బికినీలో బర్త్ డే చేసుకున్న పూజాబేడీ తనయ అలయా.. రచ్చ చేస్తున్న ఫోటో
ప్రముఖ బాలీవుడ్ నటి, హోస్ట్ పూజా బేడీ ముద్దుల తనయ అలయా ఎఫ్ సినిమాల్లోకి రాకముందే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుంది. తనకు అంతగా ఫాలోయింగ్ రావడానికి కారణమేంటనేది తాజాగా స్పష్టమైందే. ఏదైనా వెరైటీగా చేయడం ఈ బ్యూట ఈ స్పెషాలిటీ. అందులో భాగంగా తన పుట్టిన రోజుని బికినీలో సెలబ్రేట్ చేసుకుంది.
మోడల్‌గా గ్లామరస్ ఫోటోలతో కుర్రకారుని తన వైపు తిప్పుకుంటున్న ఈ సెక్సీ బ్యూటీ శనివారం తన 23వ పుట్టిన రోజుని జరుపుకుంటుంది. దీన్ని చాలా గ్రాండ్‌గా జరుపుకుంది.
అంతేకాదు చాలా వెరైటీగానూ సెలబ్రేట్ చేసుకుంది. ముంబయిలోని సముద్ర తీరంలోని అలీబాగ్‌లో తన స్నేహితులతో కలిసి పుట్టిన రోజు జరుపుకున్న ఈ హాట్ బ్యూటీ..బికినీలో కనిపించింది. బికినీ ధరించి బర్త్ డే వేడుక సందర్భంగా పోజులివ్వడం విశేషం.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాని ఓ రేంజ్లో ఊపేస్తుంది. ముఖ్యంగా కుర్రాళ్లని ఓ ఊపు ఊపుతుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు.
ఇప్పటికే యూత్‌లో ఫాలోయింగ్ పెంచుకున్న ఈ హాట్ బ్యూటీ.. ఇలా బికినీలో బర్త్ డే చేసుకుని వాహ్ అనిపించింది. తాను చాలా స్పెషల్ గురూ అనిపించుకుంది.
తన బర్త్ డే సందర్భంగా విషెస్ తెలిపిన అందరికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సందర్భంగా బికినీలో ఉన్న ఫోటోని పంచుకుంది.
ఈ ఫొటోతో పాటు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక బూమెరాంగ్ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అలయా మోకాళ్ల వరకు గౌను, కాళ్లకు హై హీల్స్‌తో కనిపించింది.
అంతేకాదు, తన పేరులోని A F అక్షరాలను పెద్దగా మంచి లైటింగ్‌తో పెట్టారు. ఆ అక్షరాల ముందు నుంచి అలయా నడుచుకుంటూ వెళ్తోంది.
పూజా బేడీ కూతురుగా సినిమాల్లోకి రాకముందే పాపులారిటీని సంపాదించిన అలయా ఎఫ్ మోడల్‌గా రాణించింది.
ఇప్పుడు హీరోయిన్‌గానూ పరిచయం అయ్యింది. సైఫ్ అలీ ఖాన్ నటించిన `జవానీ జానేమన్` చిత్రంలో సైఫ్‌కి కూతురిగా నటించింది.
నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అలయా 21 ఏళ్ల గర్భవతిగా కనిపించింది. అలయాకు తండ్రిగా సైఫ్ అలీ ఖాన్, తల్లిగా టబు నటించారు.
ఈ సినిమా విడుదలైన తరవాత అలయా కూడా నెపోటిజం విమర్శలను ఎదుర్కొన్నారు. వాటిపై తన స్టయిల్లో ఘాటుగానే స్పందించింది.
ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించే బయటి వ్యక్తులతో పోలిస్తే తమకు ఛాన్స్ కాస్త ఎక్కువగానే ఉంటుందని అలయా అభిప్రాయపడింది. తాము పది సార్లు ఆడిషన్లు రిజక్ట్ అయితే, మిగిలిన వాళ్ళు వందసార్లు అయి ఉంటారని చెప్పింది.
తమ పోరాటంతో పోలిస్తే వాళ్ల పోరాటం ఎక్కువగానే ఉంటుందని, అంతమాత్రాన తమ వద్ద ప్రతిభ కాదని, బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోవాలి అనేది తన కోరిక అని చెప్పింది.