- Home
- Entertainment
- RadheShyam:'వీరి దారొకటే మరి దిక్కులే వేరులే'.. ఎడమొహం పెడమొహంగా ప్రభాస్, పూజా.. వైరల్ ఫోటోస్
RadheShyam:'వీరి దారొకటే మరి దిక్కులే వేరులే'.. ఎడమొహం పెడమొహంగా ప్రభాస్, పూజా.. వైరల్ ఫోటోస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 11న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండడంతో చిత్ర యూనిట్ తిరిగి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 11న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండడంతో చిత్ర యూనిట్ తిరిగి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. ఇటీవల విడుదలైన సెకండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచేసింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
రాధే శ్యామ్ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. దీనితో ప్రభాస్, పూజా హెగ్డే ఇండియా మొత్తం తిరుగుతూ రాధే శ్యామ్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇటీవల విడుదలైన సెకండ్ ట్రైలర్ తో సినిమాపై మరోసారి అంచనాలు పెరిగాయి. కానీ ఒక విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఆందోళనగా ఉన్నారు.
అదేంటంటే.. రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రభాస్, పూజా హెగ్డే మధ్య విభేదాలు తలెత్తాయని గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్, పూజా హెగ్డే వైఖరి చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ప్రచార కార్యక్రమాల్లో వీరిద్దరూ ఎంత దగ్గరగా కనిపించినా.. ఇద్దరి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. పైపైకి మాత్రమే ఇద్దరూ దగ్గరగా ఉన్నారు. చిరునవ్వులు నవ్వుతున్నారు.
కానీ ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉన్నట్లు ఇట్టే చెప్పేయొచ్చు. ఒకరినొకరు చూసుకుని కనీసం మనస్ఫూర్తిగా నవ్వుకోవడం కూడా లేదు. నామమాత్రంగా కలసి ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఒకరు ఒక దిక్కుకి మరొకరు మరో దిక్కుకి చూసుకుంటున్నారు. రాధే శ్యామ్ చిత్రంలో 'ఈ రాతలే' అనే సాంగ్ బాగా పాపులర్ అయింది.
ప్రస్తుతం ప్రభాస్, పూజా హెగ్డేలని చూస్తుంటే ఈ సాంగ్ లోని లిరిక్స్ వీరిద్దరికి బాగా యాప్ట్ అవుతాయి అనిపిస్తోంది. 'ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా.. ఎవరో వీరెవరో వీడిపోని యాత్రికులా.. వీరి దారొకటే మరి దిక్కులే వేరులే' అనే లిరిక్స్ ప్రభాస్, పూజాలకు బాగా సెట్ అవుతాయి.
రాధే శ్యామ్ షూటింగ్ లో పూజా హెగ్డే బిహేవియర్ ప్రభాస్ కి నచ్చలేదట. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. సైన్ చేసారు కాబట్టి తప్పక ఈ సినిమాలో కలసి నటించారట. అయితే ఇటీవల పూజా హెగ్డే ప్రభాస్ కి సారీ చెప్పిందని రూమర్స్ వినిపించాయి. ప్రమోషన్స్ లో వీరిద్దరిని చూస్తుంటే అలాంటిదేమి జరగలేదు అని.. ఇద్దరు ఇంకా మనస్పర్థలతోనే ఉన్నారని అంటున్నారు. వీరిద్దరి మధ్య గ్యాప్ తో ఫ్యాన్స్ కాస్త ఆందోళనగా ఉన్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడిగా నటిస్తున్నాడు. ఎమోషనల్ లవ్ స్టోరీ అయిన రాధే శ్యామ్ లో ప్రభాస్ పాత్ర అత్యంత ఆసక్తికరంగా ఉండబోతోంది. విధికి, ప్రేమకు మధ్య జరిగిన యుద్ధంలాగా ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ అభివర్ణిస్తోంది.