MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్కూల్ డ్రెస్సేసిన ‘ఢీ’ జడ్జీ.. ఇంతకీ పూర్ణ ఎంత వరకు చదువుకుందో తెలుసా?

స్కూల్ డ్రెస్సేసిన ‘ఢీ’ జడ్జీ.. ఇంతకీ పూర్ణ ఎంత వరకు చదువుకుందో తెలుసా?

‘ఢీ’ బ్యూటీ  పూర్ణ ప్రస్తుతం ఫ్యామిలీతోనే సమయం గడుపుతోంది. సోషల్ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులకు టచ్ లో ఉంటోంది. తాజాగా పూర్ణ పంచుకున్న ఫొటోలు ఆసక్తికరంగా మారాయి. స్కూల్ డ్రెస్ లో కనిపించి ఆకట్టుకుంది. 
 

Sreeharsha Gopagani | Updated : Oct 05 2023, 11:07 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

నటి షామ్నా కాసీమ్ తెలుగు ప్రేక్షకులకు పూర్ణ (Poorna) గా బాగా పరిచయమే. డాన్సర్ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ వెండితెరపైనా నటిగా మెప్పించింది. ఈ బ్యూటీ బుల్లితెరపైనా సందడి చేసిన విషయం తెలిసిందే. ‘ఢీ’షోలో జడ్జీగా వ్యవహరించి, తనదైన శైలిలో తీర్పులు ఇస్తూ ఆడియెన్స్ ను అలరించింది.
 

28
Asianet Image

కేరళకు చెందిన పూర్ణ మలయాళం చిత్రాలతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో కొన్ని సినిమాలు చేసింది. టాలీవుడ్ లో ‘శ్రీ మహాలక్ష్మి’, ‘సీమా టపాకాయి’, ‘అవును’, ‘నువ్వలా నేనిలా’, ‘అవును2’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలయ్య ‘అఖండ’, ‘దసరా’లోనూ కీలక పాత్రలతో అలరించింది.

38
Asianet Image

కెరీర్ గురించి ఇలా తెలిసిందే. ఆమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. కేరళలోని తయ్యిల్ అనే ముస్లిమ్ ఫ్యామిలీలో 1989 మే 23న జన్మించింది. ఇక కేరళలోని కన్నూరులోనే తన స్కూలింగ్ పూర్తి చేసింది. ఉర్సులైన్ సీనియర్ సెకండరీ స్కూల్, సెయింట్ థెరెసాస్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండీ స్కూల్ లో చదువుకుంది. 
 

48
Asianet Image

ఆ తర్వాత డిగ్రీ కూడా చేసింది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో ఇంగ్లీష్ నుంచి పట్టా పొందింది. అప్పటికే పూర్ణకు 15 ఏళ్లు రావడంతో సినిమాల్లోకి వచ్చింది. అంతకు ముందే కథక్, భరతనాట్యంలో శిక్షణ పొందిన పూర్ణ డాన్సర్ గా కెరీర్ ను ప్రారంభించింది. పలు టీవీ షోల్లో తన అద్భుతమైన డాన్స్ తో ఆకట్టుకుంది. 
 

58
Asianet Image

ఇదిలా ఉంటే.. కొన్నాళ్ల పాటు దుబాయ్ కి చెందిన వ్యాపార వేత్త షానిద్ అసిఫ్ అలీ (Shanid Asif Ali)తో డేటింగ్ లో ఉన్న పూర్ణ.. గతేడాది పెళ్లి పీటలు ఎక్కింది. ఇక ఈ ఏడాది  పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి తల్లిగా ప్రమోషన్ పొందింది. దీంతో ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడుపుతోంది. 
 

68
Asianet Image

ఈ సందర్భంగా సినిమాలు, టీవీ షోలకు కాస్తా దూరమైన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు టచ్ లోనే ఉంటోంది. ఎప్పుడూ తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ వస్తోంది. ఇక తాజాగా స్కూల్ డ్రెస్ లో మెరిసింది. తన స్నేహితులను కలిసిన సందర్భంగా ఇలా రెడీ అయినట్టు తెలుస్తోంది.

78
Asianet Image

స్కూల్ డ్రెస్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది. పాఠశాల రోజులు గుర్తుకు వచ్చాయంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇలా తన చిన్ననాటి మోమోరీస్ ను గుర్తుచేసుకుంటూ.. క్యూట్ ఫొటోలను పంచుకుంది. అభిమానులను ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

88
Asianet Image

కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటనకు దూరంగానే ఉంది. ఇటు బుల్లితెరపైనా మెరవడం లేదు. దుబాయిలో సెటిల్ అయిన పూర్ణ నెట్టింట మాత్రం పోస్టులతో ఆకట్టుకుంటోంది. చివరిగా ‘దసరా’లోనే నటించింది. ఆ తర్వాత రావాల్సిన ‘అలా ఇలా ఎలా’ చిత్రంపై ఎలాంటి అప్డేట్ లేదు. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories