- Home
- Entertainment
- దారుణంగా ఉన్న పిక్ తో బన్నీకి బర్త్ డే విషెస్.. ఇరుక్కుపోయిన పూజా హెగ్డే, ట్రోలింగ్
దారుణంగా ఉన్న పిక్ తో బన్నీకి బర్త్ డే విషెస్.. ఇరుక్కుపోయిన పూజా హెగ్డే, ట్రోలింగ్
అల్లు అర్జున్ తో ఉన్న బాండింగ్ తో పూజా హెగ్డే తన కోస్టార్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 41వ జన్మదిన వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగాయి. పుష్ప 2 చిత్ర యూనిట్ వేరీజ్ పుష్ప అంటూ టీజర్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ మరింత హంగామా చేశారు. ఇక దేశం నలువైపుల నుంచి అభిమానులు, సినీ ప్రముఖులు=, ఇతర సెలెబ్రిటీలు అల్లు అర్జున్ కి వెల్లువలా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
స్టార్ సెలెబ్రిటీలు బర్త్ డే విషెస్ చెబితే అవి ఫ్యాన్స్ లో బాగా వైరల్ అవుతుంటాయి. అల్లు అర్జున్, బుట్టబొమ్మ పూజా హెగ్డే కలసి రెండు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. బన్నీ, పూజా నటించిన దువ్వాడ జగన్నాథమ్, అల వైకుంఠపురములో చిత్రాల్లో ఎంతటి ఘనవిజయం సాధించాయో తెలిసిందే. ముఖ్యంగా అల వైకుంఠపురములో చిత్రం బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
అల్లు అర్జున్ తో ఉన్న బాండింగ్ తో పూజా హెగ్డే తన కోస్టార్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 'హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్.. ఇప్పుడు నువ్వు పైపైకి దూసుకెళుతున్నావు.. ఇలాగే కొనసాగించు' అంటూ పోస్ట్ పెట్టింది. అంతా బాగానే ఉంది కానీ.. ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ షేర్ చేసిన పిక్ దారుణంగా ఉంది.
థైస్ స్ప్లిట్ డ్రెస్ లో అల్లు అర్జున్ పక్కన కూర్చుని ఉన్న పిక్ ని పూజా షేర్ చేసింది. అయితే ఆమె సిట్టింగ్ ఫోజులో ఉండడంతో థైస్ అసభ్యంగా కనిపిస్తున్నాయి. దీనితో ఈ పిక్ కారణంగా పూజా హెగ్డే ఇరుక్కుపోయింది. బర్త్ డే విషెస్ చెప్పేటప్పుడు కొంచెం హుందాగా, బావున్న పిక్ షేర్ చేయడం తెలియదా అని బన్నీ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.
పూజా హెగ్డే ఇది వాంటెండ్ గా చేసిన సంఘటన కానప్పటికీ ఆమెకి విమర్శలు తప్పడం లేదు. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం ఇలా చిన్న చిన్న విషయాలతో ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.
పూజా హెగ్డే అల్లు అర్జున్ కి కలసి వచ్చిన లక్కీ హీరోయిన్ అని మరికొందరు ఫ్యాన్స్ అంటున్నారు. అదే సమయంలో పూజా హెగ్డే అక్కినేని హీరో అఖిల్ కి కూడా బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్ట్ చేసింది. ఈ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో అఖిల్, పూజా జంటగా నటించారు.