Prabhas-Pooja hegde: పూజా హెగ్డేతో విబేధాలు.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్
ఒకప్పుడు సరైన హిట్ లేక అల్లాడిన పూజా హెగ్డే (Pooja Hegde)స్టార్డం వచ్చాక యాటిట్యూడ్ పెంచేశారంటూ ఆ మధ్య కథనాలు వెలువడ్డాయి. అలాగే రాధే శ్యామ్ సెట్స్ లో పూజా బిహేవియర్ నచ్చని ప్రభాస్ కి సైతం ఆమెతో మనస్పర్థలు ఏర్పడ్డాయనే వార్త హల్చల్ చేసింది.

తమిళ దర్శక నిర్మాత సెల్వమణి కొద్ది నెలల క్రితం పూజా హెగ్డే పై సీరియస్ ఆరోపణలు చేశారు. పూజా హెగ్డే 12 మందికి పైగా వ్యక్తిగత సిబ్బందిని మైంటైన్ చేస్తూ నిర్మాతలను గుల్ల చేస్తున్నారని, ఆయన మండిపడ్డారు. ఆయన ఆరోపణలు చేసిన కొద్ది రోజుల అనంతరం ప్రభాస్ తో ఆమెకు మనస్పర్థలు అంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. రాధే శ్యామ్ (Radhe Shyam) సెట్స్ కి లేటుగా రావడంతో పూజా ప్రవర్తన నచ్చని ప్రభాస్ ఆమెపై కోప్పడ్డారట. దీంతో సెట్స్ లో ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా మెలిగారనేది బయటికి వచ్చిన సమాచారం.
ఈ వార్తలు బలపడేలా రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్, పూజా వ్యవహరించారు. సంక్రాంతి విడుదల కావాల్సిన రాధే శ్యామ్ వాయిదా పడింది. మార్చి 11న రాధే శ్యామ్ విడుదల కానుంది. దీంతో ప్రభాస్, పూజా కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. మీడియా సమావేశాల్లో కూడా ప్రభాస్, పూజా అంత కంఫర్ట్ గా ఉన్నట్లు కనిపించడం లేదు.
కాగా చెన్నై ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న ఈ ప్రశ్నకు పరోక్షంగా సమాధానం చెప్పారు. రాధే శ్యామ్ మూవీలో హీరోయిన్ ప్రేరణ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే చాలా ఆలోచించి పూజాను ఎంచుకున్నాము. ఇక రాధే శ్యామ్ మూవీలో ఆమెతో నా కెమిస్ట్రీ బాగా సెట్ అయ్యింది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని పూజా పై ప్రశంసలు కురిపించాడు. అలాగే పూజా సైతం ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆయన కొంచెం సిగ్గరి, అయితే ఒకసారి కలిసిపోతే... ఆయన ఎంత స్వీట్ పర్సన్ అనేది అర్థమవుతుంది. అంటూ కామెంట్ చేశారు.
Prabhas Radhe Shyam
నిజానికి ప్రభాస్ (Prabhas)తో పనిచేసే ప్రతి హీరోయిన్ ఆయనను అమితంగా అభిమానిస్తారు. సొంత ఖర్చులతో తన కో స్టార్స్ కి ప్రపంచ ప్రఖ్యాత వంటలతో విందు ఇవ్వడం ప్రభాస్ కి ఉన్న అలవాటు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ తో పనిచేసిన శ్రద్దా కపూర్, శృతి హాసన్ వంటి హీరోయిన్స్ ఆయన ఆతిథ్యం గురించి గొప్పగా కొనియాడారు. ఒక్క పూజాతోనే ప్రభాస్ కి గొడవలు అంటూ వార్తలొచ్చాయి.
అయితే ప్రభాస్, పూజా ఒకరిపై మరొకరు ఇలా పాజిటివ్ కామెంట్స్ చేసినప్పటికీ మనస్పర్థలు లేవని ఖచ్చితంగా చెప్పలేం. మీడియా సమక్షంలో ఎవరైనా అలా డిప్లొమాటిక్ గానే మాట్లాడతారు. అయితే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు.
సౌత్ నార్త్ అనే తేడా లేకుండా భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్న పూజా ఆ మాత్రం టెక్కు చూపించకపోతే ఎలా మరి. దర్శకుడు రాధాకృష్ణ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా రాధే శ్యామ్ తెరకెక్కించారు. సినిమా ప్రధాన భాగం యూరప్ నేపథ్యంలో సాగుతుంది. ప్రభాస్ పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉండనుంది.