MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'ఆదిపురుష్' డైరెక్టర్ పై ఆగ్రహంతో ప్రభాస్.. ఓం రౌత్ కి సీరియస్ వార్నింగ్, వీడియో వైరల్ ?

'ఆదిపురుష్' డైరెక్టర్ పై ఆగ్రహంతో ప్రభాస్.. ఓం రౌత్ కి సీరియస్ వార్నింగ్, వీడియో వైరల్ ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ విజువల్ వండర్ మూవీ 'ఆదిపురుష్'. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ ఆదివారం విడుదలయింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 03 2022, 09:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ విజువల్ వండర్ మూవీ 'ఆదిపురుష్'. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ ఆదివారం విడుదలయింది. ప్రేక్షకుల్ని, అభిమానులని టీజర్ తీవ్రంగా నిరాశపరిచింది అనే చెప్పాలి. ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నాడు అంటే ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

శ్రీరాముడిగా ప్రభాస్ పౌరాణిక పాత్రలో నటిస్తున్నాడు. సో అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా ఇలాంటి చిత్రం చేస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా మనోభావాలు ముడిపడి ఉంటాయి. ఆదర్శ పురుషుడు అయిన శ్రీరాముడిని భారతీయులు భక్తి శ్రద్దలతో ఆరాధిస్తారు. అలాంటి చిత్రం తెరకెక్కిస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్త వహించాలి. కానీ డైరెక్టర్ ఓం రౌత్ ఆలోచనలు అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా లేవు. ఎక్కువగా యానిమేషన్ గ్రాఫిక్స్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 

37

అసలు ఓం రౌత్ తెరకెక్కిస్తోంది రామాయణమేనా అనే అనుమానం కలగక మానదు.  టీజర్ లో శ్రీరాముడు ఎక్కడా కనిపించలేదని అంటున్నారు. ఇక రావణాసురిడిగా సైఫ్ అలీఖాన్ లుక్ అయితే దారుణంగా ఉంది. మన ఊహల్లో ఉండే రావణుడు వేరు.. ఓం రౌత్ చూపించిన రావణుడు వేరు. హాలీవుడ్ చిత్రాల్లో విలన్ తరహాలో రావణాసురుడిని చూపించారు. 

47

ప్రభాస్ సముద్రంమీద వారథిపై నడుచుకుని వచ్చే సీన్ తప్ప ఇంకెక్కడా ఇది రామాయణం అనే భావన మచ్చుకకు కూడా కనిపించడం లేదు. ఆదిపురుష్ అవుట్ పుట్ పై ప్రభాస్ కూడా సంతృప్తిగా లేడని టాక్. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ రెండు చిత్రాలు నిరాశ పరిచాయి. టీజర్ చూశాక ఆదిపురుష్ మూవీపై నెగిటివ్ బజ్ పెరుగుతోంది. 

57

టీజర్ ని అయోధ్యలో గ్రాండ్ గా లాంచ్ చేశారు. టీజర్ కట్ పై ప్రభాస్ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీజర్ లాంచ్ తర్వాత ప్రభాస్ బస చేసిన హోటల్ లో ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ప్రభాస్ కోపంగా.. ఓం నువ్వు నా రూమ్ కి వస్తున్నావుగా.. రా అంటూ ఆగ్రహంతో పిలుస్తున్నట్లు ఉంది. 

67

దీనిపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. రూమ్ లో ఓం రౌత్ కి ప్రభాస్ క్లాస్ పీకడం ఖాయం అంటున్నారు. సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేందుకే ప్రభాస్ ఓం రౌత్ ని పిలుస్తున్నాడు అని అంటున్నారు. దీనిపై ఫన్నీ వీడియో మీమ్స్ కూడా మొదలయ్యాయి. ప్రభాస్ చేతిలో నీకు ఉంది పో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

77

ఇది పక్కన పెడితే.. ఆదిపురుష్ చిత్రాన్ని ఇదే అవుట్ పుట్ తో రిలీజ్ చేస్తారా అనేది ఆసక్తిగా మారింది. ఆల్రెడీ జనవరి 12 రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ఈ కొద్ది సమయంలో మార్పులు చేయడం కుదురుతుందా అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. ఏది ఏమైనా టీజర్ లో చూపిన విధంగా మూవీ ఉంటే మాత్రం దారుణమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bollywood Celebs: స్మోకింగ్, డ్రింకింగ్ మానేసిన స్టార్లు.. అది నాకు పునర్జన్మ అని చెప్పిన క్రేజీ హీరో
Recommended image2
Lenin Movie: కొడుక్కి ఎట్టకేలకు ఒక్క హిట్టు, ఏడ్చేసిన నాగార్జున.. తండ్రి కాళ్లపై పడి అఖిల్ భావోద్వేగం
Recommended image3
Real Names: పేరు మార్చుకున్నాకే స్టార్ డమ్ అందుకున్న సెలెబ్రిటీలు, వీళ్ళ అసలు పేర్లు తెలిస్తే నమ్మలేరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved