ప్రభాస్ కి 70 రోజులు చుక్కలు చూపించిన రాజమౌళి, ఎంత టార్చర్ పెట్టాడంటే?
రాజమౌళితో సినిమా అంటే అంత ఈజీ కాదు.. ఎంత పెద్ద స్టార్ అయినా.. జక్కన్న టార్చర్ కు రెడీగా ఉండాల్సిందే. అలా తట్టుకోగలిగితే.. సినిమా అద్భుతంగా వచ్చేది.. అవార్డులు సాధించేది. ఇక రాజమౌళి టార్చర్ గురించి రీసెంట్ గా ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

టాలీవుడ్ ను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్ళిన దర్శకుడు.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెలుగు సినిమా రేంజ్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్లాడు. హాలీవుడ్ స్థాయిలో మన సినిమాలను నిలబెట్టాడు. ఇండియన్ సినిమా అంటే మేమే అని విర్రవీగుతున్న బాలీవుడ్, కోలీవుడ్ ను పక్కాన కూర్చోపెట్టాడు. ప్రస్తుతం ఇండియాన్ సినిమా అంటే టాలీవుడ్ అనే రేంజ్ కు మన సినిమాను తీసుకెళ్లాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్నది టాలీవుడ్ నుంచే. భారీ బడ్జెటన్ సినిమాలు, 1000 కోట్ల కలెక్షన్ సినిమాలు కూడా టాలీవుడ్ నుంచే ఎక్కువగా వస్తున్నాయి.దీని అంతనటికీ కారణం రాజమౌళి వేసిన బలమైన పునాదే.
రాజమౌళితో పనిచేయడం అంటే అంత ఈజీ కాదు
రాజమౌళి డైరెక్షన్ లో పనిచేయడం అంటే అంత ఈజీ కాదు. చాలా కట్టుదిట్టమైన వర్క్ ఎథిక్‌తో ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు జక్కన్న. ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా వెనుక రాజమౌళి కష్టం దాగి ఉంది. ఆయన ఎంత కష్టపడతాడో.. ఆర్టిస్ట్ లు కూడా అంతే హార్డ్ వర్క్ చేయాలి అని అనుకుంటాడు. అంతే కాదు డైరెక్టర్ గా ఆర్టిస్ట్ లను గట్టిగా వాడి తనకు కావల్సిన సీన్ ను రాబట్టుకుంటాడు రాజమౌళి. రాజమౌళి వర్కౌ స్టైల్ లో ఉన్న కష్టాన్ని, నిబద్ధతను ఆయనతో పనిచేసిన హీరోలు, ఆర్టిస్టులు పలు ఇంటర్వ్యూల్లో వెల్లడిస్తూనే ఉన్నారు. జక్కన్నతో వర్క్ ఎంత టార్చర్ గా ఉంటుందనే విషయాన్ని ఆయనతో ఎక్కువ సినిమాలు చేసిన ఎన్టీఆర్ కూడా తరచూ గుర్తుచేసుకుంటూ ఉంటారు.
ప్రభాస్ కు చుక్కలు చూపించిన రాజమౌళి
తాజాగా బాహుబలి ది ఎపిక్ మూవీ రీ రీలీజ్ అయ్యింది. ఈ సినిమాకు భారీగా రెస్పాన్స్ కూడా వస్తోంది. భారీ గా కలెక్ట్ చేస్తుతంది మూవీ. అయితే ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా నిర్వహించిన స్పెషల్ ఇంటర్వ్యూలో హీరో ప్రభాస్ రాజమౌళి పనితీరు గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ప్రభాస్ మాట్లాడుతూ.. “కాలకేయ వార్ షూటింగ్ సమ్మర్ సీజన్‌లో జరిగింది. దాదాపు 70 రోజులు నాన్ స్టాప్ గా షూట్ జరిగింది. అప్పుడు వాతావరణం చాలా వేడిగా ఉండేది. సెట్‌లో ఉన్న ప్రతీ ఒక్కరూ చెమటల్లో తడిసి ముద్దయ్యేవాళ్లు. ఆ యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా కష్టమైనవే. అయినప్పటికీ రాజమౌళి ఎవరికీ హాలిడే ఇవ్వలేదు,” “నేను రాజమౌళికి చాలా సార్లు రిక్వెస్ట్ చేశాను..కనీసా నా సీన్స్ లేని రోజుల్లో మూడు రోజులు లీవ్ ఇవ్వు.. బాలీకి వెళ్లి వస్తా అని అడిగాను .. కానీ ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ‘పర్మిషన్ లేదు’ అనేశాడు.'' అని ప్రభాస్ అన్నాడు.
రాజమౌళి టార్చర్ మూమలుగా ఉండదు..
ప్రభాస్ మాట్లాడుతూ.. ''ఆ షూటింగ్ టైమ్ లో హోలీ పండగ కూడా వచ్చింది. కానీ రాజమౌళి ముందుగానే అందరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.. ఎవరైనా సెట్ లో ‘హోలీ చేసుకుంటే చంపేస్తాను అని. షూటింగ్ సెట్‌లో కలర్స్ పడితే విజువల్స్ మారిపోతాయి, కంటిన్యూయిటీకి ఇబ్బంది వస్తుంది అని చెప్పాడు. కానీసం హోలీ కూడా ఆడుకోనివ్వలేదు'' అని ప్రభాస్ బాహుబలి టైమ్ లో రాజమౌళితో పడ్డ కష్టాల గురించి వివరించాడు.
రాజమౌళి ఏమన్నాడంటే...
ప్రభాస్ సరదాగా చేసిన ఈ ఆరోపణలపై రాజమౌళి కూడా నవ్వుతూ స్పందించాడు. జక్కన్న మాట్లాడుతూ.. “నేను వార్నింగ్ ఇచ్చినా కూడా కొంతమంది హోలీ ఆడారు. వారు నా దగ్గరికి వచ్చి ‘హోలీ ఆడదాం’ అని అడిగితే, నేను ‘సెట్‌లో కలర్స్ పడితే విజువల్స్ పాడవుతాయి’ అని చెప్పాను. అప్పుడు వాళ్లు తెలివిగా కాలకేయులు అంతా బ్లాక్ కాస్ట్యూమ్‌లు వేసుకున్నారు కదా.. కారణంగా బ్లాక్ కలర్ తెచ్చుకుని హోలీ ఆడేశారు.. ఆ తరువాత నాకు ఆ విషయం తెలిసింది.” అని రాజమౌళి చెప్పారు. రాజమౌళి ప్రతి ఫ్రేమ్‌లో పర్ఫెక్షన్ కోసం ఎంత శ్రమపడతాడో, తన ఆర్టిస్టులను కూడా ఆ స్థాయిలో కష్టపెడతాడు. అలా చేయబట్టే సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో హిట్ అవుతున్నాయి. రికార్డులు సృష్టిస్తున్నాయి. ఆస్కార్ కూడా సాధించగలిగాయి.
రాజమౌళి గురించి పలు సందర్భాల్లో
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా వంటి నటీనటులు కూడా పలు సందర్భాల్లో రాజమౌళి కష్టపడి పనిచేసే తీరును ప్రశంసించారు. “రాజమౌళికి హాలిడే అనే కాన్సెప్ట్ ఉండదు. ఆయనకు కావలసిన అవుట్‌పుట్ వచ్చే వరకు ఎవరికీ బ్రేక్ ఉండదు. అదే కారణంగా ఆయన సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటాయి,” అని ప్రభాస్ చెప్పాడు. బాహుబలి సినిమా విడుదలైనప్పటి నుండి రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఇక ఇంత కష్టపడి 70 రోజులు షూటింగ్ చేసిన కాలకేయ యుద్ధ సన్నివేశం బాహుబలి చిత్రానికి అత్యంత కీలకంగా నిలిచింది. ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమ రూపురేఖలను మార్చేసింది.