మెగా ఫ్యాన్స్ కు షాక్ , రామ్ చరణ్ పెద్ది ఇప్పట్లో లేనట్టే ?
మెగా ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్, రామ్ చరణ్ సినిమా కోసం ఎదురు చూస్తోన్న అభిమానులకు అనుకున్నటైమ్ కు పెద్ది రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడంలేదు. పెద్ది సినిమా ఆలస్యానికి కారణం ఏంటి?

పెద్దిపై భారీ అంచనాలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఈసినిమా పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తరువాత వరుసగా ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాలతో డిజాస్టర్స్ ను ఫేస్ చేశాడు. దాంతో పెద్ది సినిమాపై గట్టిగా ఫోకస్ చేశాడు. ఎలాగైనా హ్యాట్రిక్ ఫెయిల్యూర్ నుంచి బయటపడాలని పట్టుదతో ఉన్నాడు. అందుకే పెద్ది సినిమా రామ్ చరణ్ కెరీర్‌కు అంత్యంత కీలకం కాబోతోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న విలేజ్ స్పోర్ట్స్ రివెంజ్ డ్రామాలో రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది.
రంగంలోకి స్టార్స్
ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. డైరెక్టర్ చేసేది బుచ్చిబాబు అయినా.. ఈ సినిమాకు కథను మాత్రం సుకుమార్ అందించారు. పెద్దిపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి. పెద్ది మూవీకి పాన్ ఇండియా వైడ్ గా మార్కెట్ క్రియేట్ చేయడానికి ఇతర భాషల నుంచి స్టార్స్ ను రంగంలోకి దింపాడు దర్శకుడు. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ నుంచి మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతి బాబు వంటి ప్రముఖులు ఈసినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్ లేనట్టే?
ఇక పెద్ద సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయ్యి కళ్ళతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మేకర్స్ మాత్రం మొదటగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. ఫ్యాన్స్ కూడా అదే జరుగుతుంది అని ఆశతో ఉన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం, ఆ తేదీకి సినిమా విడుదల కావడం సాధ్యపడేలా కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. రామ్ చరణ్ పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. సినిమా కంప్లీట్ అవ్వడానికి ఎంత కావాలో అంతకు ఎక్కువగానే టీమ్ కు సపోర్ట్ చేస్తున్నాడు. కానీ పెద్ది షూటింగ్ కి నేచర్ నుంచి కష్టాలు తప్పడంలేదు.
దెబ్బకొట్టిన వాతావరణం
దర్శకుడు బుచ్చిబాబు ప్రణాళిక ప్రకారం డిసెంబర్ 2025 నాటికి షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని పట్టుదలతో ఉన్నాడు. దానికి తగ్గట్టు పనులన్నీటిలో వేగంపెంచారు కూడా. ఎలాగైనా మార్చిలో సినిమాను విడుదల చేయాలని ఆశించారు. కానీ హైదరాబాద్ శివారులో ఈసినిమా కోసం వేసిన భారీ సెట్టు, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్నదని తెలుస్తోంది. దీంతో చరణ్‌పై చిత్రీకరించాల్సిన యాక్షన్ సీక్వెన్స్‌లు, కీలక సన్నివేశాల చిత్రీకరణ ఆలస్యం అయింది.
క్వాలిటీ చూపించడానికి
అంతే కాదు సినిమాను మరింత క్వాలిటీగా చూపించడానికి, ప్రతి ఫ్రేమ్‌ను చెక్కుతున్నాడు దర్శకుడు, టెక్నికల్ టీమ్ కూడా ఈసినిమా విషయంలో ఎక్కడా తప్పు జరగకుండా జాగ్రత్త పడుతూ.. ఎక్కువ సమయం తీసుకుంటోంది. ఈ పరిణామాల వల్ల 2026 జనవరి చివరికి కూడా షూటింగ్ పూర్తి కావడం కష్టమే అని సమాచారం. మిగిలిన పనుల్లో విఎఫ్ఎక్స్, మ్యూజిక్, డబ్బింగ్, కలర్ గ్రేడింగ్ లాంటి అంశాలు ఉన్నాయి. వీటన్నింటిని కేవలం 50 రోజుల్లో పూర్తి చేయడం అసాధ్యమనే చెప్పాలి.
పెద్ది రిలీజ్ ఎప్పుడు?
ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌కు కీలకం కావడంతో, క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని ఫిక్స్ అయ్యారట నిర్మాతలు. ఇక షూటింగ్ లేట్ అవ్వడంతో రిలీజ్ డేట్ లో కూడా భారీ మార్పులు జరగబోతున్నట్టు సమాచారం. పెద్ది సినిమాను 2026 సమ్మర్ లేదా దసరా సీజన్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ డేట్స్ మూవీ టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. షూటింగ్ కంప్లీట్ అయిన సమయాన్ని బట్టి ఈ డేట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. పెద్ది సినిమాను త్వరగా చూసేయాలి అని ఎదురు చూస్తున్నప్యాన్స్ కు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.