- Home
- Entertainment
- Pawan Kalyan: `తమ్ముడు` కుమ్ముతున్నాడు.. `జల్సా` రచ్చ షురూ.. మహేష్ రికార్డ్ లు బ్రేక్ ?
Pawan Kalyan: `తమ్ముడు` కుమ్ముతున్నాడు.. `జల్సా` రచ్చ షురూ.. మహేష్ రికార్డ్ లు బ్రేక్ ?
మహేష్ బర్త్ డే సందర్భంగా విడుదలైన `పోకిరి` సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లని సాధించింది. ఇప్పుడు పవన్ దాన్ని బీట్ చేశారు. రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. `తమ్ముడు` కుమ్ముతున్నాడు.

స్టార్ హీరోల పుట్టిన రోజుల సందర్భంగా వారి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలను స్పెషల్‌గా ప్రదర్శించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. మహేష్‌బాబు(Maheshbabu) పుట్టిన రోజు సందర్భంగా `పోకిరి`(Pokiri) సినిమాని చాలా చోట్ల ప్రదర్శించారు. స్పెషల్ షోస్ వేయగా, అవి ముందుగానే హౌజ్ ఫుల్ అయ్యాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ స్థాయి ఆదరణ దక్కడంతో అంతా షాక్ అయ్యారు. ఈ చిత్రం కేవలం హైదరాబాద్‌లోనే 16 లక్షలు కలెక్ట్ చేసింది.
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan Kalyan) ఫ్యాన్స్ ఆ ట్రెండ్‌ని కొనసాగిస్తున్నారు. మహేష్ `పోకిరి` రికార్డులను బ్రేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2 అనే విషయం తెలిసిందే. మూడు రోజుల ముందు నుంచే ఆయన నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రదర్శిస్తున్నారు. పవన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ `తమ్ముడు`(Thammudu), `జల్సా` (Jalsa)చిత్రాలు ప్రధానంగా ఉన్నాయి.
వీటిని ముందుగానే ప్రదర్శిస్తున్నారు. ప్రేమ కథ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన `తమ్ముడు` చిత్రాన్ని మంగళవారం రాత్రి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శిస్తున్నారు. వందకుపై స్పెషల్‌షో వేసినట్టు తెలుస్తుంది. వీటన్నింటికి విశేషమైన ఆదరణ దక్కుతుంది. ఐమాక్స్ లో బుధవారం `కోబ్రా` చిత్రం విడుదల కాగా, మూడు స్క్రీన్లు మినహా అన్ని స్క్రీన్లలోనూ `తమ్ముడు` సినిమానే ప్రదర్శిస్తుండటం విశేషం.
దాదాపు 23 ఏళ్ల తర్వాత విడుదలైన `తమ్ముడు` చిత్రం కోసం పవన్ ఫ్యాన్స్ ఎగబడటం విశేషం. థియేటర్లలో అరుపులతో హోరెత్తించారు. ఇప్పటికే ఈ చిత్రం మహేష్ `పోకిరి` రికార్డులను బ్రేక్ చేసేందని తెలుస్తుంది. ఈ జోడు ఈ రోజు మొత్తం కొనసాగబోతుంది. మరోవైపు రేపటి నుంచి `జల్సా` రచ్చ షురూ కానుంది. సెప్టెంబర్ 1 నుంచి దాదాపు ఐదు వందల స్క్రీన్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తుండటం విశేషం.
`జల్సా` సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ హైదరాబాద్‌లో సుమారు నలభై లక్షలున్నట్టు తెలుస్తుంది. రేపటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఈ చిత్రం కోటీకిపైగా కలెక్షన్లు రాబట్టేఛాన్స్ ఉంది. కేవలం హైదరాబాద్ సిటీలోనే ఈ రేంజ్‌లో ఉంటే ఇక ఏపీలో, నైజాంలో, ఓవర్సీస్‌లో ఈ రచ్చ ఇంకే రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. థియేటర్ల హోనర్లకి కాసుల వర్షం కురిపిస్తున్నాయని చెప్పొచ్చు. మరి ఇది ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. అభిమానుల రచ్చ మాత్రం మరో లెవల్‌లో ఉంటుందని చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ని, క్రేజ్, ఫాలోయింగ్‌ని మరోసారి ఈ షోస్ నిరూపిస్తున్నాయని చెప్పొచ్చు. ఆయన సినిమాలు చేస్తున్నా, లేకపోయినా ఆ క్రేజ్ తగ్గదు కదా మరింత పెరుగుతుందని ఈ క్రేజ్ తెలియజేస్తుంది. ఇదిలా ఉంటే పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న `హరి హర వీరమల్లు` చిత్రం నుంచి సర్‌ప్రైజ్ ఇవ్వబోతుంది యూనిట్.