- Home
- Entertainment
- Prabhas Comments: `రాధేశ్యామ్` కథలో మరో ట్విస్ట్.. కృష్ణంరాజు విషయంలో టెన్షన్ పడ్డారట..
Prabhas Comments: `రాధేశ్యామ్` కథలో మరో ట్విస్ట్.. కృష్ణంరాజు విషయంలో టెన్షన్ పడ్డారట..
`పరమహంస` పాత్ర కోసం పెదనాన్న(కృష్ణంరాజు)ని అనుకున్నప్పుడు అంతా టెన్షన్ పడ్డారని అంటున్నారు ప్రభాస్. ఆయన్నీ ఎలా డీల్ చేయాలో అర్థం కాలేదని చెప్పారు. అంతేకాదు `రాధేశ్యామ్` కథలో మరో ట్విస్ట్ రివీల్ చేశారు ప్రభాస్.

ప్రభాస్(Prabhas) నటించిన `రాధేశ్యామ్`(Radheshyam) విడుదలకు సిద్ధమవుతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్‌లో బిజీగా గడుపుతుంది. ఇప్పటికే ముంబయి, చెన్నైలో ప్రమోషన్స్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు తెలుగులో స్టార్ట్ చేశారు. ఇప్పటికే దర్శకుడు రాధాకృష్ణ, నటి రిద్దీ, భాగ్యశ్రీ, హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇంటర్వ్యూలు కంప్లీట్ అయ్యాయి. తాజాగా సోమవారం యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఇందులో దర్శకుడు రాధాకృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర, సంగీత దర్శకుడు థమన్, హీరో ప్రభాస్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిత్రం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ప్రభాస్.
``బిల్లా` తర్వాత గోపీకృష్ణ మూవీస్‌లో చేస్తున్న సినిమా ఇది. ఇందులో పరమహంస పాత్ర కోసం పెదనాన్న కృష్ణంరాజుని తానే సజెస్ట్ చేశానని చెప్పారు. అయితే ఆయన్ని అనుకున్నప్పుడు అంతా టెన్షన్ పడ్డారు. `బిల్లా`లో కలిసి చేశాం. అది అంతగా వర్కౌట్ కాలేదు. ఫ్రెష్ సినిమాగా పేరొచ్చింది. రాధాని కథ చెప్పమంటే ఆయన టెన్షన్ పడ్డాడు. ఆయన ఇమేజ్ అలా ఉంటుందని, కానీ ఆయన ఆలోచనలు యంగ్‌స్టర్స్ కి దగ్గరగా ఉంటాయి. గోపీకృష్ణ మూవీస్‌లో సినిమా చేస్తున్నామంటే నాకూ ఓ టెన్షన్. పెదనాన్నకి ఓ హిట్ ఇవ్వాలని. బడ్జెట్ గురించి చెప్పినప్పుడు ఆయన ఎంతైనా ఫర్వాలేదు సినిమా బాగా రావాలని చెప్పారని అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు` అని తెలిపారు ప్రభాస్.
పరమహంస పాత్ర సినిమాకి చాలా ముఖ్యమైనదని, ఫిలాసఫీ ఆయన పాత్ర చుట్టూ తిరుగుతుంది. నాకు, ఆయనకు రెండు సీన్లు ఉంటాయి. ఆయన పాత్రలో ఎటకారం ఉంటుంది. కూల్‌గా ఉంటాడు. అన్నీ తెలిసిన బుద్దిడిలా ఉంటుందా పాత్ర` అని చెప్పారు ప్రభాస్.
ఇక సినిమా కథ విషయంలో మరో ట్విస్ట్ ఇచ్చారు డార్లింగ్. ఇప్పటి వరకు సినిమా పీరియాడికల్ లవ్ స్టోరీగానే ప్రొజెక్ట్ అయ్యింది. కానీ ఇందులో యాక్షన్ కూడా ఉంటుందట. అయితే ఫైట్స్ ఉండవని చెప్పారు. లవ్ థ్రిల్లర్ అని చెప్పారు ప్రభాస్. మరోవైపు దర్శకుడు రాధాకృష్ణ స్పందిస్తూ, ఇది కామిక్ లవ్ స్టోరీ అని తెలిపారు. ఫిలాసఫీ ప్రధానంగా సాగుతుందన్నారు. 300 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీశామని, కానీ వెయ్యికోట్ల రేంజ్ గ్రాండియర్‌గా ఉంటుందని, అంతటి ఫీల్‌నిస్తుందని చెప్పారు.
ప్రభాస్ ఇంకా చెబుతూ, `సినిమాని మేం ఒకలా ఊహించుకున్నాం. క్లాసిక్ టచ్‌లో ఉంటుందని భావించాం. వెరైటీ సినిమా అనుకున్నాం. కానీ థమన్ ప్రాజెక్ట్ లోకి వచ్చాక సినిమా స్టయిలే మారిపోయింది. వేరే సినిమా చూపించాడు. ఆయన ఆర్‌ఆర్, బీజీఎంతో సినిమాని వేరే లెవల్‌కి తీసుకెళ్లారు. మరింత గ్రాండియర్‌గా చేశారు. దీంతో మేమే షాక్ అయ్యాం. ఈ సినిమాని ఇలా చూడాలా అనే ఫీలింగ్ కలిగింది` అని చెప్పారు. సినిమాలో షిప్ ఎసిపోడ్ కోసం దర్శకుడు రెండేళ్లు కష్టపడినట్టు చెప్పాడు ప్రభాస్. దానికోసం చాలా హార్డ్ వర్క్ చేశామని తెలిపారు.
ఇదిలా రియల్ లైఫ్‌లో తాను ఆస్ట్రాలజీని నమ్మనని చెప్పారు ప్రభాస్. కథ వచ్చినప్పుడు ఇదేంటీ తాను జాతకాలు, జ్యోతిష్యం నమ్మం కదా అనుకున్నారట. కానీ కథ చెప్పాక ఎగ్జైజ్ అయినట్టు చెప్పారు. లవ్ స్టోరీ అనుకున్నప్పుడు కూడా మనతో వర్కౌట్ అవుతుందా అనే ఫీలింగ్ కూడా కలిగిందన్నారు ప్రభాస్.
ఈ సందర్భంగా అమితాబ్(Amitabh) బచ్చన్ గురించి చెప్పారు. ఆయన `రాధేశ్యామ్` చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచారు. పైగా `ప్రాజెక్ట్ కే`లో కలిసి నటిస్తున్న నేపథ్యంలో అమితాబ్ గురించి ప్రభాస్ చెబుతూ, ఆయనతో కలిసి నటించాలనేది తన డ్రీమ్ అన్నారు. కానీ ఆయన ఇమేజ్‌కి, ఆరాకి అతీతంగా చాలా నార్మల్‌గా ఉంటారని, ఎక్కడా ఆ ఇమేజ్ కనిపించదని, అది ఆయన గొప్పతనమని తెలిపారు. ఇక నెక్ట్స్ ఓ కామెడీ ఫిల్మ్ చేస్తున్నట్టు తెలిపారు ఆ విషయాలు త్వరలో చెబుతానన్నారు.