- Home
- Entertainment
- పూజా హెగ్డేకి షాకిస్తున్న సమంత, రష్మిక .. హాట్ భామల జోరుకి బుట్టబొమ్మ బేజార్.. సీన్ ఇలా రివర్సైదేంటి?
పూజా హెగ్డేకి షాకిస్తున్న సమంత, రష్మిక .. హాట్ భామల జోరుకి బుట్టబొమ్మ బేజార్.. సీన్ ఇలా రివర్సైదేంటి?
బుట్టబొమ్మ పూజా హెగ్డేకి తిరుగులేని ఇమేజ్, క్రేజ్ సొంతం. ఆమె నటించిన ప్రతి సినిమా హిట్టే. పూజా కోసం స్టార్ హీరోలు వెయిటింగ్.. ఇది మొన్నటి మాట. కానీ ఇప్పుడు సీన్ మారింది. సమంత, రష్మిక మందన్నాలు ఊహించని విధంగా ట్రాక్‌లోకి వచ్చారు.

పూజా హెగ్డే(Pooja Hegde) నెంబర్ వన్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. ఆమె వరుసగా సూపర్ స్టార్స్ తో సినిమాలు చేయడం, భారీ బడ్జెట్ చిత్రాలు చేయడం, అత్యంత సక్సెస్‌ఫుల్ మూవీస్ చేయడంతో ఆమె క్రేజ్ రెట్టింపయ్యింది. పూజా అంటే హాట్ కేక్ అయిపోయింది. స్టార్ హీరోలకు సైతం పూజా హిట్ సెంటిమెంట్ అయ్యింది. బుట్టబొమ్మ ఉందంటే సినిమా విజయమే అనే టాక్ నడిచింది.
పూజా హెగ్డే క్రేజ్ ముందు సమంత(Samantha), రష్మిక(Rashmika Mandanna)లు కూడా తేలిపోయిన పరిస్థితి. ఆమె క్రేజ్ ముందు నిలవలేకపోయిన ఫీలింగ్ కలిగింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ లాగా కనిపిస్తుంది. పూజా హెగ్డే వన్నె తగ్గిపోతుందనే సిగ్నల్స్ అందుతున్నాయి. సమంత, రష్మిక మందన్నాల ముందు తేలిపోతుందని, వారి జోరుకి బుట్టబొమ్మ బేజార్ అవుతుందనే టాక్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యింది.
సమంత మొన్నటి వరకు టాలీవుడ్, కోలీవుడ్‌కే పరిమితం. పైగా ఆమె పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేసింది లేదు. భారీ బడ్జెట్ సినిమాలు కూడా తక్కువే. `రంగస్థలం`, `మజిలి` తర్వాత ఆమెకి సరైన హిట్ కూడా లేదు. దీంతో సమంత టాప్ హీరోయిన్ రేస్‌లో లేకుండా పోయింది. పైగా నాగచైతన్యతో డైవర్స్ నేపథ్యంలోనూ కొన్ని రోజుల వరకు ఆ అమ్మడిని పట్టించుకోలేదు.
మరోవైపు రష్మిక మందన్నా సైతం పుష్పకి ముందు వరకు పెద్దగా క్రేజ్ లేదు. నేషనల్ క్రష్ అనేది తప్పితే, పూజా హెగ్డే స్థాయిలో డిమాండ్ ఉండేది కాదు. పైగా ఆమె యాటిట్యూడ్ విషయంలోనూ కొన్ని విమర్శలు వచ్చాయి. అయితే బాలీవుడ్‌లో రష్మిక సినిమాలు చేసినా అంతంత మాత్రంగానే ఆమె పాపులారిటీ వినిపించేది. అది పూజా హెగ్డే కంటే తక్కువ స్థాయిలోనే ఉండేది.
కానీ మ్యాటర్ రివర్స్ అయ్యింది. ఊహించని విధంగా ఇప్పుడు టాప్ నెంబర్‌లోకి సమంత, రష్మిక మందన్నా దూసుకొచ్చారు. అయితే ఇది సౌత్‌లో కాకుండా నార్త్ లో కావడం విశేషం. సౌత్‌లో పూజాకి ఇప్పటికీ భారీగానే ఆఫర్లున్నాయి. కానీ హిందీలో మాత్రం ఆ స్థాయిలో లేవు. ప్రస్తుతం రష్మిక, సమంతలకు హిందీలోనుంచి వస్తోన్న ఆఫర్లు చూస్తుంటే అంతా షాక్ అవుతున్నారు. వారి క్రేజ్‌కి సైతం ఆశ్చర్యపోతున్నారు.
`పుష్ప` చిత్రంతో శ్రీవల్లిగా సౌత్‌తోపాటు నార్త్ లోనూ పాపులర్ అయ్యింది రష్మిక. యమ క్రేజ్ పెరిగింది. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. దీనికితోడు బాలీవుడ్ రణ్ బీర్ కపూర్‌తో కలిసి `యానిమల్` సినిమా చేయడం కూడా ఆమె క్రేజ్ పెరగడానికి కారణం కావడం విశేషం. మరోవైపు గ్లామర్ షోతోనూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటుంది. ఈ క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లని మించి కావడం విశేషం.
మరోవైపు సమంత కూడా ఊహించని విధంగా బాలీవుడ్‌లో క్రేజ్‌ని సంపాదించుకుంది.`పుష్ప` చిత్రంలో ఆమె చేసిన ఐటెమ్ సాంగ్ అందుకు ఓ కారణంగా చెప్పొచ్చు. ఈ పాటతో బాలీవుడ్‌ని షేక్ చేసింది. మరోవైపు ఇప్పుడు ఆమె చేస్తున్న పాన్ ఇండియాల సినిమాల ప్రభావం కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం సమంత చేస్తున్న `యశోద`, `శాకుంతలం`, `ఖుషి` చిత్రాల్లో పాన్ ఇండియా మూవీస్‌గా తెరకెక్కుతున్నాయి.
దీనికితోడు ఇటీవల `కాఫీ విత్ కరణ్` షోలో పాల్గొంది సమంత. ఇందులో అక్షయ్ కుమార్‌తో కలిసి ఆమె సందడి చేయడం, పైగా తన పెళ్లి గురించి ఆమె చెప్పిన విషయాలు బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ కావడం, అక్షయ్..సమంతని ఎత్తుకుని డాన్సు చేయడం, ఇద్దరు కలిసి `పుష్ప`లోని `ఊ అంటావా మావ.. `పాటకి స్టెప్పులేయడం, ఆ వెంటనే సమంతకి ఓ సినిమా ఆఫర్ చేయడం ఇవన్నీ సామ్‌కి ఎవరూ ఊహించని క్రేజ్‌ని తీసుకొచ్చాయి. దీంతోపాటు ఆమె మూడు బాలీవుడ్ సినిమాల్లో కనిపించబోతుందనే వార్త సైతం ఆమెపై అందరి అటెన్షన్ పెంచింది.
ఇలా సమంత, రష్మికలకు ఉన్న క్రేజ్, ఇమేజ్ బాలీవుడ్‌లో పూజాకి లేదనేది వాస్తవం. ఇప్పుడు ఆమె సల్మాన్ ఖాన్‌తో కలిసి `కభీ ఈద్ కభీ దివాళీ` చిత్రంలో నటిస్తుంది. ఇందులో వెంకటేష్, రామ్‌చరణ్‌లు కూడా కనిపించబోతుండటంతో పూజా పేరు పక్కకెళ్లిపోయింది. చర్చ మొత్తం ఈ ముగ్గురు హీరోలపైనే జరుగుతుంది. పైగా చాలా కాలంగా బాలీవుడ్‌లో పాగా వేసేందుకు పూజా ప్రయత్నాలు చేస్తుంది. కానీ వర్కౌట్ కావడం లేదు. దీంతో సల్మాన్ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా రిజల్ట్ బాలీవుడ్ లో ఆమె ఫేట్‌ని, ఫేమ్‌ని మారుస్తుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజా హెగ్డే మహేష్‌తో సినిమా, విజయ్ దేవరకొండతో సినిమా చేస్తుంది. త్వరలో పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ సినిమా చేయనుంది. ఇవన్నీ పూర్తయి, హిట్ అయితేనే పూజా క్రేజ్ మరోసారి మారుమోగబోతుందని చెప్పొచ్చు.