‘బిగ్ బాస్ 6’పై క్రేజీ అనౌన్స్ మెంట్.. మళ్లీ బుల్లితెర సందడి షురూ..
పాపులర్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss Telugu) ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణ పొందింది. తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఆరో సీజన్ ప్రారంభం కానుంది. తాజాగా అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.

ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’. ఈ షో ప్రతి సీజన్ ను కొత్త కంటెస్టెంట్లతో ఎంతో ఇంట్రెస్టింగ్ గా నిర్వహిస్తున్నారు. కింగ్, అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. మొదటి నాలుగు సీజన్లు టీవీలోనే ప్రసారం కాగా.. ఐదో సీజన్ ను మాత్రం ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యింది.
టీవీలో టెలికాస్ట్ అయిన ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 4’ విజేతగా సన్నీ, ఓటీటీలోని ‘బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్’ విన్నర్ గా బిందు మాధవి నిలిచిన విషయం తెలిసిందే. అయితే ‘బిగ్ బాస్ 5’ (Bigg Boss 5) ఈ ఏడాది మార్చిలోనే ముగియడంతో.. అప్పటి నుంచే ఆరో సీజన్ కూ ఏర్పాట్లను ప్రారంభించారు. దీంతో క్రేజీ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి.
ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్’ లవర్స్ కు తాజాగా అదిరిపోయే అప్డేట్ అందింది. Bigg Boss Telugu Season 6ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు ‘స్టార్ మా’అఫిషియల్ అనౌన్స్ మెంట్ అందించింది. దీంతో ఆడియెన్స్ ఎగ్జైట్ ఫీలవుతున్నారు. మరిన్ని డిటేయిల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.
#BiggBossTelugu6 తెలుగు ప్రేక్షకులందరినీ మరింత ఆకట్టుకునేలా చేస్తుందని, రంగుల ప్రపంచాన్ని, తీవ్రమైన భావోద్వేగాలను సృష్టించడానికి వస్తుందని ప్రకటించారు. అయితే ఈ సారి బిగ్ బాస్ లోగోను మరింత అట్రాక్టివ్ గా డిజైన్ చేశారు. పసుపు ఎరుపు రంగు రంగులతో కూడిన కన్ను వలే రూపొందించడం ఆకట్టుకుంటోంది. దీంతో షోలోనూ మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
బిగ్ బాస్ నాన్ స్టాప్ ను గతేడాది సెస్టెంబర్ నెలలోనే ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో ఆరో సీజన్ ను కూడా వచ్చే నెల సెస్టెంబర్ లోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారంట. త్వరలోనే హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ల అఫిషియల్ లిస్ట్ కూడా రానుంది. ఇప్పటికే కొందరు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ సీనియర్ నటుడు వడ్డే నవీన్, జబర్దస్త్ కమెడియన్స్ ఆది, అమరదీప్, చిత్ర రాయ్, దీప్తి పిల్లి, నవ్యావ్మి, యాంకర్ వర్షిణి, యాంకర్ ధనుష్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు టాక్ వినిపిస్తోంది. గత కంటెస్టెంట్ల నుంచి శివ, అనిల్, మిత్రా, అరియానా గ్లోరీ కూడా రానున్నట్టు తెలుస్తోంది. అలాగే సాధారణమైన వ్యక్తులకు ఈ పాపులర్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఇవ్వనున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ కు హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆరో సీజన్ కు మాత్రం నాగార్జునకు బదులుగా స్టార్ హీరోయిన్ సమంత అయినా.. లేదంటే యాంకర్, నటి ఉదయభాణు హోస్ట్ గా రానున్నారని సమాచారం.