- Home
- Entertainment
- చెర్రీ, స్ట్రాబెర్రీ వేటలో పూజా హెగ్దే.. పండ్ల తోటలో మెరిసిన బుట్టబొమ్మ.. మినీ డ్రెస్ లో వీకెండ్ ట్రీట్..
చెర్రీ, స్ట్రాబెర్రీ వేటలో పూజా హెగ్దే.. పండ్ల తోటలో మెరిసిన బుట్టబొమ్మ.. మినీ డ్రెస్ లో వీకెండ్ ట్రీట్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) వీకెండ్ ట్రీట్ అదిరింది. తమ పండ్ల తోటలో బుట్టబొమ్మ చెర్రీ ఫ్రూట్స్ తెంపుతూ దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిస్తూ అట్రాక్ట్ చేసింది.

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో పూజా తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేస్తుంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ.. సౌత్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను అందుకుంటోంది.
పూజా అటు సినిమాల్లోనే కాకుండా.. ఇటు సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. వ్యక్తిగత విషయాలను నెటిజన్లు, అభిమానులతో పంచుకుంటూ మరింత దగ్గరవుతోంది. ప్రతి వీకెండ్ అదిరిపోయే ఫొటోషూట్లు చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది.
ఈ వీకెండ్ మాత్రం పూజా అదిరిపోయే ట్రీట్ ఇచ్చిందని చెప్పాలి. తమ ఆర్గానిక్ ఫామ్ లోని పండ్ల తోటలో తళుక్కున మెరిసింది. ఇటీవల వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఈ మధ్యనే కాస్తా రిలీఫ్ టైమ్ ను పొందింది. దీంతో కుటుంబ సభ్యులతో సమయం గడుపుతోంది.
ఈ క్రమంలో తమ పండ్ల తోటలోని చెర్రీ పండ్లను కోస్తూ కనిపించింది. చెట్లపైనుంచి చెర్రీలను సేకరిస్తూ మురిసిపోయింది. దీంతో సేంద్రీయ పద్ధతిలో పండించిన ఫ్రూట్ నే పూజా తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతుందని పరోక్షంగా తెలియజేసింది. తోటలో ఫ్రూట్స్ తెంచుతూనే.. ఫొటోలకు అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.
ఎప్పుడూ అభిమానులకు టచ్ లోనే ఉండే ఈ బ్యూటీ ఆ పిక్స్ ను కూడా ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకుంది. పొట్టి దుస్తుల్లో పండ్ల తోటలో సందడి చేసింది. సమయం దొరికినప్పుడల్లా ఇలా తోటలో ఎంజాయ్ చేస్తానంటూ తెలిసింది. ‘మీ కోసమే పండ్లను కోస్తున్నట్టు’ క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ పిక్స్ ను యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ లైక్ చేసింది.
కేరీర్ విషయానికొస్తే బుట్టబొమ్మ వేగం సౌత్ ఇండస్ట్రీలో ఏమాత్రం తగ్గడం లేదు. ఒక ఫ్లాప్, మరో హిట్ తో బ్యాలెన్స్ చేసుకుంటూ పోతోంది. చివరిగా ‘ఆచార్య’, ‘ఎఫ్3’లో మెరిసిన పూజా ప్రస్తుతం పూరి జగన్నాథ్ - విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్ లో వస్తున్న రెండో భారీ ప్రాజెక్ట్ ‘JGM’లో నటిస్తోంది.