- Home
- Entertainment
- Pawan Kalyan : ‘బ్రో’ సినిమా.. ఆ విషయంలో నన్ను ఘోరంగా తిట్టారు.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్
Pawan Kalyan : ‘బ్రో’ సినిమా.. ఆ విషయంలో నన్ను ఘోరంగా తిట్టారు.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన చివరి సినిమా గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రాఫిక్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తను తిట్లు కూడా పడ్డానంటూ స్పందించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు ప్రస్తుతం మారుమోగుతున్న విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గ్గానే ఉంటోంది.
పవన్ కళ్యాణ్ అటు సినిమాలు చేస్తూనే ఇటు రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం పూర్తిగా పాలిటిక్స్ కే టైమ్ కేటాయించారు.
Pawan Kalyan
త్వరలో ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇక ఆయన 2024 స్థానిక ఎన్నికల్లో పిఠాపురం (Pithapuram) నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు.
ఈ క్రమంలో ఆయన తన చివరి సినిమా ‘బ్రో’ (Bro The Movie) పై ఆసక్తికరంగా కామెంట్స్ చేశారు. సినిమాలో వాడిన గ్రాఫిక్స్ పై స్పందించారు. దాని వల్ల తను తిట్లు కూడా పడ్డానన్నారు.
ఓ సందర్భంలో పవన్ ‘బ్రో’ సినిమా గ్రాఫిక్స్ గురించి మాట్లాడుతూ... ’నేను సినిమా లో కూడా గ్రాఫిక్స్ ఎక్కువ వాడను... అవి బాగా రాకపోతే దొరికిపోతం అని. మొన్న BRO సినిమా లో గ్రాఫిక్స్ బాలేదు అని అందరూ తిట్టారు’... అని మాట్లాడారు.
అయితే గతంలో ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రంలో గ్రాఫిక్స్ బాలేని విషయం తెలిసిందే. ఆడియెన్సే కాదు ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు. ఇక పవన్ కళ్యాణ్ కు కూడా అలాంటి పరిస్థితి ఎదురైనట్టు ఆయన కామెంట్స్ ను బట్టి అర్థమవుతోంది.