బాలయ్య షోలో కృష్ణం రాజు మరణంపై ప్రభాస్ భావోద్వేగం.. నెలరోజులు పెద్దనాన్నతో ఆస్పత్రిలోనే అంటూ.!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తొలిసారిగా రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణంపై ఓపెన్ అయ్యారు. ఇఫ్పటికే బాలయ్య షోలో మొదటి ఎపిసోడ్ తో సందడి చేయగా.. రెండోవ ఎపిసోడ్ లో మాత్రం పెద్దనాన్నను తలుచుకుంటూ భావోద్వేగమయ్యారని తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నారు. అప్ కమింగ్ ఫిల్మ్స్ తో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇక రీసెంట్ గా డార్లింగ్ సెన్సేషనల్ టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2’కు గెస్ట్ గా హాజరైన విషయం తెలిసిందే.
నందమూరి నటసింహం హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈషోకు ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడంతో బుల్లితెర బ్లాక్ అయ్యింది. బాలయ్య - ప్రభాస్ ఎపిసోడ్స్ ను రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘బాహుబలి ఎపిసోడ్ 1’ను న్యూ ఇయర్ స్పెషల్ గా డిసెంబర్ 30న విడుదల చేశారు.
ఒకే సమయంలో అభిమానులు, ఆడియెన్స్ ను ఎపిసోడ్ ను వీక్షించడంతో ఓవర్ లోడ్ కారణంగా ‘ఆహా’ క్రాష్ అయ్యింది. దీంతో టెక్నీకల్ సిబ్బంది మళ్లీ హెవీ ట్రాఫిక్ ను తట్టుకునేలా మళ్లీ సర్వం సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 100 మిలియన్ల వ్యూయింగ్ మినిట్స్ తో రికార్డు క్రియేట్ చేసింది. ఇంకా వ్యూస్ కొనసాగుతూనే ఉంది.
అయితే మొదటి ఎపిసోడ్ లో బాలయ్య, ప్రభాస్ మధ్య ఫన్నీగా కన్వర్జేషన్ సాగింది. సినీ ఇండస్ట్రీనే ఏలుతున్న ప్రభాస్ చిన్నపిల్లాడిలా Unstoppable2 టాక్ షోలో సందడి చేయడం పట్ల అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక రెండో ఎపిసోడ్ Baahubali Episode 2 కోసం అంతా ఎదురుచూస్తున్నారు. రెండో ఎపిసోడ్ లో ప్రభాస్, గోపీచంద్ కలిసి సందడి చేయబోతున్నారు. జనవరి 6న ప్రసారం కాబోతోంది.
‘బాహుబలి ఎపిసోడ్ 2’లో ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు (Krishnam Raju)ను తలుచుకుంటూ భావోద్వేగం అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే వదిలిన ప్రోమోలో దివంగత కృష్ణం రాజుకు నివాళి అర్పిస్తూ స్పెషల్ ఏవీని ప్రదర్శించగా.. ప్రభాస్ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఫ్యాన్స్ తన పెద్దనాన్న మరణంపై పలు ప్రశ్నలు అడగడంతో ప్రభాస్ ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది.
ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ప్రభాస్ సమాధానాలు ఇస్తూ.. ‘ఈరోజు మేము ఇలా ఉన్నామంటే అది పెద్దనాన్న వల్లే. ఎప్పటికీ మేము ఆయనకు రుణపడి ఉంటాం. అప్పట్లోనే చెన్నైకి వెళ్లి 10 -12 ఏండ్లు విలన్ గా పనిచేసి.. సొంత బ్యానర్‌ను ప్రారంభించి మహిళా ప్రాధాన్యతతో చరిత్ర సృష్టించాడం గొప్ప విషయం. మా కుటుంబం అంతా ఆయన్ను చాలా మిస్సవుతున్నాం.. పెద్దనాన్న కన్నుమూయడానికి ముందు నెలపాటు అనారోగ్యంతో ఉన్నాడు. ఆ దశలో నేనూ ఆసుపత్రిలోనే ఉన్నాను. షూటింగ్ సమయంలోనూ నిరంతరం డాక్టర్లతో అప్డేట్స్ తెలుసుకున్నాను’ అంటూ ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది.