పూజా హెగ్డే కాలికి ఫ్రాక్చర్, గాయంతోనే షూటింగ్ కు బుట్టబొమ్మ, ఆందోళనలో ఫ్యాన్స్
పూజా హెగ్డే భిమానులకు హాట్ బ్రేకింగ్ న్యూస్.. పూజా కాలుకు ఫ్రాక్చర్ అయ్యింది. చీలమండలం చీలిపోయి.. కాలుకు కట్టుతో ఉన్న ఫోటోలు పూజా శేర్ చేసింది. అయాన సరే ఆగకుండా కమిట్ మెంట్ తో షూటింగ్ కంప్లీట్ చేస్తుంది బ్యూటీ.

ఇటు సౌత్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా దూసుకుపోతోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. అన్ని భాషల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్నా కాని.. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది పూజా హెగ్డే.
ప్రస్తుతం టాలీవుడ్ లో మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబో సినిమాలో నటిస్తున్న పూజా.. పూరీ-విజయ్ జనగణమన సినిమాల కూడా సెలక్ట్ అయ్యింది. అటు హిందీలో రెండు సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే ఈ బిజీలో కాలుకు గాయం కూడా చేసుకుంది. క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్న పూజా తన కాలుకు గాయం అయ్యిందని ప్రకటించింది.
షూటింగ్ టైమ్ లో తగిలిందా..? లేక ఎలా తగిలిందో తెలియదు కాని.. తన కాలు దెబ్బ తగిలినా విశ్రాంతి తీసుకునే సమయం కూడా ఆమెకు లేకుండా పోయింది. కాలుకు పట్టీ వేసుకొని ఆమెకు షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది బ్యూటీ. షో నడవాల్సిందే అని తన పోస్ట్ కు క్యాప్షన్ కూడా ఇచ్చింది పూజా.
నిజానికి నిన్ననే పూజా హెగ్డే కు దెబ్బ తగిలింది. తన కాలుకు దెబ్బ తగిలిందని పూజ నిన్నఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది. చీలమండలో చీలిక ఏర్పడిందని చెబుతూ బ్యాండేజీ వేసిన కాలు ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. దాంతో ఆందోళన పడ్డ అభిమానులు తాను కొన్ని రోజులు షూటింగ్ కు దూరం అవుతుందని అంతా అనుకున్నారు.
అయితే అందరికి షాక్ ఇచ్చేలా ఒక రోజు కూడా తిరగకుండానే షూటింగ్ లొకేషన్ లో ప్రత్యక్షమైంది పూజా. కాలుకు బ్యాండేజీతోని మేకప్ రూమ్ లో ఉన్న ఫొటోను షేర్ చేసిన పూజా.. పని పట్ల తన అంకిత భావం చెప్పకనే చెప్పింది. అర్జెంట్ షూటింగ్ అవ్వడంతో.. త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తోంది బ్యూటీ.
ప్రస్తుతం ముంబైలో సల్మాన్ సరసన కిసీ కా భాయ్ కిసీగా జాన్ మూవీ షూటింగ్ లో పూజ జాయిన్ అయ్యింది. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పూజా త్వరగా కోలుకోవాలి అని కోరుకుంటున్నారు. అంతే కాదు రెబ్బ తగిలినా.. తమ అబిమన నటి లెక్క చేయకుండా పని చేయడం ఆదర్శం అంటున్నారు.