HBD Prabhas: బర్త్ డే స్పెషల్... ప్రభాస్ ని అమ్మాయిల కలల రాకుమారుడిగా మార్చిన 5 రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్!
హీరో ప్రభాస్ ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడతారు. మాస్ హీరోగా కెరీర్ ప్రారంభించిన ప్రభాస్ కి కొన్ని చిత్రాలు విపరీతమైన లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చాయి.
Prabhas
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే నేడు. 1979 అక్టోబర్ 23న జన్మించిన ప్రభాస్ 44వ ఏట అడుగుపెట్టాడు. దేశంలోనే అతిపెద్ద మాస్ హీరోగా ఎదిగిన ప్రభాస్ కెరీర్ ని మలుపు తిప్పింది మాస్ కమర్షియల్ చిత్రాలే. అయితే ఫస్ట్ హిట్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తో దక్కింది. కేవలం మాస్ హీరో ఇమేజ్ తో ముందుకు వెళుతున్న ప్రభాస్ కి కొన్ని చిత్రాలు విపరీతమైన ఫ్యామిలీ, లేడీ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. చివరికి మహేష్ బాబుకు ధీటుగా అమ్మాయిల్లో ప్రభాస్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ చిత్రాలు ఏమిటో చూద్దాం...
ప్రభాస్ మూడో చిత్రం వర్షం. శోభన్ దర్శకుడు. లవ్, రొమాన్స్, ఎమోషన్, యాక్షన్ కలగలిపి తెరకెక్కిన వర్షం 2004 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. త్రిష-ప్రభాస్ కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యింది. వర్షం మూవీతో ప్రభాస్ అటు మాస్ ఇమేజ్ తో పాటు లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు..
Darling
ప్రభాస్ కి విపరీతమైన లేడీ ఫాలోయింగ్ తెచ్చిన చిత్రం డార్లింగ్. ఈ చిత్రం విడుదల నాటికి ప్రభాస్ మాస్ ఇమేజ్ తో టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నాడు. దర్శకుడు కరుణాకరన్ కామెడీ, రొమాన్స్, ఎమోషన్, ఫ్యామిలీ అంశాలు మేళవించి తెరకెక్కించాడు. కాజల్ హీరోయిన్ గా నటించింది. డార్లింగ్ ఓ మోస్తరు విజయం సాధించింది.
ప్రభాస్ నటించిన మరొక రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మిస్టర్ పర్ఫెక్ట్. కాజల్ తో ప్రభాస్ మరోసారి జతకట్టాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఈ చిత్రంలో హైలెట్ గా ఉంటాయి. తాప్సి సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది. మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ హిట్ కొట్టింది.
Mirchi
మిర్చి సినిమాతో ప్రభాస్ మరోసారి అమ్మాయిల హృదయాలు దోచేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ సూపర్ గా ఉంటుంది. ఈ చిత్రంతో ప్రభాస్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరోసారి పెరిగింది. దర్శకుడు కొరటాల శివ డెబ్యూ మూవీ కాగా అనుష్క, రిచా గంగోపాధ్య హీరోయిన్స్ గా నటించారు.
Radhe shyam
రాధే శ్యామ్ సైతం అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. పూజా హెగ్డే-ప్రభాస్ కెమిస్ట్రీ హైలెట్ గా నిలిచింది.