MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ‘కల్కి’ హిందీ వెర్షన్ కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి, ట్రేడ్ ఏమంటోంది?

‘కల్కి’ హిందీ వెర్షన్ కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి, ట్రేడ్ ఏమంటోంది?

హిందీలో  'కల్కి 2898 AD'లో అతిపెద్ద ఓపెనింగ్స్‌ రాబట్టిన మూవీగా నిలిచింది. రూ.20.50 కోట్లు ఆర్జించిన 'ఫైటర్'ని అధిగమించింది. ..

2 Min read
Author : Surya Prakash
Published : Jun 30 2024, 08:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Kalki

Kalki


ప్రభాస్‌ లేటెస్ట్ సెన్సేషన్  ‘కల్కి’భాక్సాఫీస్ దగ్గర రికార్డ్ లు  సృష్టిస్తోంది. ఇతిహాసానికి,  సైన్స్‌ను ముడిపెట్టి నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రభాస్‌తో (Prabhas) పాటు అగ్రనటీనటుల నటనకు ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ‘కల్కి’.. విడుదల తర్వాత కూడా హవా కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ దుమ్ము రేపుతోంది. మరి  నార్త్‌ లో అంటే హిందీ బెల్ట్ లో ఈ సినిమా కలెక్షన్స్ పరిస్దితి ఏమిటో చూద్దాం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
actor Prabhas movie Kalki 2898 AD

actor Prabhas movie Kalki 2898 AD


 హిందీ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  హిందీలో  'కల్కి 2898 AD'లో అతిపెద్ద ఓపెనింగ్స్‌ రాబట్టిన మూవీగా నిలిచింది. రూ.20.50 కోట్లు ఆర్జించిన 'ఫైటర్'ని అధిగమించింది. ..గత ఆరు నెలలుగా పెద్దగా హిట్ లేని హిందీ మూవీ ఇండస్ట్రీకి, ఈ సినిమా చాలా అవసరం అంటోంది అక్కడ మీడియా. దీపిక పదుకోని, అమితాబ్ అక్కడ సెన్సేషన్ కు కీలకంగా నిలుస్తున్నారు. ప్రభాస్ క్రేజ్ సరే సరి..బాహుబలిని ఇప్పటికి మర్చిపోలేకపోతున్నారు. 

37


శుక్రవారం వర్కింగ్ డే మినిమం డ్రాప్ నమోదు చేయగా, శనివారం నార్త్ లోని పెద్ద సిటీల్లో మల్టిఫ్లెక్స్ లు హౌస్ ఫుల్స్ అయ్యిపోయాయి. అయితే అక్కడ అనుకున్న స్దాయిలో ప్రమోషన్స్ చేయకపోవటంతో భాక్సాఫీస్ దగ్గర అద్బుతమైతే జరగటం లేదు. కానీ బాహుబలి 2 లాగ మెల్లిగా పుంజుకుని మౌత్ టాక్ తో రికార్డ్ లు క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. అల్టిమేట్ గా నార్త్ లో అతి పెద్ద హిందీ డబ్ ఫిల్మ్ గా అవతరిస్తుందని లెక్కలేస్తున్నారు. ఈ వీకెండ్ పూర్తయ్యాక అసలు లెక్కలు బయిటకు వస్తాయి.
 

47


యూఎస్‌, కెనడా, ఇతర ప్రాంతాల్లో ప్రీమియర్ డే సుమారు USD 4 మిలియన్ల వసూళ్లు రాబట్టిందని నివేదికలు సూచిస్తున్నాయి. Sacnilk మేరకు, 2022లో నార్త్ అమెరికా ప్రీమియర్‌లో USD 3.3 మిలియన్లను ఆర్జించిన 'RRR' రికార్డును ఇప్పుడు 'కల్కి' అధిగమించినట్లు తెలుస్తోంది.
 

57


నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని (Kalki 2898 AD) హాలీవుడ్‌ రేంజ్‌లో రూపొందించారు. దీంతో అక్కడి ప్రేక్షకులనూ ఈ సినిమా మెప్పిస్తోంది. నార్త్‌ అమెరికాలో ప్రీ సేల్‌ బుకింగ్స్‌లోనే పలు సినిమాల రికార్డులను బ్రేక్‌ చేసిన ‘కల్కి’.. రిలీజ్‌ తర్వాత అన్నిటిని దాటి టాప్‌లో నిలిచింది (Kalki North America collection). ప్రీమియర్స్‌ కలెక్షన్స్‌లోనే 3.8 మిలియన్‌ డాలర్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది. ప్రీమియర్స్‌లోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కలెక్షన్స్‌ క్రాస్‌ చేయడం విశేషం. ఈ సినిమా తర్వాత స్థానాల్లో ‘ఆర్‌ఆర్ఆర్‌’ (3.46మిలియన్లు), ‘సలార్‌’ (2.6M), ‘బాహుబలి2’ (2.45M)నిలిచాయి. 

67

ప్రీమియర్స్‌, మొదటిరోజు కలెక్షన్స్‌   కలిపి అమెరికాలో ‘కల్కి’ 5 మిలియన్‌ డాలర్లు వసూలుచేసింది. అమెరికాలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల్లో ‘కల్కి’ ఒక్క రోజులోనే 5వ స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాగే అత్యంత వేగంగా 5 మిలియన్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే బెంచ్‌ మార్క్‌ను క్రియేట్‌ చేయడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఈ వీకెండ్‌కు కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.
  

77


కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్ కేజీఎఫ్, బాహుబలి1,సాహో, జవాన్ తో సహా పలు పెద్ద సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. ఈ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ 250 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇదే జోరు కొనసాగితే ఈ సినిమా ‘పఠాన్’, ‘జవాన్’, ‘జైలర్’, బాహుబలి వంటి చిత్రాల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అనిపిస్తోంది. ఇది టీమ్ కు విపరీతమైన ఆనందాన్ని కలిగిస్తోంది.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
నాగ్ అశ్విన్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved