో ఉమనైజర్‌గా కనిపించడంతో, రియల్‌ లైఫ్‌లోనూ మీరు ఎలా ఉంటారు? ఇద్దరు అమ్మాయిలతో లవ్‌ ట్రాక్‌ నడిపించిన సందర్భాలున్నాయా? అంటూ ప్రశ్నించింది. దానికి సిద్ధు ఆచితూచి సమాధానం చెప్పారు. అది సినిమాలో హీరో పాత్ర అలా ఉంటుందన్నారు. రియల్‌ లైఫ్‌కి సంబంధించి ఇది తన పర్సనల్‌ ఇంటర్వ్యూ కాదని చెప్పారు. ఆ తర్వాత మరో సందర్భంలో ఈ ప్రశ్నపై ఆయన మాట్లాడుతూ, ఆమె అలా ప్రశ్నించడం అగౌరవమని, మైక్‌ ఉంది కదా అని ఏది పడితే అది అడగడం కరెక్ట్ కాదన్నాడు సిద్ధు.

45
కమిట్‌మెంట్‌పై అనన్యని ఆడుకున్న జర్నలిస్ట్
Image Credit : news buzz

కమిట్‌మెంట్‌పై అనన్యని ఆడుకున్న జర్నలిస్ట్

గతంలోనూ లక్ష్మి మరో పెద్ద రచ్చకి తెరలేపింది. తెలుగు హీరోయిన్‌ అనన్య నాగళ్లని `పొట్టేల్‌` మూవీ ప్రెస్‌ మీట్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి అడిగింది. హీరోయిన్లకి సినిమా ఒప్పుకునే ముందే, కమిట్‌మెంట్‌ కి సంబంధించి కూడా అగ్రిమెంట్‌ తీసుకుంటారట, నిజమేనా, మీరు అలాంటివి ఫేస్‌ చేశారా? అని అడిగింది. దానికి ఆ హీరోయిన్‌ షాక్‌ అయ్యింది. కమిట్‌మెంట్‌ అడుగుతారని మీకెలా తెలుసు అని తిరిగి ప్రశ్నించింది. అలాంటివి లేవని, తాను ఫేస్‌ చేయలేదని తెలిపింది. అలాంటి ఉంటే ఉండొచ్చు, అంతేకాని అవకాశం ఇచ్చేటప్పుడే ఇలాంటివి చేస్తారనేది పెద్ద బుల్‌షిట్‌ అని తెలిపింది అనన్య. ఈ విషయం పెద్ద వివాదంగా మారడంతో ఏకంగా ఫిల్మ్ ఛాంబర్‌ సీరియస్‌ అయ్యింది. మా అసోసియేషన్‌ కూడా దీన్ని సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఆ జర్నలిస్ట్ ఆ నటికి క్షమాపణలు చెప్పడం గమనార్హం.

55
ఈ వివాదాలపై జర్నలిస్ట్ వివరణ
Image Credit : news buzz

ఈ వివాదాలపై జర్నలిస్ట్ వివరణ

అయితే దీనిపై ఆ జర్నలిస్ట్ మాట్లాడుతూ, తాను ఇండస్ట్రీలో ఉన్న వాస్తవాల గురించే ప్రశ్నిస్తున్నాను. జనాల్లో అనేక అపొహలు ఉన్నాయి. వాటిని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాను. కానీ వాటిని తప్పుగా తీసుకుంటున్నారు. అవి తప్పుగా కన్వే అవుతున్నాయి. ప్రదీప్‌ రంగనాథన్ విషయంలోనూ తాను ఆయన ఎంత కష్టపడి ఎదిగాడో చెప్పించే ప్రయత్నం చేశాను. ఆయన స్ట్రగుల్స్ గురించి తెలియజేయాలని, టాలెంట్‌కి హీరో ఫిజిక్‌తో సంబంధం లేదని చెప్పించే ప్రయత్నం చేశాను. కానీ అది తప్పుగా కన్వే అయ్యింది. ఆయన్ని కించపరచాలనే ఉద్దేశ్యం అస్సలు లేదు. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేని వారికి కష్టాలు ఉంటాయి, అవమానాలుంటాయని అనేది తన అభిప్రాయమని వెల్లడించింది లక్ష్మి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Recommended image2
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image3
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Related Stories
Recommended image1
Pawan Kalyan: నీకు దండం పెడతాం, ఆ డైరెక్టర్‌తో మాత్రం సినిమా వద్దు.. పవన్‌కి ఫ్యాన్స్ రిక్వెస్ట్
Recommended image2
Prabhas: బర్త్ డే స్పెషల్‌ రీ రిలీజ్‌ అవుతున్న ప్రభాస్‌ చిత్రాలివే.. ఒకే రోజు మూడు సినిమాలు, ఇక పండగే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved