Radhe Shyam movie story: రాధే శ్యామ్ కి మగధీర టచ్.. అసలు కథ ఇదేనా ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 11న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండడంతో చిత్ర యూనిట్ తిరిగి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 11న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండడంతో చిత్ర యూనిట్ తిరిగి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. ఇటీవల విడుదలైన సెకండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచేసింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
ప్రారంభం నుంచి రాధే శ్యామ్ చిత్రం విధికి ప్రేమకు మధ్య జరిగే యుద్ధంగా ప్రచారం అవుతోంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ఇటలీ, ఇండియాలో కళ్ళు చెదిరే విజువల్స్ తో తెరకెక్కించారు. ప్రభాస్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్ర కథపై ప్రేక్షకుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అలాగే ఉత్కంఠ కూడా నెలకొంది.
ఈ కథలో ప్రేమ గెలుస్తుందా.. విధి గెలుస్తుందా.. ఎండింగ్ ఎలా ఉండబోతోంది అంటూ అభిమానుల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాధే శ్యామ్ కథ గురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. సినిమా ప్రారంభం అయినప్పుడు ఇది పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్న కథ అంటూ వార్తలు వచ్చాయి.
ఈ చిత్రంలో ప్రభాస్ కార్ల వ్యాపారిగా కనిపిస్తాడని ప్రచారం జరిగింది. ఆ తర్వాత దీని గురించి ఆ ఊసే లేదు. ఇప్పుడు మాత్రం ప్రభాస్ ఈ చిత్రం హస్త సాముద్రికా నిపుణుడిగా విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్నాడు అంటూ టీజర్స్, ట్రైలర్స్ లో చూపించారు. అసలు కథ రివీల్ చేయకుండా దర్శకుడు రాధాకృష్ణ ఇలా చేస్తున్నాడు అంటున్నారు.
ఈ చిత్రంలో ఎక్కువ భాగం కథ విక్రమాదిత్యదే ఉంటుంది. కానీ ఇందులో గత జన్మల నేపథ్యం కూడా ఉందని అంటున్నారు. కొంచెం మగధీర కథతో పోలికలు ఉంటాయట. విక్రమాదిత్య.. ప్రేరణ (పూజా హెగ్డే) చేయి చూసి ఆమె భవిష్యత్తుతో పాటు పాస్ట్ అంటే గత జన్మని కూడా పసిగడతాడట. గత రెండు జన్మల్లో వీరిద్దరి ప్రేమ విఫలం అవుతూ ఉంటుంది. ఒక జన్మలో ట్రైన్ యాక్సిడెంట్ లో వీరిద్దరూ చనిపోతారు.
వీరిద్దరూ కలవాలన్న ప్రతి సారీ ఇలా ఎదో ఒక ప్రమాదమో, ప్రకృతి విపత్తో వస్తుంది. వీరిద్దరి ప్రేమకు విధి అడ్డుపడుతూ ఉంటుంది. మూడవ జన్మలో విక్రమాదిత్య, ప్రేరణలుగా జన్మిస్తారు. ప్రేరణ చేతి రాతల్ని చూసినప్పుడు ప్రభాస్ ఊహించని భావోద్వేగానికి గురవుతాడు. ఏం జరగబోతోందో అతడికి అర్థం అవుతుంది.
కానీ ఈ జన్మలో ఎలాగైనా విధిని ఎదిరించాలని డిసైడ్ అవుతాడు. విధితో పోరాటం అంటే మాటలు కాదు. ఏదైనా బలమైన శక్తి వీరిద్దరి ప్రేమకు సహకరించాలి. అది జరిగిందా లేదా అనేది సముద్రంలో క్లయిమాక్స్ లో జరిగే షిప్ ప్రమాదంలో తేలుతుంది. సినిమాకు అసలు ట్విస్ట్ అదే. దర్శకుడు రాధా కృష్ణ కూడా ఆ సన్నివేశాలు మీ ఊహకు అందని విధంగా ఉంటాయని అంటున్నారు.