Projec K : భారీ డీల్ కు ప్రభాస్ ప్రాజెక్ట్ కే’ రైట్స్.. ఎన్ని కోట్లంటే?
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘ప్రాజెక్ట్ కే’(Project K). రీసెంట్ గా మూవీ నుంచి ఎగ్జైటింగ్ వీడియో విడుదల కాగా.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో హైబడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కే’ (Project K) ఒకటి. చిత్రాన్ని‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.
పాన్ వరల్డ్ గా రూ.550 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రముఖ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాను సరికొత్తగా, అత్యాధునిక వెహికిల్స్, టెక్నాలజీని ఉపయోగిస్తూ రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
న్యూ ఇయర్ స్పెషల్ చిత్రం నుంచి ఓ సర్ ప్రైజింగ్ వీడియో కూడా వచ్చి అంచనాలు పెంచేస్తోంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. సినిమా రిలీజ్ కు ఇంకా చాలా టైమ్ ఉండగానే ఇప్పటి నుంచే మూవీ రైట్స్ కోసం భారీ ధర పలుకుతుండటం విశేషం.
లేటేస్ట్ అప్డేట్ ప్రకారం.. ‘ప్రాజెక్ట్ కే’ నిజాం హక్కులను ఏషియన్ సునీల్ సిండికేట్ రూ.70 కోట్లతో దక్కించుకున్నట్టు తెలుస్తోంది. కేవలం నిజాంలోనే ఇంతటి ధరకు డీల్ కుదరడంతో సినిమా ఏ స్థాయిలో సంచనాలు సృష్టించబోతుందో అర్థం చేసుకోవచ్చు.
రీసెంట్ గా వచ్చిన సర్ ప్రైజింగ్ వీడియోలో ఒక టైర్ కోసమే చిత్ర యూనిట్ ఎంత శ్రమిస్తుందో చూడొచ్చు. ప్రతి చిన్న విషయంలోనూ నాగ్ అశ్విన్ జాగ్రత్త తీసుకుంటుండంతో సినిమా హాలీవుడ్ రేంజ్ లో వస్తుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక షూటింగ్ సైతం శరవేగంగా కొనసాగుతోంది.
ఇప్పటికే ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా వదిలిన పోస్టర్లకే ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ మేకింగ్ వీడియో వదలడం.. ఫీమెయిల్ ప్రొడ్యూసర్ స్వప్న దత్ కూడా ‘ఎన్ని అంచనాలైనా’ పెట్టుకోండి అంటూ కామెంట్స్ చేయడం సినిమాపై తారా స్థాయి హైప్ ను క్రియేట్ చేస్తోంది. ప్రభాస్ - దీపికా పదుకొణె (Deepika Padukone) జంటగా నటిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించనున్నారు.