- Home
- Entertainment
- పవన్ పై ఎన్నికల్లో పోటీ చేస్తే నాకు డిపాజిట్లు రావు.. ఎందుకో చెప్పిన పోసాని, షాకింగ్ కామెంట్స్ వైరల్
పవన్ పై ఎన్నికల్లో పోటీ చేస్తే నాకు డిపాజిట్లు రావు.. ఎందుకో చెప్పిన పోసాని, షాకింగ్ కామెంట్స్ వైరల్
పవన్ కళ్యాణ్ నటించిన గోకులంలో సీత చిత్రానికి పోసాని రచయిత. అలాగే పవన్ తో కలసి పోసాని పలు చిత్రాల్లో నటించారు. సినిమా పరంగా పవన్ తో అనుబంధం ఉన్నప్పటికీ.. పాలిటిక్స్ విషయానికి వస్తే మాత్రం పోసాని నోటికి పని చెబుతుంటారు.

సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఏ అంశం గురించి అయినా వ్యంగ్యంగా మాట్లాడడంలో ఆయన శైలే వేరు. అయితే అలా మాట్లాడి పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకున్నారు. చాలా కాలం నుంచి పోసాని వైసీపీ, వైఎస్ జగన్ మద్దతు దారుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ పరమైన అంశాలపై సైతం పోసాని ప్రత్యర్థులపై విరుచుకుపడడం చూస్తున్నాం.
అయితే సీఎం జగన్.. పోసానిని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. పోసాని ప్రస్తుతం వైసిపి పార్టీలో జగన్ కి వీర విధేయుడిగా మారారు. ప్రత్యర్థులపై విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు పోసాని. తాజాగా పోసాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
పోసాని తరచుగా పవన్ కళ్యాణ్ పై కూడా విరుచుకుపడడం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ నటించిన గోకులంలో సీత చిత్రానికి పోసాని రచయిత. అలాగే పవన్ తో కలసి పోసాని పలు చిత్రాల్లో నటించారు కూడా. సినిమా పరంగా పవన్ తో అనుబంధం ఉన్నప్పటికీ.. పాలిటిక్స్ విషయానికి వస్తే మాత్రం పోసాని నోటికి పని చెబుతుంటారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై పోటీకి దింపేందుకు వైసిపి సరైన కాండిడేట్ కోసం వెతుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో పోసాని పేరు కూడా వినిపిస్తోంది. దీనిపై పోసాని తాజాగా ఇంటర్వ్యూలో స్పందించారు. పవన్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ బరిలోకి దిగేందుకు పోసాని సిద్ధంగా ఉన్నారనే రూమర్స్ పై స్పందించారు. పవన్ కళ్యాణ్ పై పోటీ చేయమని నాకు సీటు ఇస్తే ఖచ్చితంగా నో చెబుతా. ఎందుకంటే నేను అంత పిచ్చోడిని కాదు.
నేను పవన్ కళ్యాణ్ అంత పెద్ద స్టార్ ని కాదు. సామాన్యుడిని. పవన్ పై నేను పోటీ చేస్తే గెలిచేది అతడే. నాకు డిపాజిట్లు కూడా కష్టమే. అలాంటప్పుడు నేనెందుకు పోటీ చేస్తాను.. అంత అమాయకుడిని కాదు అని పోసాని అన్నారు. ఇక చంద్రబాబు విషయంలో కూడా పోసాని ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ని నేను ఎప్పుడో హెచ్చరించాను. పదవి కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు. ఎన్టీఆర్ కే వెన్ను పోటు పొడిచిన వ్యక్తికి పవన్ కళ్యాణ్ ఒక లెక్కా అని పోసాని అన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి వదులుకునే రకం కాదు. చంద్రబాబుకి కానీ, లోకేష్ కి కానీ, బాలకృష్ణకి కానీ ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు.. ఈ సారి కాపు జాతికి చెందిన పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేస్తా అని బాబుని విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో ప్రమాణం చేయమని చెప్పండి. అలా చేస్తే చంద్రబాబు కాళ్ళకి నేను పాలాభిషేకం చేస్తా అని పోసాని అన్నారు.