MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Entertainment
  • షాకింగ్..ట్రోలింగ్ ఎఫెక్ట్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ డిలీట్ చేసిన 'ప్రాజెక్ట్ కె' టీమ్, అది మాత్రమే మార్చి..

షాకింగ్..ట్రోలింగ్ ఎఫెక్ట్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ డిలీట్ చేసిన 'ప్రాజెక్ట్ కె' టీమ్, అది మాత్రమే మార్చి..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ప్రాజెక్ట్ కె. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ఏ చిత్రమూ మెప్పించలేకపోయింది. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ ఇలా ప్రతి మూవీ ఆరంభంలో అంచనాలు పెంచడం ఆ తర్వాత చతికలబడడం జరుగుతూ వచ్చింది.

Sreeharsha Gopagani | Published : Jul 20 2023, 10:40 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ప్రాజెక్ట్ కె. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ఏ చిత్రమూ మెప్పించలేకపోయింది. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ ఇలా ప్రతి మూవీ ఆరంభంలో అంచనాలు పెంచడం ఆ తర్వాత చతికలబడడం జరుగుతూ వచ్చింది. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా డైరెక్టర్ నాగ అశ్విన్ పై నమ్మకంతో ఉన్నారు. 

26
Asianet Image

భారీ బడ్జెట్ లో పకడ్బందీ ప్లాన్ తో నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని అంతర్జాతీయ హంగులతో తెరకెక్కిస్తారని భావించారు. ఇప్పటి వరకు హంగామా అలాగే జరిగింది. ఫస్ట్ టీజర్ రిలీజ్ కోసమే భారీ ఖర్చుతో సాన్ డిగో లో ప్లాన్ చేశారు. దీనితో నాగ అశ్విన్ హాలీవుడ్ ని తలదన్నే చిత్రాన్నే ప్లాన్ చేస్తున్నారు అని అంతా భావించారు. దీనికితోడు కనివిని ఎరుగని విధంగా కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొనె, దిశా పటాని లాంటి స్టార్స్ నటిస్తున్నారు. 

36
Asianet Image

అయితే బుధవారం రోజు రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ ని, సినీ లవర్స్ ని తీవ్రంగా డిజప్పాయింట్ చేసింది. అంతే కాదు దారుణంగా ట్రోలింగ్ కి గురవుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్.. ఒక ఫోజులో చూపించిన విధానం ఏవీ వర్కౌట్ కాలేదు. ప్రభాస్ ఈ చిత్రంలో సూపర్ హీరోగా నటిస్తున్నాడు. దానికి తగ్గట్లుగా ఫ్యాన్స్ అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ అన్నింటినీ నీరుగార్చిందని నెటిజన్లు అంటున్నారు. 

46
Asianet Image

దీనితో సినిమాలో కంటెంట్, గ్రాఫిక్స్ పై కూడా అనుమానాలు కలుగుతున్నాయని నెటిజన్లు మీమ్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ప్రభాస్ హెయిర్ స్టైల్ చూస్తుంటే ఒక రోబోటిక్ బాడీకి తలా అతికించినట్లుగా ఉందని కూడా ట్రోలింగ్ జరుగుతోంది.  దారుణంగా ట్రోలింగ్ జరుగుతుండడంతో.. ప్రాజెక్ట్ కె టీం షాకింగ్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ని డిలీట్ చేసింది. 

56
Asianet Image

కొత్తగా మరో పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే ఫస్ట్ లుక్ కి.. ఈ పోస్టర్ కి పెద్దగా తేడా లేదు. ప్రభాస్ లుక్ లో ఎలాంటి మార్పు లేదు. కానీ ప్రభాస్ లుక్ స్పష్టంగా కనిపించేలా బ్యాగ్రౌండ్ మార్చి రిలీజ్ చేశారు. ప్రాజెక్ట్ కె అనే టైటిల్ లేకుండా ప్లేన్ గా ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. గ్రాఫిక్స్ కాస్త మార్చారు. ప్రభాస్ లుక్ అయితే అదే విధంగా ఉంది. అయితే ప్రాజెక్ట్ కె టీమ్ ఇలా ఎందుకు చేసింది అనేది అర్థం కావడం లేదు. 

66
Asianet Image

జరుగుతున్న ట్రోలింగ్ ని తగ్గించే ప్రయత్నం అయి ఉండొచ్చు. ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా నిరాశ చెందుతోంది అతడి లుక్ పట్ల.. లుక్ సేమ్ గా ఉండడంతో రిలీజైన కొత్త పోస్టర్ తో కూడా నిరాశ తప్పడం లేదు. ఇక అందరి చూపు శాన్ డిగో కామిక్ కాన్ లో రిలీజ్ చేయబోతున్న టీజర్ పైనే. ఫస్ట్ లుక్ తో ఏర్పడ్డ నెగిటివిటి ని పటాపంచలు చేసే విధంగా టీజర్ ఉండాలని ప్రభాస్ ఫాన్స్ కోరుకుంటున్నారు. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
నాగ్ అశ్విన్
ప్రభాస్
 
Recommended Stories
Top Stories