MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ , చరణ్ స్టార్ హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ , చరణ్ స్టార్ హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

ప్రస్తుతం వందలకోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు కాని... ఒకప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా..రెమ్యునరేషన్ లక్షల్లోనే ఉండేది. ఆతరువాత కోట్లకుఎగబాకింది. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్లుగా ఉన్నటాలీవుడ్ హీరోలు తమ మొదటి సినిమాకు ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారోతెలిస్తు నిజంగా షాక్ అవుతారు. 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 03 2024, 08:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ ను క్రాస్ చేసి.. పాన్ వరల్డ్ ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఇండియాన్ సినిమా అంటే.. టాలీవుడ్ ముందు కనిపిస్తుంది. ఆతరువాతే బాలీవుడ్ అయినా..కోలీవుడ్ అయినా. అంత డిమాండ్ ఉంది మన హీరోలకు. దాంతో సినిమాల బడ్జెట్ పెరుగుతూ వస్తోంది.. హీరోల రెమ్యునరేషన్లు కూడా అదే రేంజ్ లో పెరుగుతూ వస్తున్నాయి. 

 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి.. పవర్ స్టార్ గా ఎదిగాడు పవన్ కల్యాణ. ఆయన ఫస్ట్ మూవీ  అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి.  1996లో వచ్చిన ఈసినిమాకు  ఆయన 5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక  ప్రస్తుతం సినిమాలు రాజకీయాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ ఒక సినిమా కోసం ఆయన 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. 

39

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా  టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. తండ్రిని మించిన తనయుడు అనిపించురకున్నాడు మహేష్ బాబు. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వచ్చిన రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసినా..హీరోగా మాత్రం  తన మొదటి రెమ్యూనరేషన్ గా 10 లక్షల రూపాయలను తీసుకున్నారట. ప్రస్తుతం 100 కోట్లకు దగ్గరలో ఉన్నట్టు సమాచారం. 
 

49

ఆర్ఆర్ఆర్ తో గ్లోబలర్ ఇమేజ్ ను మూటగట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి నట వారస్వంతో సినిమాలు మొదలుపెట్టిన తారక్.. ఆతరువాత సొంతంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సాధించాడు. ఇక ప్రస్తుతం 80 నుంచి 100 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట తారక్... కాని  తను చేసిన మొదటి సినిమా అయిన నిన్ను చూడాలని  కోసం 5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ను తీసుకున్నాడట జూనియర్ ఎన్టీఆర్. 

59

పాన్ వరల్డ్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు ఆరడుగుల అందగాడు యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్. పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును పొందుతున్నాడు. కోట్లకు పడగలెత్తిన ఈ స్టార్ హీరో..  తన మొదటి సినిమా అయిన ఈశ్వర్ సినిమా కోసం 15 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది… ఇక ప్రస్తుతం సినిమాకు 200 కోట్ల వరకు తీసుకుంటున్నాడట. 

69

గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తాను చాటుకున్నాడు.ఈ సినిమా పాన్ ఇండియాలో భారీ వసూళ్లను రాబట్టింది. ఇక తన మొదటి సినిమా కోసం 20 లక్ష రూపాయల వరకు తీసుకున్నాడట. ఇప్పుడు ఒక సినిమా కోసం దాదాపు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…
 

79

చిరంజీవి కొడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన రామ్ చరణ్ ఫస్ట్ చిరుత సినిమాతో తనదైన స్టైల్ లో నటించి సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు . చాలా స్టాలిన్ అండ్ మాస్ లుక్స్ లో ఈ సినిమాలో అదరగొట్టేసాడు రామ్ చరణ్ . ఈ సినిమా కోసం చాలానె కష్టపడ్డాడు చరణ్. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని ఒక సినిమాకి 100 కోట్లు రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి వచ్చారు . అయితే ఆయన ఫస్ట్ రెమ్యూనరేషన్ 50 లక్షలు అయిన సమాచారం.

89
Chiranjeevi

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమా రెమ్యూనరేష్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. మొదటి మూవీకి చిరు 1116 పారితోషికం తీసుకున్నారట. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు దాదాపు 50 నుంచి 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.
 

99

తన సినీ కెరీర్ ప్రారంభంలో ఆయన నటించిన మొదటి సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నువ్విలా వంటి సినిమాల్లో నటించినందుకు విజయ్ దేవరకొండ అసలు రెమ్యూనరేషన్ తీసుకోలేదట. ఇక తను సినిమాల్లోకి రాకముందు ట్యూషన్ చెప్పేవాడట. అందుకుగాను అతను కేవలం 500 రూపాయలు మాత్రమే తీసుకునేవాడినని అదే నా మొదటి రెమ్యూనరేషన్ అని చెబుతాడు. ప్రస్తుతం సినిమాకు 50 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నాడట రౌడీ హీరో. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Grand Launch: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ చూస్తే మతిపోవాల్సిందే.. స్పెషాలిటీ ఏంటంటే?
Recommended image2
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Recommended image3
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved