- Home
- Entertainment
- Prabhas in Unstoppable Show: ప్రభాస్ షర్ట్ ధర... ఒక సామాన్యుడు ఏడాది పాటు షాపింగ్ చేయవచ్చు!
Prabhas in Unstoppable Show: ప్రభాస్ షర్ట్ ధర... ఒక సామాన్యుడు ఏడాది పాటు షాపింగ్ చేయవచ్చు!
అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ ధరించిన షర్ట్ ధర వార్తలకు ఎక్కింది. అన్ స్టాపబుల్ షో కోసం ప్రభాస్ యెల్లో, గ్రీన్ కాంబినేషన్ కలిగిన మల్టీ కలర్ షర్ట్ ధరించారు. ఈ షర్ట్ నెటిజెన్స్ కి బాగా నచ్చింది. దీంతో ఆ షర్ట్ ని గూగుల్ చేశారు. వివరాలు బయటకు రాగా షర్ట్ ధర చూసి షాక్ అవుతున్నారు.

Prabhas
అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ సందడి చేయనున్నారు. ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలయ్య-ప్రభాస్ కాంబో ఎపిసోడ్ రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు. కారణం ప్రభాస్ టాక్ షోలలో పాల్గొనడు. ఆయన తన సినిమా ప్రమోషన్స్ అప్పుడు మాత్రమే బయట కనిపిస్తారు. సోషల్ మీడియా అసలు వాడరు. కాబట్టి అన్ స్టాపబుల్ షోకి ప్రభాస్ హాజరుకావడం గొప్ప విషయం.
Prabhas
అన్ స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రభాస్ ని బాలయ్య (Balakrishna)హోస్ట్ చేయనున్నాడు. అనేక ఆసక్తికర విషయాలు వీరి మధ్య చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి, హీరోయిన్స్ తో ఎఫైర్ రూమర్స్ తెరపైకి రానున్నాయి. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య మొహమాటం లేకుండా ప్రశ్నలు అడుగుతాడు. గెస్ట్ లైఫ్ లో ఉన్న వివాదాలు, పుకార్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు.
Prabhas
ప్రభాస్(Prabhas) వివాహం ఎందుకు చేసుకోవడం లేదనే ప్రశ్న అభిమానులతో పాటు సగటు మూవీ లవర్ ని వేధిస్తుంది. బాలయ్య ఈ చిక్కు ప్రశ్నకు ప్రభాస్ నుండి సమాధానం రాబడతాడని అందరూ నమ్ముతున్నారు. అలాగే ప్రభాస్ కి ఆల్కహాల్ హ్యాబిట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందంటారు. ఈ ప్రశ్న పలువురు గెస్ట్స్ ని బాలయ్య అడిగారు. తానైతే మాన్షన్ హౌస్ వేయాల్సిందే అని ఓపెన్ గా చెప్పాడు.డార్లింగ్ ని ఈ అలవాటుపై కూడా ప్రశ్నలు వేయవచ్చు. ప్రభాస్ తో హీరో గోపీచంద్ కూడా జాయిన్ అవుతున్న నేపథ్యంలో ఎపిసోడ్ కి ఎక్కడలేని హైప్ వచ్చి చేరింది.
Prabhas
కాగా ఈ షోలో ప్రభాస్ ధరించిన షర్ట్ ధర వార్తలకు ఎక్కింది. అన్ స్టాపబుల్ షో కోసం ప్రభాస్ యెల్లో, గ్రీన్ కాంబినేషన్ కలిగిన మల్టీ కలర్ షర్ట్ ధరించారు. ఈ షర్ట్ నెటిజెన్స్ కి బాగా నచ్చింది. దీంతో ఆ షర్ట్ ని గూగుల్ చేశారు. వివరాలు బయటకు రాగా షర్ట్ ధర చూసి షాక్ అవుతున్నారు.
Prabhas
ప్రభాస్ ధరించిన ఆ షర్ట్ పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మడ్రాస్ బటన్ డౌన్ షర్ట్. దీని ధర £ 115. ఇండియన్ కరెన్సీలో రూ. 11,618. ప్రభాస్ సంపాదనకు అది చాలా తక్కువ. అయితే ఒక సామాన్యుడు ఆ డబ్బుతో ఏడాదికి సరిపడా బట్టలు కొనుక్కోవచ్చు. సినిమాకు వంద కోట్లు తీసుకునే ప్రభాస్ ఆ రేంజ్ మైంటైన్ చేయకపోతే ఎలా చెప్పండి..
కాగా ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల షూట్స్ లో పాల్గొంటున్నారు. ఆదిపురుష్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. సలార్ వచ్చే ఏడాది విడుదల కానుంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఆదిపురుష్ వాయిదా పడింది. కొత్త తేదీ ప్రకటించాల్సి ఉంది.