MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 5 నిమిషాల కోసం 5 కోట్ల రెమ్యునరేషన్.. 800 కోట్ల బడ్జెట్ మూవీలో.. పూజా హెగ్డే కు బంపరాఫర్

5 నిమిషాల కోసం 5 కోట్ల రెమ్యునరేషన్.. 800 కోట్ల బడ్జెట్ మూవీలో.. పూజా హెగ్డే కు బంపరాఫర్

చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతోంది హీరోయిన్ పూజా హెగ్డే. వరుస ప్లాప్ సినిమాల వల్ల ఆమెకు అన్ లక్కీ హీరోయిన్ అన్న పేరు పడిపోయింది. ఇక తాజాగా 800 కోట్ల భారీ ప్రాజెక్ట్ లో బంపరాఫర్ కొట్టేసింది స్టార్ బ్యూటీ. ఇకనైనా అదృష్టం కలిసి వస్తుందా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 22 2025, 02:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పూజా హెగ్డే బ్యాడ్ టైమ్..
Image Credit : Instagram

పూజా హెగ్డే బ్యాడ్ టైమ్..

స్టార్ హీరోయిన్ గా వరుస సక్సెస్ లు అందుకున్న పూజా హెగ్డే.. మధ్యలో వరుస డిజాస్టర్లతో ఐరన్ లెగ్ అన్న విమర్శలు ఫేస్ చేసింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ సినిమాలు చేసిన పూజా.. ఆతరువాత వరుసగా ప్లాప్ లు కూడా చూసింది. ఎంత ప్రయత్నించిన ఒక్క హిట్ పడకపోవడంతో.. ఇండస్ట్రీలో పూజాకు ఆఫర్లు తగ్గిపోయాయి. పూజా ఉంటే సినిమా ప్లాప్ అవుతుందన్న టాక్ గట్టిగా నడిచింది. దాంతో కెరీర్ లో భారీ కుదుపును చూసింది పూజా హెగ్డే. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే మంచి మంచి ఆఫర్లు కూడా పూజాకు వస్తున్నట్టు సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజా..
Image Credit : our own

బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజా..

గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రెండు సినిమాల్లో నటించింది పూజా హెగ్డే. దువ్వాడ జగన్నాథమ్ మూవీతో పాటు అలవైకుంఠపురములో మూవీలో ఈ జంట సందడి చేశారు. ఇక ముచ్చటగా మూడోసారి బన్నీతో కలిసి ఆడబోతోంది పూజా. ఐకాన్ స్టార్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రాబోతోన్న భారీ బడ్జెట్ మూవీ గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమాకు సబంధించిన ఆసక్తి కరమైన చర్చ ప్రస్తుతం జరగుతోంది. AA22xA6 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ ప్రాజెక్టులో ఓ స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డేను సంప్రదించినట్లు సమాచారం. అంతే కాదు ఈ సాంగ్ కోసం పూజాకు ఏకంగా 5 కోట్లు పారితోషికంగా ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

34
కూలీ సినిమాతో పెరిగిన డిమాండ్
Image Credit : Asianet News

కూలీ సినిమాతో పెరిగిన డిమాండ్

రీసెంట్ గా రిలీజ్ అయిన కూలీ సినిమా వల్ల పూజాహెగ్డే కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఈసినిమాలో పూజా డాన్స్ చేసిన మోనికా... సాంగ్ కు దేశ వ్యాప్తంగా భారీగా రెస్పాన్స్ వచ్చింది. కూలీ సినిమాకు ఈ సాంగ్ చాలా ప్లస్ అయ్యింది. పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ కు వచ్చిన అద్భుతమైన స్పందన చూసి.. ఆమెకి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయని సమాచారం. ఇదే నేపథ్యంలో అల్లు అర్జున్‑అట్లీ వారి సినిమాకు పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ ను పెట్టాలని చూస్తున్నాట. ఈసాంగ్ పెడితే సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుందని భావించినట్లు టాక్. ఈ ప్రతిపాదనకు ఆమె కూడ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

44
800 కోట్ల భారీ బడ్జెట్ మూవీలో
Image Credit : Instagram

800 కోట్ల భారీ బడ్జెట్ మూవీలో

దాదాపుగా 800 కోట్ల బడ్జెట్ తో AA22xA6 సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో సైన్స్‑ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ ప్రాజెక్టును అల్లు అర్జున్ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో అల్లు అర్జున్ జంటగా ఆరుగురు హీరోయిన్లు నటిస్తున్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకొణే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న వంటి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ విషయంలో మూవీ టీమ్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Serial Killer Movies: లాస్ట్ మినిట్ వరకు ఉత్కంఠ రేపే టాప్ 5 సీరియల్ కిల్లర్ మూవీస్ ఇవే!
Recommended image2
సెకనుకు 10 లక్షలు.. 50 సెకన్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
Suman: శంకరాభరణం చేసిన నిర్మాతని, వీడితో సినిమా చేసి తప్పు చేశా.. సుమన్ మూవీపై కామెంట్స్, కట్ చేస్తే
Related Stories
Recommended image1
ఎన్టీఆర్ ను అన్నగారు అని పిలిచే ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
8 నిమిషాల యాడ్ కోసం.. 150 కోట్లు ఖర్చు పెట్టించిన అల్లు అర్జున్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved