MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ‘‘హత్య’ సినిమా నిర్మాత, దర్శకులపై కేసు: సునీల్ యాదవ్ ఫిర్యాదు

‘‘హత్య’ సినిమా నిర్మాత, దర్శకులపై కేసు: సునీల్ యాదవ్ ఫిర్యాదు

సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు 'హత్య' మూవీ నిర్మాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమాలో తనను, తన తల్లిని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

2 Min read
Author : Surya Prakash
Published : Mar 23 2025, 07:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Police file case on Hatya Movie Producer based on Sunil Yadav Complaint in telugu

Police file case on Hatya Movie Producer based on Sunil Yadav Complaint in telugu

వాస్తవంగా జరిగిన కొన్ని ఘటనల్ని తీసుకుని.. సినిమా కథకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుని తీసే క్రైమ్ డ్రామాలు కత్తి మీద సామే. సినిమాలో  ఎంత వరకు వాస్తవాలు చూపించొచ్చు.. ఎంత వరకు లిబర్టీ తీసుకోవాలి అనేది కష్టంగా మారుతుంది.

జనవరి 2025లో థియేటర్ లోనూ, రీసెంట్ గా ఓటిటిలోనూ  హత్య మూవీ చూస్తుంటే.. అది ఎవరి కథ అయి ఉంటుందో అందరికీ అర్థం అవుతుంది. కానీ సినిమా ప్రారంభానికి ముందు మాత్రం ఇదంతా కల్పితం అని, అన్నీ కూడా కల్పిత పాత్రలే అని, ఎవరినైనా పోలి ఉంటే యాదృశ్చికం అని కార్డు వేశారు.

అయితే ఆ సినిమా  వైఎస్ వివేకా హత్య కేసుని ఆధారంగా చేసుకుని ఈ కథ, స్క్రీన్ ప్లేని దర్శకురాలు శ్రీవిద్య బసవ  రాసుకున్నారని అర్దమవుతుంది. ఇప్పుడు ఇదే సినిమాపై  మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో రెండో నిందితుడు సునీల్‌ యాదవ్‌ కేసు నమోదు చేసారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Police file case on Hatya Movie Producer based on Sunil Yadav Complaint in telugu

Police file case on Hatya Movie Producer based on Sunil Yadav Complaint in telugu


శనివారం సునీల్‌ యాదవ్‌ తన తల్లితో సహా పులివెందుల పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి డీఎస్పీ మురళీనాయక్‌కు ఫిర్యాదు చేశారు.

వివేకా హత్యపై రూపొందించిన ‘హత్య’ సినిమాలో తనను, తన తల్లిని అవమానించేలా సన్నివేశాలు చిత్రీకరించారంటూ సునీల్‌ యాదవ్‌ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అంశంపై మూడు రోజుల కిందట కడపలో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శనివారం వేకువజామున కేసు నమోదు చేశారు.

33
Police file case on Hatya Movie Producer based on Sunil Yadav Complaint in telugu

Police file case on Hatya Movie Producer based on Sunil Yadav Complaint in telugu


‘హత్య’ సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయితలను నిందితులుగా చేర్చారు. ఈ చిత్రంలోని సన్నివేశాలను ‘వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్న యూత్‌’ పేరుతో ఉన్న వాట్సప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేసి, వైరల్‌ చేసినట్లు సునీల్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో ఆ వాట్సప్‌ గ్రూప్‌ అడ్మిన్‌ పవన్‌కుమార్‌ను కేసులో మొదటి నిందితుడిగా చేర్చారు. వైకాపా కడప సోషల్‌ మీడియా వాట్సప్‌ గ్రూప్‌ అడ్మిన్‌ను రెండో నిందితుడిగా చేర్చారు. వీరితోపాటు మరికొందరిని చేరుస్తూ.. కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో పవన్‌కుమార్‌ను పోలీసులు మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. కడప సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌లో విచారించిన అనంతరం పులివెందుల తరలించారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
తెలుగు సినిమా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved