MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Payal Rajput:చిరిగిన జీన్స్ లో పాయల్ చిలిపి ఫోజులు... అమ్మడు బోల్డ్ ఫోజులకు జనాలు క్లీన్ బౌల్డ్

Payal Rajput:చిరిగిన జీన్స్ లో పాయల్ చిలిపి ఫోజులు... అమ్మడు బోల్డ్ ఫోజులకు జనాలు క్లీన్ బౌల్డ్

లొకేషన్ ఏదైనా పాయల్ రాజ్ పుత్ (Payal Rajput)సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. తనదైన గ్లామరస్ ఫోటో షూట్స్ తో అందరినీ ఆకర్షిస్తోంది. తాజాగా పాయల్ షూటింగ్ సెట్స్ లో నాటీ ఫోజులతో హీటు పెంచారు. టోర్న్ జీన్స్, టాప్ ధరించి యూత్ ని క్లీన్ బౌల్డ్ చేశారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 01 2022, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


పాయల్  టాలీవుడ్ ఎంట్రీ ఆర్ ఎక్స్ 100 వంటి బ్లాక్ బస్టర్ తో అదిరిపోగా.... ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతుందని అందరూ భావించారు. అనూహ్యంగా పాయల్ కెరీర్ మాత్రం గతుకుల రోడ్డుపై ఎద్దుల బండి నడకలా సాగుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


పాయల్ గ్లామర్ కి కమర్షియల్ హీరోయిన్ గా స్టార్ తో రొమాన్స్ చేస్తుంది అనుకుంటే... ఆమె రేంజ్ ఓటీటీ కి పడిపోయింది. ఫేడ్ అవుట్ అయిన ఈషా రెబ్బా, పూర్ణ వంటి హీరోయిన్స్ తో పాటు ఓటీటీ చిత్రాలు సిరీస్లు చేస్తున్నారు. పాయల్  నటించిన 3 రోజెస్ మూవీ ఆహాలో గ్రాండ్ గా విడుదలైంది. అల్ట్రా మోడ్రన్ ఇండిపెండెంట్ ఉమన్ గా.. బోల్డ్ రోల్ లో ఆకట్టుకుంది. 

37

గతంలో కూడా పాయల్ నటించిన అనుకోని అతిథి చిత్రం ఓటిటి లో విడుదలైంది. వెండితెరపై ఆమెకు సరైన విజయాలు దక్కకపోవడంతో, ఆమె తక్కువ రెమ్యూనరేషన్ కి డిజిటల్ మూవీస్ చేస్తున్నారు. అయితే కెరీర్ ఆగకుండా ముందుకు సాగడం, ఆమె అదృష్టం.

47


హీరో ఆది సాయి కుమార్ తో పాయల్ ఓ మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి మొదట కిరాతక అనే టైటిల్ అనుకున్నారు. దాన్ని తీస్ మార్ ఖాన్ అని మార్చడం జరిగింది. తీస్ మార్ ఖాన్ చిత్రీకరణ దశలో ఉంది. ఆది సాయి కుమార్ పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. పాయల్ పరిస్థితి కూడా అదే కాగా... తీస్ మార్ ఖాన్ వీరిద్దరికి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.

57

అలాగే కన్నడలో కూడా అడుగుపెట్టింది పాయల్. ఆమె డెబ్యూ చిత్రం హెడ్ బుష్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ కామెడీ హారర్ చిత్రం చేస్తున్నారు. తమిళ భాషలో ఆమెకు ఇదే మొదటి చిత్రం. ఈమధ్యనే ఓ పంజాబీ చిత్రానికి పాయల్ సైన్ చేశారు. ఆ చిత్ర షూటింగ్ మొదలుకాగా, పాయల్ పాల్గొంటున్నారు.

67

సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్, స్వశక్తితో వెండితెర హీరోయిన్ గా ఎదిగారు. తెలుగులో ఆర్ ఎక్స్ 100మూవీతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో యూత్ హాట్ ఫేవరేట్ అయ్యారు. ఇప్పటికి కూడా పాయల్ అంటే పడిచచ్చే కుర్రకారు ఎందరో..

77

కెరీర్, సినిమా అవకాశాలు ఎలా ఉన్నా.. పాయల్ ప్రియుడు సౌరభ్ దింగ్రాతో చట్టపట్టాలేసుకు తిరుగుతుంది. పాయల్ బుల్లితెర నటిగా ఉన్నప్పటి నుండే వీరికి పరిచయం ఉంది. సౌరభ్ మ్యూజిక్ కంపోజర్ కమ్ యాక్టర్. అతడితో కలిసి కొన్ని మ్యూజిక్ ఆల్బంలో కూడా పాయల్ నటిస్తున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Latha Rajinikanth: భార్య లతని రంగంలోకి దించిన రజనీకాంత్‌.. రాజకీయాల్లో అదిరిపోయే ట్విస్ట్
Recommended image2
Karuppu Controversy: డైరెక్టర్‌పై సూర్య అభిమానులు ఫైర్.. ఇంత పెద్ద హిట్టైనా గొడవేంటి? సీఎం విజయ్‌ వల్లే వివాదం
Recommended image3
Aamir Khan 3rd Wedding: ఇద్దరు మాజీ భార్యల ముందే అమీర్‌ ఖాన్‌ మూడో పెళ్లి? జూలైలో వరుస పెళ్లిళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved