MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగార్జున హౌజ్‌లో పూజా, అఖిల్‌ రొమాన్స్.. నాగ్‌ స్వీట్‌ వార్నింగ్‌.. పూజాని ఇంప్రెస్‌ చేయలేకపోయిన ఇంటి సభ్యులు

నాగార్జున హౌజ్‌లో పూజా, అఖిల్‌ రొమాన్స్.. నాగ్‌ స్వీట్‌ వార్నింగ్‌.. పూజాని ఇంప్రెస్‌ చేయలేకపోయిన ఇంటి సభ్యులు

తండ్రి నాగార్జున హౌజ్‌లో రెచ్చిపోయాడు తనయుడు అఖిల్‌. పూజాతో కలిసి `లెహరాయి` అంటూ సాంగేసుకున్నాడు. పూజాతో కలిసి స్టెప్పులేస్తూ రొమాన్స్ కి తెరలేపాడు. నాగ్‌ ఎంట్రీతో అటు అఖిల్‌, ఇటు పూజా షాక్‌ అయ్యారు. ఇంతకి ఏం జరిగిందంటే..  

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 10 2021, 10:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్‌బాస్‌5 ఈ ఆదివారం చాలా స్పెషల్‌గా మారింది. దాదాపు నాలుగు గంటలు పండుగలా సాగింది. ఎమోషన్స్, ఫన్నీ సన్నివేశాల, పాటలు, కామెడీ సన్నివేశాలతో సాగింది. నవరాత్రి స్పెషల్‌ ఎపిసోడ్‌ ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్స్ ని పంచాయి. అందులో భాగంగా `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` సినిమా హీరోహీరోయిన్‌ అఖిల్‌, పూజా హెగ్డేలు `బిగ్‌బాస్‌5`లో సందడి చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బిగ్‌బాస్‌ స్టేజ్‌పై పూజాతో స్టెప్పేశాడు అఖిల్‌. నాగ్‌ లేని టైమ్ లో వీరిద్దరు హగ్‌ చేసుకుంటూ డాన్స్ చేయడంతో అప్పుడే హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు నాగ్‌. హేయ్‌.. అంటూ అనడంతో ఇద్దరు వదిలేసుకున్నారు. నాగ్‌ స్వీట్‌ వార్నింగ్‌ని, అదే తరహాలో సెటైరికల్‌గా కౌంటర్‌ ఇచ్చాడు అఖిల్‌.

36

నవరాత్రి స్పెషల్‌లో భాగంగా వీరిద్దరు సందడి చేసి సినిమా గురించి విశేషాలను పంచుకున్నారు. మంచి లాఫ్టర్‌ థెరఫీ లాంటి చిత్రమన్నారు. అదే సమయంలో ఇంటి సభ్యులతో కాసేపు ముచ్చటించారు. అందులో భాగంగా అఖిల్‌.. పూజాని ఇంప్రెస్‌ చేసిన వాళ్లు గేమ్‌లో విన్నర్ గా నిలుస్తారని చెప్పారు. ఈ టాస్క్ లో శ్రీరామ్‌, సన్నీ, షణ్ముఖ్‌, సిరి, జెస్సీ, మానస్‌, విశ్వ పాల్గొన్నారు. 
 

46

శ్రీరామ్‌ పాట పాడారు. తనదైన గాత్రంతో ఆకట్టుకున్నారు. కానీ పూజా హెగ్డే ఇంప్రెస్‌ కాలేదు. ఆ తర్వాత సన్నీ మిమిక్రీ చేశాడు. డక్‌ లా మాట్లాడుతూ, పూజా నువ్వుంటే ఇష్టం అనే విషయాన్ని తెలిపారు. ఇక షణ్ముఖ్‌ మోనోలాగ్‌ చేశాడు. సింగిల్‌ గాయ్స్ బాధలు తెలిపారు. సిరి, జెస్సీలతో కలిసి చిన్న స్కిట్‌ చేశాడు. లవర్స్ లేని కుర్రాళ్లు పడే బాధలను కళ్లకి కట్టినట్టు చూపించాడు షణ్ముఖ్‌. మొత్తంగా సింగిలే కింగులు అని తెలిపారు. 

56

జెస్సీ .. `లెహరాయి.. `పాటకి హవభావాలు పలికారు. స్టెప్పులేశారు. కొత్తగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ వర్కౌట్‌ కాలేదు. ఆ తర్వాత మానస్ ఓ ప్రేమ పాటకి డాన్సు చేశాడు. అద్భుతంగా డాన్సు చేసి అందరిని ఆకట్టుకున్నారు. ఇంత మంది కుర్రాళ్లు తమదైన పర్‌ఫెర్మెన్స్ తో ఇంటి సభ్యులను, ఆడియెన్స్ ని అలరించారు. 

66

కానీ పూజా మాత్రం ఇంటిసభ్యులకు షాక్‌ ఇచ్చింది. తనని బిగ్‌బాస్‌ సభ్యులు ఇంప్రెస్‌ చేయలేకపోయారని తెలిపింది. తనని ఇంప్రెస్‌ చేసింది అఖిలే అని తెలిపింది పూజా. అంతేకాదు రెడ్ డ్రెస్‌లో గ్లామరస్‌గా కనిపించి కనువిందు చేసింది. క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్, వచ్చీ రాని తెలుగుతో నవ్వులు పూయించింది పూజా. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Telugu: వర్షిణికి ముద్దు పెడుతు దొరికిపోయిన ముఖేష్.. ఝాన్సీకి బిగ్ బాస్ వార్నింగ్..
Recommended image2
Halloween 2026: నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన 10 హారర్ మూవీస్, చెమటలు పట్టించే సినిమాలు
Recommended image3
Killer Movie: సినిమా చూసి ట్విస్ట్ చెబితే కోటి రూపాయలు.. కిల్లర్‌ టీమ్‌ బంపర్‌ ఆఫర్‌.. కండీషన్స్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved