- Home
- Entertainment
- షార్ట్ ఫ్రాక్ లో టెంప్ట్ చేసే సోకులు... ఊర్వశి రాతెలా గ్లామర్ కి సోషల్ మీడియా షేక్!
షార్ట్ ఫ్రాక్ లో టెంప్ట్ చేసే సోకులు... ఊర్వశి రాతెలా గ్లామర్ కి సోషల్ మీడియా షేక్!
బాలీవుడ్ భామ ఊర్వశి రాతెలా మరో టెంప్టింగ్ ఫోటో షూట్ తో ఫ్యాన్స్ ని పలకరించారు. ఫ్రాక్ లో స్టార్ లేడీ గ్లామర్ ట్రీట్ అదిరింది. దాంతో ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.

Urvashi Rautela
ఊర్వశి రాతెలా మోడల్ గా దూసుకుపోతుంది. అదే సమయంలో సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేస్తుంది. ఈ మధ్య ఊర్వశి రాతెలా ఐటెం నెంబర్స్ ఎక్కువగా చేస్తున్నారు.
Urvashi Rautela
రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ స్కందలో ఊర్వశి 'కల్ట్ మామ' అనే ఐటెం నెంబర్ చేసింది. దర్శకుడు బోయపాటి శ్రీను స్కంద చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. శ్రీలీల హీరోయిన్ గా చేసింది.
Urvashi Rautela
అలాగే సంక్రాంతి బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య మూవీలో 'బాస్ పార్టీ' సాంగ్ కి ఇరగదీసింది. ఇక పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో చిత్రంలో ఓ ఐటెం నెంబర్ చేసింది. తెలుగులో ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.
Urvashi Rautela
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఊర్వశి రాతెలా మిస్ దివా 2015 విన్నర్. విశ్వసుందరి పోటీల్లో కూడా పాల్గొంది. పలు బ్యూటీ కాంపిటీషన్స్ లో మెరిసింది. ప్రాణం పోసుకున్న బార్బీ డాల్ లా ఉండే ఊర్వశి అందాలకు కోట్లలో అభిమానులు ఉన్నారు. ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని ఏకంగా 68 మిలియన్ ఫాలో అవుతున్నారు.
కాగా గత ఏడాది ఊర్వశి తమిళ మూవీ ది లెజెండ్ లో నటించారు. శరవణన్ అరుళ్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆశించినంతగా ఆడలేదు. అయితే ఊర్వశి మాత్రం కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. గుర్తింపు లేని హీరో కావడంతో పాటు ఆయన కోరి ఎంచుకోవడంతో బాగా డిమాండ్ చేసిందట. శరవణన్ సొంతగా నిర్మించి నటించారు.
నాలుగైదు సినిమాల సంపాదన ది లెజెండ్ మూవీతో రాబట్టింది. ది లెజెండ్ పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల చేశారు. వ్యాపారవేత్త హీరోగా మారడంతో సినిమాకు ప్రచారం దక్కింది. కొంచెం కంటెంట్ ఉన్నా... సినిమాకు ఫలితం దక్కేది. చాలా ఆలస్యంగా లెజెండ్ మూవీ ఓటీటీలోకి వచ్చింది.