- Home
- Entertainment
- ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నోడిని గుర్తుపట్టారా? రూ.2000 కోట్లు కలెక్ట్ చేసిన సూపర్ స్టార్.. వేల కోట్లకు అధిపతి
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నోడిని గుర్తుపట్టారా? రూ.2000 కోట్లు కలెక్ట్ చేసిన సూపర్ స్టార్.. వేల కోట్లకు అధిపతి
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నోడిని చూశారా? చాలా క్యూట్‌గా కనిపిస్తోన్న ఈ కుర్రాడు ఇప్పుడు ఇండియాన్ సినిమాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్.

ఈ చిన్నోడిని గుర్తు పట్టారా?
కొందరు హీరోలు చిన్నప్పుడు ఎలా ఉంటారో, ఇప్పుడు కూడా అలానే కనిపిస్తారు. ఆ రూపురేఖలు తెలిసిపోతాయి. కానీ కొందరిని గుర్తుపట్టడం కష్టం. తాజాగా ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్. రెండు వేల కోట్ల కలెక్షన్లు రాబట్టిన హీరో. అంతేకాదు వేల కోట్లకు అధిపతి. మరి ఇంతకి ఆ హీరో ఎవరో గుర్తొచ్చారా?
KNOW
ఆ చిన్నోడు ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్
ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో కాదు, ప్రస్తుతం టాలీవుడ్‌ని శాసిస్తున్న, ఇండియన్ సినిమాని షేక్ చేస్తోన్న మన డార్లింగ్ ప్రభాస్. చిన్నప్పుడు ఇలా క్యూట్‌గా ఉన్నారు. ప్రభాస్ చిన్నపుడు తీసుకున్న ఫోటో ఇది. డార్లింగ్‌ది విజయనగరం రాజుల ఫ్యామిలీ. వాళ్ల నాన్న ఉప్పలపాటి సూర్యనారాయణరాజు నిర్మాత. పెదనాన్న కృష్ణంరాజు టాలీవుడ్‌లో రెబల్ స్టార్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు వారసత్వాన్ని పునికి పుచ్చుకుని సినిమాల్లోకి వచ్చారు ప్రభాస్.
`ఈశ్వర్` సినిమాతో హీరోగా ప్రభాస్ ఎంట్రీ
`ఈశ్వర్` సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. జయంత్ సీ పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి నటుడు కొల్లా అశోక్ కుమార్ నిర్మాత. ఇందులో ప్రభాస్‌కి జోడీగా శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్‌గా నటించింది. 2002లో విడుదలైన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. యావరేజ్‌గా నిలిచింది. ఆ తర్వాత `రాఘవేంద్ర`తోనూ ఫెయిల్యూర్‌ని చవిచూశారు. ఈ క్రమంలో వచ్చిన `వర్షం` మూవీ ప్రభాస్ కెరీర్ పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ మూవీతో ప్రభాస్ కెరీర్ మారిపోయింది.
`బాహుబలి`తో ఇండియన్ సినిమా లెక్కలు మార్చిన ప్రభాస్
ఆ తర్వాత `అడవి రాముడు`, `చక్రం` చిత్రాలు డిజప్పాయింట్ చేశాయి. రాజమౌళితో చేసిన `ఛత్రపతి` డార్లింగ్‌ని స్టార్ హీరోని చేసింది. ఇది అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ వరుసగా పరాజయాలు వెంటాడాయి. `పౌర్ణమి`, `యోగి`, `మున్నా`, `బుజ్జిగాడు`, `బిల్లా`, `ఏక్ నిరంజన్` చిత్రాలు ఆడలేదు. `డార్లింగ్` యావరేజ్‌గా ఆడింది. `మిస్టర్ పర్‌ఫెక్ట్` కూడా సేమ్ రిజల్ట్. `రెబల్` డిజాస్టర్. అనంతరం `మిర్చి`తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. తర్వాత `బాహుబలి`తో ఇక తెలుగు సినిమానే కాదు, ఇండియన్ మూవీ లెక్కలు మార్చేశారు డార్లింగ్. `సాహో`, `రాధేశ్యామ్,` ఆదిపురుష్` ఆడలేదు. `సలార్`తో హిట్ అందుకున్నారు. `కల్కి`తో మరో హిట్ కొట్టారు. `కన్నప్ప`లో కాసేపు మెరిశారు. ఇక ఇప్పుడు `ది రాజా సాబ్`, `ఫౌజీ` సినిమాలు చేస్తున్నారు. వీటితోపాటు `స్పిరిట్`, ప్రశాంత్ వర్మ మూవీ`, `సలార్ 2`, `కల్కి 2` చిత్రాల్లో నటించాల్సి ఉంది.
వేల కోట్లకు అధిపతి ప్రభాస్
ప్రభాస్ నటించిన `బాహుబలి 2` సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1800కోట్ల వసూళ్లని రాబట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాతనే తెలుగుతోపాటు ఇండియాలో పాన్ ఇండియా మూవీస్ కల్చర్ పెరిగింది. వరుసగా అలాంటి భారీ బడ్జెట్ చిత్రాలే వస్తున్నాయి. మరోవైపు రాజుల ఫ్యామిలీకి చెందిన ప్రభాస్ వందల వేల కోట్లకు అధిపతి. వారికి సొంతూరులో అనేక ఆస్తులున్నాయి. అదే సమయంలో వందల ఎకరాల భూములున్నాయి. వాటి విలువ వేల కోట్లు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.