- Home
- Entertainment
- Mahashivaratri 2024 : శివుడి సేవలో తమన్నా, పూజాహెగ్దే.. మిల్క్ బ్యూటీ ముఖ కదలికలు వైరల్!
Mahashivaratri 2024 : శివుడి సేవలో తమన్నా, పూజాహెగ్దే.. మిల్క్ బ్యూటీ ముఖ కదలికలు వైరల్!
మహాశివరాత్రి 2024 (Mahashivatri 2024) సందర్భంగా సెలబ్రెటీలు శివనామస్మరణలో మునిగిపోయారు. ఈ సందర్భంగా తమన్నా భాటియా (Tamannaah Bhatia) , పూజా హెగ్దే భక్తిని చాటుకున్నారు.

స్టార్ హీరోయిన్లు తమన్నా భాటియా మరియు పూజా హెగ్దే (Pooja Hegde) తాజాగా ఆధ్యాత్మిక బాటలో మునిగిపోయారు. ఆ పరమశివుడికి సేవలు చేసి తమ భక్తిని చాటుకున్నారు.
నిన్న మహాశివరాత్రి 2024 (Mahasivaratri) సందర్భంగా స్టార్ హీరోయిన్లు శివ భక్తిని చాటుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తురులో గల శివాలయాన్ని సందర్శించారు.
శివుడి భారీ విగ్రహాం ఆదియోగి (Adiyogi) వద్ద ఇషా షౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టాప్ హీరోయిన్లు తమన్నా, పూజా హెగ్దే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శివనామస్మరణతో వేడుక మారుమోగిపోయింది. పట్టు వస్త్రాల్లో తమన్నా, పూజా హెగ్దే కూడా శివుడి నామాన్ని జపిస్తూ తమ భక్తిని చాటుకున్నారు.
అయితే తమన్నా భాటియా కాస్తా శివుడి సేవలో ఎక్కువగా లీనమై పోయింది. శివుడి నామాన్ని బలంగా జపిస్తూ కనిపించింది. ఆమె ముఖ కదలికలు చూస్తేనే ఎంత భక్తి శ్రద్దలతో పూజిస్తుందో అర్థమవుతోంది.
ప్రస్తుతం తమన్నా, పూజా హెగ్దేకు సంబంధించిన ఈ డివోషనల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. స్టార్ హీరోయిన్ల దైవభక్తికి అభిమానులు ఫిదా అవుతున్నారు.