పొన్నియన్ సెల్వన్ 2 షూట్‌లో ఫన్నీ మూమెంట్స్.. వైరల్ అవుతున్న స్టిల్స్
భారీ స్థాయిలో .. భారీ బడ్జెట్ తో.. తెరకెక్కింది పొన్నియన్ సెల్వన్ మూవీ. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈసినిమా షూటింగ్ కొన్నేళ్లపాటు జరిగింది. ఇక ఈ మూవీ షూటింగ్ లో ఎన్నో ఫన్నీ మూమెంట్స్ జరగ్గా.. అందులో కొన్ని మాత్రం క్యాప్చర్ చేసి.. వాటిని సోషల్ మీడియాలో శేర్ చేసుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా సినిమా షూటింగ్ అంటేనే చాలా సీరియస్ గా డైలాగ్స్ చెప్పడంతో పాటు.. పన్నీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. మణిరత్నం కాంపౌండ్ నుంచి వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా విషయంలో కూడా ఎంత సీరియస్ గా వర్క్ చేశారో అంత ఫన్నీమూమెంట్స్ ను కూడా ఫీల్ అయ్యారు.
ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ అవ్వడం.. పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడం.. 250 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం అంతా అయిపోయింది. అయితే ఈ మూవీ షూటింగ్ టైమ్ లో జరిగిన కొన్ని ఫన్నీ సంఘటనలకు సబంధించి స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. వాటిని హీరోయిన్ శోభితా దూళిపళ శేర్ చేశారు.
షూటింగ్ స్పాట్‌లో ఎక్కువగా అందరితో చమత్కారాలు చేసేది జయం రవి.. ఆయన అరుణ్ మొళి పాత్రలో నటించారు. కాగా.. అంత హుషారుగా ఉండే జయంరవి ఒక సందర్భంలో.. అలసిపోయి కుర్చీలోనే కునుకు తీస్తున్నఫొటోను షేర్ చేసింది శోభిత.
ఇక భారీ పడవలో షూటింగ్ జరుగుతుండగా.. కుందవై గెటప్‌లో ఉన్న హీరోయిన్ త్రిష గాలి సరిపోక.. మేకప్ కరిగిపోకుండా.. టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని కూర్చున్న ఫోటో కూడా వైరల్ అవుతోంది.
కాస్ట్యూమ్ డిజైనర్ ఏక లఖని గాయాలతో ఉన్న కార్తీతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. వీటిలో త్రిష ఫొటో హైలెట్‌గా నిలుస్తుందంటున్నారు సినీ జనాలు.
పొన్నియన్ సెల్వన్ 2లో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, శరత్‌కుమార్, ప్రకాశ్ రాజ్,ఐశ్వర్య లక్ష్మితోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే స్టోరీతో వస్తున్న ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కించాయి. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది మూవీ.