మహేష్ హ్యాండిచ్చిన దర్శకుడితో పవర్‌స్టార్.. షాకిస్తున్న పవన్ రెమ్యూనరేషన్ ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెడ్ స్పీడ్‌తో సినిమాలు చేస్తున్నారు. అంతే స్పీడ్‌గా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా ఆయన మహేష్ హ్యాండిచ్చిన దర్శకుడితో సినిమా చేయబోతున్నారట. అంతేకాదు పవన్ రెమ్యూనరేషన్ న్యూస్ కూడా ఇప్పుడు షాకిస్తుంది.
పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తూ `వకీల్‌సాబ్`చిత్రంలో నటించారు. ఇటీవల విడుదలైన సినిమా సంచలన విజయం సాధించింది. వందకోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. దీంతో అదే ఉత్సాహంలో కొత్త ప్రాజెక్ట్ లకు ఓకే చెబుతున్నారు పవన్.
తాజాగా దిల్‌రాజు నిర్మాతగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త చక్కర్లు కొడుతుంది. అయితే దీనికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాని మహేష్ చేయాల్సింది. కానీ చివరి నిమిషంలో వంశీ చెప్పిన కథని పక్కన పెట్టి పరశురామ్‌తో `సర్కారు వారి పాట` చేస్తున్నాడు మహేష్. దీంతో ఇప్పుడు దాన్ని పవన్‌తో వంశీ పైడిపల్లి చేయబోతున్నారట. దీన్ని దిల్‌రాజు నిర్మించబోతున్నట్టు సమాచారం. మరి కథ అదేనా? లేక వేరే కథా? అన్నది తెలియాల్సి ఉంది.
దీంతోపాటు భగవాన్ పుల్లారావులకు కూడా పవన్ సినిమా చేస్తానని చెప్పాడట. అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఈ లెక్కన ఇప్పుడు పవన్ చేతిలో ఆరు సినిమాలున్నాయి. దీంతో మరో ఐదేళ్లపాటు పవన్ కూడా ఫుల్ బిజీగా ఉండబోతున్నాడని చెప్పొచ్చు.
ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో `హరిహర వీరమల్లు` సినిమా చేస్తున్నాడు పవన్. దీనితోపాటు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్‌లో నటిస్తున్నాడు. అలాగే హరీష్ శంకర్‌తో ఓ సినిమా చేయనున్నారు. వీటితోపాటు సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లోనూ ఓ సినిమా కమిట్‌మెంట్ ఉంది. దీనికి పవన్ ఫ్రెండ్ రామ్ తాళ్లూరి నిర్మించబోతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తి కావడానికి నాలుగు నుంచి ఐదేళ్లు పడుతుందని చెప్పొచ్చు.
అంతేకాదు వచ్చే ఏడాది నుంచి పవన్ నుంచి ఏడాదికి రెండు సినిమాల చొప్పున రిలీజ్ చేయబోతున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకోబోతున్నారని చెప్పొచ్చు. అన్నట్టు పవన్ ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో తన ఫామ్‌హౌజ్‌లోనే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే పవన్ రెమ్యూనరేషన్ న్యూస్ ఇప్పుడు షాక్ ఇస్తుంది. రీఎంట్రీ ఇస్తూ నటించిన `వకీల్‌సాబ్`కి పవన్ ఏకంగా యాభై కోట్లు పారితోషికంగా తీసుకున్నారట. ఈ సినిమా విజయం సాధించడంతో పారితోషికం పెంచాడని టాక్. దాదాపు పది కోట్ల నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ పెంచాడని, ఈ లెక్కన కొత్తగా ఒప్పుకుంటున్నా సినిమాలకి 60 నుంచి 70కోట్లు పారితోషికం తీసుకోబోతున్నాడనే వార్త వైరల్‌గా మారింది. అయితే ఇందులో కొంత రెమ్యూనరేషన్ అని, కొంత లాభాల్లో వాటా? అని టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.