గతంలోనూ పవన్ కళ్యాణ్ vs అల్లు అర్జున్:అప్పుడెవరిది పైచేయి?!
Pawan Kalyan vs Allu Arjun : పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య గతంలో బాక్సాఫీస్ వద్ద జరిగిన పోటీ గురించి ఈ కథనం వివరిస్తుంది. 'అన్నవరం', 'దేశముదురు' సినిమాలు విడుదలైనప్పుడు వారి అభిమానుల మధ్య నెలకొన్న పరిస్థితులను తెలియజేస్తుంది.

Pawan Kalyan vs Allu Arjun: A Look Back at Their Past Box Office Clashes in telugu
Pawan Kalyan vs Allu Arjun : ఆ మధ్యన కొద్ది నెలలు పాటు కంటిన్యూగా టాలీవుడ్‌లో మెగా అభిమానులు, బన్నీ ఫ్యాన్స్ మధ్య వార్ నడిచిన విషయం తెలిసిందే. అటు పవన్, ఇటు అల్లు అర్జున్ కూడా ఒకరిపై ఒకరు ఘాటైన వ్యాఖ్యలు చేసుకున్నారు. ఇద్దరి మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా మారింది. ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్ జనసేనకు మద్దతు ఇవ్వకుండా వైసీపీ సపోర్ట్ చేయడం ఈ వివాదానికి తెరలేపింది.
దీంతో మెగా ఫ్యాన్స్ అంతా బన్నీ వ్యవహారంపై మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా పలు రకాలు విమర్శలు కూడా చేశారు. ఇక పవన్ గెలిచిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఎక్కడా కూడా పవన్‌ను కలిసింది లేదు.
అయితే ఇప్పుడు అంతా సైలెంట్ అయ్యారు. అయితే గతంలోనూ దాదాపు పదిహేనేళ్ల క్రితం భాక్సాఫీస్ దగ్గర వీళ్లద్దరి మధ్యా క్లాష్ వచ్చింది. ఆ విషయం అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
Pawan Kalyan vs Allu Arjun: A Look Back at Their Past Box Office Clashes in telugu
అప్పట్లో పవన్ కళ్యాణ్ చేసిన 'అన్నవరం' సినిమాకు అల్లు అర్జున్ 'దేశముదురు' సినిమా క్లాష్ వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ 'అన్నవరం' ముందు వచ్చింది. కానీ ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.
''అన్నవరం' విడుదలైన రెండు, మూడు వారాల వ్యవధిలో 'దేశ ముదురు' రిలీ జైంది. మొదటివారం 'దేశముదురు' కు డివైడెడ్ టాక్ వచ్చింది. రెండోవారం... మూడోవారంలోకి ప్రవేశించే సరికి పెద్ద హిట్ అనేది స్పష్టమైంది. 'దేశముదురు'కు కలెక్షన్లు అనూహ్యంగా పెరిగాయి.
Pawan Kalyan vs Allu Arjun: A Look Back at Their Past Box Office Clashes in telugu
దాంతో... ఇతర చిత్రాలకు.. 'అన్నవరం'తో సహా కలెక్షన్లు తగ్గిపోయాయి. ‘అన్నవరం'కు రిపీటెడ్ ఆడి యెన్స్ లేకుండా పోయారు.అప్పట్లో మెగాభిమానులే ఆ కుటుంబాలకి చెందిన అందరు హీరోల సినిమాలు మానకుండా రిపీట్ గా చూస్తూండేవారు.
అల్లు అర్జున్ కు అప్పటికి సెపరేట్ ఫాన్ బేస్ ఏర్పడలేదు. అప్పుడప్పుడే ఆయన ఎదుగుతున్నారు. దాంతో పవన్ , చిరంజీవి అభిమానులే అల్లు అర్జున్ సినిమాలకు వస్తూండేవారు. దాంతో సాధారణంగా రెండోసారి పవన్ కళ్యాణ్ చిత్రం చూసే అలవాటున్న అభిమానులు దేశ ముదురు చూసి ఆగిపోయారు.
'దేశముదురు' హిట్ వల్ల అల్లు అర్జున్ స్టేమినా.... పవన్కళ్యాణ్ స్టేమినా కంటే పెరి గిందని చెప్పలేకపోయినా... అర్జున్ యూత్ ఫుల్ ఫెర్మార్మెన్స్ యువప్రేక్షకుల్ని బాగా అల రించగలిగింది. అలా భాక్సాఫీస్ దగ్గర అప్పుడు ఈ ఇద్దరు హీరోలు పోటీ పడ్డారు.