- Home
- Entertainment
- నీ సైజు ప్యాంట్ దొరకలేదా.. పూజా హెగ్డే డ్రెస్ పై పేలుతున్న జోకులు, విచిత్రమైన లుక్ వైరల్
నీ సైజు ప్యాంట్ దొరకలేదా.. పూజా హెగ్డే డ్రెస్ పై పేలుతున్న జోకులు, విచిత్రమైన లుక్ వైరల్
బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి.

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి. వరుసగా పూజా హెగ్డేకి స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయి.
పూజా హెగ్డే క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది.
మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో పూజా హెగ్డే చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక పూజా హెగ్డే షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. అలాగే గ్లామర్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ లో మంటలు రేపుతూ ఉంటుంది.
తాజాగా పూజా హెగ్డే గ్లామరస్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.ఓ విచిత్రమైన ప్యాంట్ ధరించిన పూజా హెగ్డే ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. పూజా హెగ్డే ధరించిన ప్యాంట్ చాలా వదులుగా ఉంది. దీనితో నెటిజన్లు ఆమెపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.
నీ సైజు ప్యాంట్ దొరకలేదా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అయినప్పటికీ ఈ డ్రెస్ లో పూజా హెగ్డే స్టైలిష్ గా కనిపిస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ బుట్ట బొమ్మ ఆకర్షిస్తోంది.
పూజా హెగ్డే ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటించింది ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ కూడా నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆచార్య కూడా డిజాస్టర్ గా నిలిచింది.
సౌత్ లో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా టాప్ లీగ్ లో కొనసాగుతోంది. బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే ఆఫర్స్ దక్కించుకుంటోంది. వాస్తవానికి పూజా హెగ్డే ప్రభాస్ రాధే శ్యామ్ పై బోలెడు ఆశలే పెట్టుకుంది.
కొంత కాలం నుంచి పూజా హెగ్డే కి సౌత్ లో కలసి రావడం లేదు. దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం పూజా సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ చిత్రంలో నటిస్తోంది.